సత్యసాయి సమాధిని దర్శించుకొన్న పవన్ కళ్యాణ్
Recommended Video

అనంతపురం:అనంతపురం జిల్లా పుట్టపర్తిలో సత్యసాయి సమాధిని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సోమవారం నాడు ఉదయం సందర్శించుకొన్నారు.అనంతపురం జిల్లాలో మూడు రోజుల పాటు పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ పర్యటన సోమవారం నాడు చివరి రోజు. దీంతో పవన్ కళ్యాణ్ పుట్టపర్తి సోమవారం ఉదయం సత్యసాయి సమాధి వద్ద శ్రద్దాంజలి ఘటించారు.
సత్యసాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో సాగుతున్న సేవా కార్యక్రమాలను జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రశంసించారు.ఓ చిన్న గ్రామంలో సేవా కార్యక్రమాలను ప్రారంభించి ప్రపంచ వ్యాప్తంగా తన సేవా కార్యక్రమాలను సత్యసాయి విస్తరించిన విషయాన్ని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు.

సాటి మనిషికి సేవ చేయడమే సత్యసాయి సేవాట్రస్ట్ ఉద్దేశ్యమని పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. రాజకీయాల్లోకి ప్రవేశించిన తాను కూడ సాటి మనిషికి సహయం చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నట్టు పవన్ కళ్యాణ్ చెప్పారు.
తనకు సత్యసాయి ఆశీస్సులను అందించాలని పవన్ కళ్యాణ్ కోరుకొన్నారు. అంతకుముందు పవన్ కళ్యాణ్‌కు సత్యసాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాలను నిర్వహకులు వివరించారు.












Click it and Unblock the Notifications