వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అధికారంలోకి వస్తే ఎవర్నీ వదలను, లోకేష్! నిన్ను క్షమించను, బాబూ! నేను నీ మామను కాను: పవన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

తాడేపల్లిగూడెం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన తాడేపల్లిగూడెం పర్యటనలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ఎవరినీ వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.

'భారతిని అడ్డుపెట్టుకొని జగన్ రాజకీయం, ఆమెపై కేసుతో జగన్‌కు అర్థంకావట్లేదు''భారతిని అడ్డుపెట్టుకొని జగన్ రాజకీయం, ఆమెపై కేసుతో జగన్‌కు అర్థంకావట్లేదు'

టీడీపీ బీసీల పార్టీ అంటారని, కానీ తెలంగాణలో ఎక్కువగా బీసీలు ఉంటారని, అదే నిజమైతే అక్కడ టీడీపీని ఎందుకు తన్ని తగిలేశారని ప్రశ్నించారు. కులాలను అడ్డు పెట్టి కేవలం చంద్రబాబు, జగన్‌ల కుటుంబాలు, వారి సిండికేట్లు మాత్రమే బాగుపడుతున్నారని చెప్పారు.

 అవసరమైతే నమస్కారం లేకుంటే.. బాబుపై పవన్

అవసరమైతే నమస్కారం లేకుంటే.. బాబుపై పవన్

అవసరమున్నప్పుడు నమస్కారాలు పెట్టి, ఆ తర్వాత పక్కన పెట్టే వ్యక్తి చంద్రబాబు అని అందరికీ తెలిసిందేనని పవన్ అన్నారు. మన మధ్య మీడియా లేదని, వేల కోట్ల రూపాయలు లేవన్నారు. నాకు ఉన్న బలమంతా మీరు (యువత, అభిమానులు) అన్నారు. టీడీపీ నేతలు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

Recommended Video

ఎన్టీఆర్ ను మించిన నటుడా పవన్: అశోక్ గజపతిరాజు
నేను పదవి అడగలేదు, నీ కోట్ల రూపాయలు వద్దు

నేను పదవి అడగలేదు, నీ కోట్ల రూపాయలు వద్దు

నేను పదవి అడగలేదని, నీ కోట్లాది రూపాయలు నాకు అవసరం లేదని చంద్రబాబును ఉద్దేశించి పవన్ అన్నారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు ఓ మాట మాట్లాడాలన్నారు. పదిసార్లు మాట మార్చవద్దన్నారు. హామీలు నెరవేర్చకుంటే ఎందుకు ఇవ్వలేదో చెప్పాలన్నారు. నేను ప్రజా సమస్యలపై అడుగుతుంటే వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారన్నారు. నిడదవోలు రైల్వే ఆర్వోబీ కట్టలేదని నేను అడిగితే 3 పెళ్లిళ్లు చేసుకున్నానని అంటారని, నేనేం ఒక్క పెళ్లి చేసుకొని బలాదూర్‌గా తిరగలేదన్నారు. మంచో చెడో జరిగింది.. ఒళ్లు కొవ్వెక్కి మూడు పెళ్లిళ్లు చేసుకోలేదన్నారు.

 వెన్నుపోటు పొడిస్తే పొడిపించుకోవడానికి ఎన్టీఆర్‌ను కాను

వెన్నుపోటు పొడిస్తే పొడిపించుకోవడానికి ఎన్టీఆర్‌ను కాను

మీరు వెన్నుపోటు పొడిస్తే నేను పొడిపించుకోవడానికి నేను ఎన్టీఆర్‌ను కాదని టీడీపీని ఉద్దేశించి అన్నారు. ఎన్టీఆర్ చాలా మంచి వ్యక్తి అన్నారు. కానీ నా వద్ద మీ వెన్నుపోటు రాజకీయాలు చెల్లవన్నారు. మీ వెన్నుపోటు రాజకీయాలు జగన్ వద్ద, మరొకరి వద్ద చేసుకోండన్నారు. నేను అండగా ఉంటానని, ప్రజలకు ఏం చేయకుంటే మాత్రం ఊరుకునేది లేదన్నారు. ఇచ్చిన హామీలు ఇవ్వమంటే నాపై విమర్శలు చేస్తారా అన్నారు.

