వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజకీయం: బాలయ్య దారిలో పవన్ కళ్యాణ్?

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి అడుగు పెడుతారా, లేదా అనేది ఇప్పుడే తేలే అవకాశం లేదు. ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాల నిర్మాణం పూర్తయితే తప్ప ఆయన ఏం చేస్తారనేది తెలియదు. జనసేన పార్టీని ప్రకటించిన పవన్ కళ్యాణ్ దాని నిర్మాణంపై దృష్టి పెట్టలేదు.

జనసేన పార్టీ నిర్మాణంపై పూర్తి స్థాయిలో దృష్టి పెడితే తప్ప ఆయన రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలో వస్తారని అనుకోవచ్చు. తన పార్టీకి నిర్మాణం లేదని, దాన్ని నిర్మాణంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ ఇప్పటికే పలుమార్లు అన్నారు. ఇటీవలి ఎన్నికల్లో బిజెపికి, తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి, ఆ పార్టీల కోసం ప్రచారం చేసి ప్రధాన రాజకీయ నాయకుడిగా పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చారు.

Pawan Kalyan will take decision on Jana Sena

ప్రస్తుతం తెలుగు సినిమాల్లో పవన్ కళ్యాణ్‌కు ఉన్న క్రేజ్ మరో హీరోకు లేదు. రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలో రావాలంటే సినిమాలను వదులుకోవాల్సి వస్తుంది. అయితే, ఆయన సినిమాలను వదులుకుంటారా అనేది సందేహం. బాలకృష్ణ కూడా రాజకీయాల్లోకి వచ్చి, శాసనసభ్యుడిగా విజయం సాధించారు. అయితే, సినిమాల్లో నటించడానికి ఆయన మంత్రి పదవి తీసుకోలేదు.

కొంత సమయాన్ని రాజకీయాలకు, మరి కొంత సమయాన్ని సినిమాలకు కేటాయించాలని బాలయ్య నిర్ణయం తీసుకున్నారు. బాలయ్య దారిలోనే పవన్ కళ్యాణ్ నడిచే అవకాశం కూడా లేకపోలేదని అంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలపై దృష్టి పెడుతానని పవన్ కళ్యాణ్ గతంలో చెప్పారు.

హైదరాబాద్ నగరపాలక సంస్థ ఎన్నికల్లో పార్టీ తరఫున అభ్యర్థులను పోటీకి దించాలంటే ముందస్తు కసరత్తు అవసరం. ఆ కసరత్తు చేసే వెసులుబాటు పవన్ కళ్యాణ్‌కు ఉందా అనేది సమస్య. ఈ ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ బిజెపి, టిడిపి కూటమికి మద్దతు ఇస్తారా అనేది వేచి చూడాలి.

English summary
Jana Sena chief and Telugu film hero Pawan Kalyan may decide on his political future and Jana sena future.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X