పవన్‌పై వైసీపీ నేత ప్రశంసలు, జగన్‌తో కలుస్తారని సంచలనం

Recommended Video

    జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మాజీ ఎంపీ వరప్రసాద్ ప్రశంసలు

    చిత్తూరు: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎంపీ వరప్రసాద్ ప్రశంసలు కురిపించారు. తాను పవన్‌ను చాలా దగ్గరగా గమనించానని, ఆయన విజన్ ఉన్న నాయకుడని చెప్పారు. త్వరలో వైసీపీ, జనసేనలు కలుస్తాయని ఆయన మరోసారి అభిప్రాయపడ్డారు. గతంలోను ఇలాంటి వ్యాఖ్యలు చేశారు.

    రెండు పార్టీలు కలుస్తాయని, వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో తాను ప్రజారాజ్యం పార్టీ తరఫున తిరుపతి నుంచి ఎంపీగా పోటీ చేశానని గుర్తు చేశారు. అప్పుడు పవన్‌ను చాలా దగ్గరగా చూశానని తెలిపారు.

    Pawan Kalyan will support YS Jagan in 2019, YSRCP leader Varaprasad

    సమాజానికి ఏదైనా చేయాలన్న తపన, బాధ్యత ఆయనలో కనిపిస్తాయన్నారు. వైసీపీలో చాలా విశ్వాసంగా పని చేస్తున్న తానే ఈసారి తిరుపతి నుంచి బరిలోకి దిగుతానని చెప్పారు. టికెట్ తనకే వస్తుందన్నారు. ప్రజా నేతగా జగన్, ప్రజాద్రోహిగా చంద్రబాబు చరిత్రలో నిలిచిపోతారన్నారు.

    ఇదం జగత్ టీజర్ విడుదల చేసిన జగన్

    సుమంత్ హీరోగా నటిస్తున్న ఇదం జగత్ సినిమా టీజర్‌ను వైయస్ జగన్ ఆవిష్కరించారు. విశాఖపట్టణం జిల్లాలోని పాయకరావుపేట నియోజకవర్గం దార్లపూడి గ్రామంలోని పాదయాత్ర విడిది శిబిరంలో ఇదం జగత్ చిత్ర యూనిట్ సమక్షంలో ఈ టీజర్‌ను విడుదల చేశారు. చిత్రయూనిట్‌కు జగన్ అభినందనలు తెలిపారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+