 లోకేష్.. క్షమించను.. అధికారంలోకి వస్తాను, సంగతి చూస్తాను

లోకేష్.. క్షమించను.. అధికారంలోకి వస్తాను, సంగతి చూస్తాను

లోకేష్‌కు, టీడీపీ నేతలకు ఒక్కటే చెబుతున్నానని, తన వద్దకు వచ్చి మద్దతు అడిగారని, పశ్చిమ గోదావరి జిల్లాలో 15 సీట్లు గెలుచుకున్నారని, ఇప్పుడు మాత్రం తనపైనే విమర్శలు చేస్తున్నారని పవన్ మండిపడ్డారు. లోకేష్ గారిని క్షమించను.. మర్చిపోకండి.. ఖబడ్దార్ అని హెచ్చరించారు. మా ఆడపడుచులను దూషించిన వారు ఖబడ్దార్ అన్నారు. నా తల్లిని దూషించారన్నారు. 2019లో అధికారంలోకి వస్తామని, అక్రమాలకు పాల్పడ్డ వారి అందరి సంగతి చూస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ ఆస్తులు దోచుకున్న వారిని ఒక్కరినీ వదిలేది లేదన్నారు. అన్నింటిని వెనక్కి తీసుకుంటామన్నారు.

నేను చేతులు కట్టుకొని కూర్చోలేదు

నేను చేతులు కట్టుకొని కూర్చోలేదు

మేం చిన్న కుటుంబాల నుంచి వచ్చామని, పెద్దగా చదువుకోలేదని చెప్పారు. కానీ మాకు సంస్కారం ఉందన్నారు. మీ ఇష్టానికి తనపై దుష్ప్రచారం చేస్తే ఊరుకునేది లేదని చంద్రబాబును ఉద్దేశించి హెచ్చరించారు. నేను చేతులు కట్టుకొని కూర్చేలేదన్నారు. నేను మీకు అండగా ఉంటే మా జీవితాలపై, మా ఇంటి ఆడపడుచులపై మాట్లాడుతారా అని నిలదీశారు. మీరు మా ఆడపడుచులను తిట్టినా మేం దిగజారమన్నారు. చంద్రబాబు ప్రత్యేక హోదాపై ఎన్నోసార్లు మాట మార్చారన్నారు. నేను ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం వచ్చానని, పారిపోయేందుకు రాలేదన్నారు.

ఎన్టీఆర్ చెప్పారు.. ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం జనసేన

తాను అన్ని కులాలు, మతాలను సమానంగా చూస్తానని పవన్ చెప్పారు. నాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ ఆంధ్రుల ఆత్మగౌరవం, తెలుగువారి ఆత్మగౌరవం పేరుతో టీడీపీని స్థాపించారని, కానీ ఇదే ఆంధ్రులను దోచేవారిగా చెబుతుంటే టీడీపీ ఏం చేసిందని మండిపడ్డారు. ఇప్పుడు నేను కూడా అదే ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం జనసేనను స్థాపించానని చెప్పారు. తెలుగుజాతి సమైక్యత కోసం ఉద్భవించిందన్నారు. నేను 65 ఏళ్ల వయస్సులో రాజకీయాల్లోకి రాలేదని, పదేళ్ల క్రితమే వచ్చానని, నా భారత్ కోసం నా ఏపీ కోసం, నా తెలంగాణ కోసం, నా తెలుగు రాష్ట్రాల కోసం రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. కష్టాలు, కన్నీళ్లు ఉంటాయని, భరిస్తామని, మీలో ఒకరిని అన్నారు. ఆడపడుచులకు అండగా నిలబడతానని చెప్పారు.

English summary
Jana Sena chief Pawan Kalyan warning to Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu, Minister Nara Lokesh and YSRCP chief YS Jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X