జనంలోకి జనసేనాని: ఉత్తారంధ్రకు పవన్, 9న ఒంగోలులో పడవ బాధితులకు పరామర్శ

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనంలోకి వెళ్తున్నారు. బుధవారం నుంచి నాలుగు రోజుల పాటు ఆయన జనంలో ఉండనున్నారు. సినిమాల్లో బిజీగా ఉన్న ఆయన ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తున్న విషయం తెలిసిందే.

రిజర్వేషన్ల ఎఫెక్ట్: చంద్రబాబుకు గట్టి షాకిచ్చిన మంత్రి

ఆయన బుధవారం నుంచి మూడు రోజుల ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటించనున్నారు. బుధ, గురు, శుక్రవారాలు ఆయన విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఆయన ఆత్మహత్య చేసుకున్న డ్రెడ్జింగ్ కార్పోరేషన్ ఉద్యోగి కుటుంబాన్ని పరామర్శిస్తారు.

Pawan Kalyan will tour Uttarandha and Ongole

ఆ తర్వాత 9వ తేదీన ఒంగోలులో పర్యటిస్తారు. అక్కడ ఇటీవల కృష్ణా నదిలో పడవ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శిస్తారు. మూడు రోజులు ఉత్తరాంధ్రలో, ఓ రోజు ఒంగోలులో పర్యటిస్తారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Jana Sena chief Pawan Kalyan will tour in Uttarandha districts and Ongole from Wednesday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి