విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పవన్ కళ్యాణ్ ఏపీ వస్తున్నా జనసేనలో కనిపించని జోష్ , జనసేనాని తీరుపై ప్రజల్లోనూ చర్చ !!

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలలో పవన్ కళ్యాణ్ ప్రభావం అంతగా కనిపించడం లేదా ? ఒకప్పుడు పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి వస్తున్నాడంటే రెట్టించిన ఉత్సాహంతో ఎదురు చూసిన జనసేన శ్రేణులు కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ కోసం నిరీక్షించడం లేదా? పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో తాజా పరిస్థితులపై పెద్దగా దృష్టి సారించడం లేదా ? అధికార వైసీపీపై రాష్ట్ర ప్రజల సమస్యల కోసం పోరాడటం లేదా ? అంటే అవును అన్న సమాధానమే వస్తుంది.

 నేడు విజయవాడకు పవన్ కళ్యాణ్ .. అయినా జనసేనలో నో జోష్

నేడు విజయవాడకు పవన్ కళ్యాణ్ .. అయినా జనసేనలో నో జోష్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు విజయవాడకు రానున్నారు . అయితే గతంలోలా జనసేన పార్టీ శ్రేణుల్లో పవన్ కళ్యాణ్ రాకపై పెద్దగా ఉత్సాహం కనిపించని పరిస్థితి. పవన్ కళ్యాణ్ వస్తాడు, ప్రజా సమస్యల కోసం పోరాటం చేస్తాడు అని అందరూ భావిస్తే పవన్ కళ్యాణ్ మాత్రం వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. ఒకవేళ ఏదైనా పోరాటం చేస్తామని ప్రకటన చేసినా తూతూ మంత్రంగా ఆందోళనలు నిర్వహించి మమ అనిపిస్తున్నారు . ఇక తాజాగా ఆయన మరోమారు విజయవాడ వస్తున్నా పార్టీ నేతల్లో మాత్రం జోష్ కనిపించటం లేదు.

రేపు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్న పవన్ కళ్యాణ్

రేపు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్న పవన్ కళ్యాణ్


ఈ రోజు సాయంత్రం పవన్ కళ్యాణ్ విమానంలో విజయవాడకు వెళ్లనున్నారు . రేపు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఆయన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్నారు. జాతీయ పతాకాన్ని ఎగురవెయ్యనున్నారు.అనంతరం జనసేన పార్టీ ముఖ్యులతో భేటీ కానున్నారు. రాష్ట్రంలో తాజా పరిణామాలు, ప్రభుత్వ విధానాలపై పవన్ కళ్యాణ్ పార్టీ నేతలతో చర్చ జరపనున్నారు. అయితే పవన్ వస్తున్నాడు అంటే ఒకప్పుడు ఉన్న ఉత్సాహం జనాల్లో కనిపించకపోవటం గమనార్హం.

గత పర్యటనలో సమర శంఖం పూరిస్తారనుకుంటే సైలెంట్ గా ఉన్న జనసేనాని

గత పర్యటనలో సమర శంఖం పూరిస్తారనుకుంటే సైలెంట్ గా ఉన్న జనసేనాని


ఇంతకు ముందు పర్యటనలో కూడా పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు ఆయన రాష్ట్రంలో అనేక కీలక విషయాలపై పోరాటం చేస్తారని అంతా భావించారు. నిరుద్యోగ సమస్యపై సమర శంఖం పూరిస్తారని భావిస్తే పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి కార్యాలయాలలో అధికారులకు వినతి పత్రాలు ఇచ్చి, నూతన జాబ్ క్యాలెండర్ ఇచ్చి ఉద్యోగాల భర్తీ చెయ్యాలని ప్రభుత్వానికి డిమాండ్ తో ఒక ప్రకటన చేసి మమ అనిపించారు. ఇక అనేక సమస్యలపై పోరాటం చేస్తారని భావించినా అవేవీ పట్టనట్టు పవన్ కళ్యాణ్ సైలెంట్ అయ్యారు.

 విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారం, రాజధాని అమరావతి ఉద్యమంపై పవన్ మౌనం

విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారం, రాజధాని అమరావతి ఉద్యమంపై పవన్ మౌనం

రాష్ట్రంలో ప్రస్తుతం బర్నింగ్ టాపిక్ గా ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారం మీద కానీ, అలాగే రాజధాని అమరావతి ఉద్యమం 600రోజులుగా కొనసాగుతున్నా, రాజధాని పోరాటం గురించి గానీ పవన్ కళ్యాణ్ కనీసం ఒక ప్రకటన కూడా చెయ్యలేదు. ఇక బీజేపీతో కలిసి సాగుతున్న పరిస్థితులు కూడా కనిపించటం లేదు. దీంతో పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్తానం మరోమారు చర్చనీయాంశంగా మారుతుంది. పార్టీ శ్రేణుల్లోనూ నైరాశ్యం కనిపిస్తుంది. ఇక తాజాగా మరోమారు పవన్ కళ్యాణ్ వస్తున్నా అదే తరహా పరిస్థితి ఉంటుందని అంతా భావిస్తున్నారు.

పార్టీ నేతలకు బోధపడని పవన్ తీరు .. పార్టీ భవిష్యత్ ప్లాన్ ఏంటో అంతా అయోమయం

పార్టీ నేతలకు బోధపడని పవన్ తీరు .. పార్టీ భవిష్యత్ ప్లాన్ ఏంటో అంతా అయోమయం

గత పర్యటనలోనే వరుస సమావేశాలతో హడావిడి చేసిన జనసేనాని పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ప్రజా సమస్యలపై దృష్టి సారిస్తారని భావిస్తే పవన్ పెద్దగా దృష్టి సారించలేదు. పార్టీకి దిశానిర్దేశం చేయడానికి మంగళగిరి పార్టీ కార్యాలయంలో పొలిటికల్ అఫైర్స్ కమిటీ తో భేటీ అయ్యి భవిష్యత్ ప్రణాళిక రూపొందిస్తారు అని భావిస్తే అసలు జనసేన పార్టీ భవిష్యత్ కార్యాచరణ ఏదో ఇంతవరకు బోధ పడలేదు. జనసేన పార్టీ నేతలు కార్యకర్తలు కూడా పవన్ తీరుతో సైలెంట్ గా ఉన్నారు. ప్రస్తుతం పవన్ రాష్ట్రానికి వస్తున్నారు అన్నా ఒకప్పుడు కనిపించిన జోష్ జనసేన నాయకుల్లో కనిపించటం లేదు.

English summary
Janasena chief Pawan Kalyan will arrive in Vijayawada today. However,there was not much enthusiasm for the arrival of Pawan Kalyan in the Janasena party ranks. Everyone thinks that Pawan Kalyan will come and fight for public issues, but Pawan Kalyan is keeping a tactical silence. Although he is coming to Vijayawada again , Josh is not seen among the party leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X