మోడీకే, ప్రాంతీయ పార్టీలకు నో: టిడిపికి పవన్ ఝలక్!

మోడీతో పవన్ భేటీకి సోము వీర్రాజు మధ్యవర్తిగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో పవన్ ఆయనకు ఓ లేఖ రాసినట్లుగా తెలుస్తోంది. సమాచారం మేరకు... టిడిపితో సహా ఏ ప్రాంతీయ పార్టీకి మద్దతు ఇవ్వాలని తాను ఈ రోజు వరకు నిర్ణయించుకోలేదని, లేనిపోని పుకార్లు వస్తున్న నేపథ్యంలో ఈ విషయాన్ని చెబుతున్నానని, జనసేన, మోడీ మధ్య సత్సంబంధాలు పెంపొందాలని, అవి మరింత పటిష్టం కావాలని మాత్రమే ఆకాంక్షిస్తున్నానని పవన్ తన లేఖలో పేర్కొన్నారు.
హైదరాబాదులోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఉన్న వీర్రాజుకు ఈ లేఖ అందిన వెంటనే ఆయన పవన్‌తో ఫోన్లో మాట్లాడేందుకు ప్రయత్నించారు. ఈ లేఖను సోము వీర్రాజు ఢిల్లీ పార్టీ కార్యాలయానికి ఫ్యాక్స్ చేశారు. పొత్తు వ్యవహారాలను చూస్తున్న అరుణ్ జైట్లీకి అందచేయాలని కోరారని సమాచారం.
కాగా, ఈ నెల 27న విశాఖ సభలో ఇజం పుస్తకావిష్కరణ ఉన్న విషయం తెలిసిందే. జనసేన పార్టీ స్థాపించిన రోజు కాంగ్రెసు పార్టీ వ్యతిరేక నినాదం వినిపించిన పవన్... యువత లక్ష్యంగా 27న ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో రెండో సభను నిర్వహిస్తున్నట్లు ఆయన అభిమాన సంఘం నేతలు చెప్పారు. ఈ సభలో పవన్ పార్టీ సిద్ధాంతంగా రాసుకున్న ఇజం పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు.












Click it and Unblock the Notifications