Pawan Kalyan: వైసీపీకి ఆ దమ్ముందా.. జగన్ పాదయాత్ర చేస్తే మద్దతు: ఫ్రీ షోగా నా సినిమాలు..!!
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ఎంపీలకు పార్లమెంట్ లో ప్లకార్డు పట్టుకొనే ధైర్యం ఉందా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ కార్మికులకు మద్దతుగా పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ దీక్ష నిర్వహించారు. తాను ప్రధాని మోదీతో గొడవ పడాలని వైసీపీ కోరుకుంటోందని పవన్ చెప్పారు. వైసీపీతో తాము గొడవలు కోరుకోవటం లేదని..ఉమ్మడి ప్రయోజనాల కోసం కలిసి రావాలని పిలుపు ఇస్తున్నామని పవన్ చెప్పుకొచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ అడ్డుకోవాలంటే ఆ పార్టీ ఎంపీలను చొక్కా పట్టుకొని నిలదీయాలని పిలుపునిచ్చారు.

అన్ని పార్టీలు కలిసివస్తే ముందుంటాం
అన్ని పార్టీలు కలిసి వస్తే తాము ఖచ్చితంగా పోరాటం చేస్తామన్నారు. ఒంటరిగా మాత్రం ప్రత్యేక హోదా విషయంలో లాగా చేతులు కాల్చుకోలేమన్నారు. వైసీపీ నేతల మెడలను ఒంచాలని సూచించారు. తన ఆర్దిక మూలాలను దెబ్బతీయలేరని.. తనను భయపెట్టలేరని..పంతానికి పోతే తన సినిమాలు ఉచితంగా వేస్తానని పవన్ ప్రకటించారు. తిరుమలకు కూడా వైసీపీ వారిని రావద్దంటూ తిరుమలలోనూ భారీ వర్షాలు వచ్చాయన్నారు. రైతు చట్టాల విషయంలో ప్రధాని మోదీ రాజనీతి చూపించారని..వైసీపీ నేతలకు అది లేదన్నారు.
వైసీపీ నేతలను చొక్కా పట్టుకొని నిలదీయండి
నిర్ణయం కేంద్రం తీసుకున్నా..దానిని ప్రశ్నించాల్సిన బాధ్యత..అడ్డుకోకపోవటం వైసీపీ తప్పు అంటూ జనసేనాని స్పష్టం చేసారు. వైసీపీకి 22 మంది ఎంపీలు..151 మంది ఎమ్మెల్యేలు ఉన్నా..చేతకాని వ్యక్తులు సభలకు ఎందుకని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఇచ్చిన ఏ హామీ అమలు చేయలేదని విమర్శించారు. వైసీపీ నేతలు ప్రతీ ఒక్కరినీ కింది స్థాయి నుంచి సుప్రీం న్యాయమూర్తుల వరకు బెదిరిస్తారంటూ ఆరోపించారు. జనసేన పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఎంపీ - ఎమ్మెల్యే ఎలా పని చేయించాలో నిరూపిస్తామని పవన్ స్పష్టం చేసారు.
అమరావతి రాజధానిగా అప్పుడే చెప్పారు
స్టీల్ ప్లాంట్ కోసం జీవీఎంసీ ఎన్నికల్లో ఎందుకు హామీ ఇచ్చారని నిలదీసారు. బీజేపీతో పొత్తు పెట్టుకొనే సమయంలో తనకు ఆ పార్టీ ముఖ్యనేతలు అమరావతి రాజధానిగా కొనసాగుతుందని హామీ ఇచ్చిన విషయాన్ని మరోసారి స్పష్టం చేసారు. అదే అంశాన్ని తాజాగా అమిత్ షా తిరుపతి పర్యటనలో మరో సారి స్పష్టత ఇచ్చారని పవన్ చెప్పుకొచ్చారు. జై అమరావతి కాదని.. జై ఆంధ్రప్రదేశ్ అని నినదించాలని పిలుపునిచ్చారు. 22 వేల కోట్ల అప్పు ఉందని విశాఖ స్టీల్ ప్లాంట్ ను అమ్మేస్తే...లక్షల కోట్ల అప్పు ఉన్న ఆంధ్రప్రదేశ్ ను కూడా ప్రయివేటీకరిస్తారా అంటూ పవన్ కళ్యాణ్ నిలదీసారు.

జగన్ పాదయాత్ర చేస్తే మద్దతిస్తాం
స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం చేసే పోరాటానికి వైసీపీ నాయకత్వం వహించాలన్నారు. తాను విశాఖ నుంచి మాట్లాడితే వినిపించలేదని.. మంగళ గిరి నుంచి మాట్లాడితే వినపడుతుందని తాను ఇక్కడి నుంచే మాట్లాడుతున్నానని పవన్ చెప్పారు. వైసీపీ బెదిరింపులకు జనసేన భయపడదని పవన్ స్పష్టం చేసారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు.. భూములు కోల్పోయిన నిర్వాసితులకు అండగా ఉంటామన్నారు. గతంలో పాదయాత్ర సమయంలో అనేక హామీలు ఇచ్చారని..ఇప్పుడు మళ్లీ ఈ సమస్యల పైన పాదయాత్ర చేయాలన్నారు. పరోక్షంగా జగన్ పాదయాత్ర చేయాలంటూ పవన్ సూచించారు.
యువతను మోసం చేసి అధికారంలోకి
మరోసారి పాదయాత్ర చేస్తే తాను మద్దతిస్తానని ప్రకటించారు. వైసీపీ నేతలు మూడు రాజధానులు అంటున్నారని...సీమలో - విశాఖలో రాజధానులు అంటే తాము నమ్ముతామా అని పవన్ ప్రశ్నించారు. ఎన్టీఆర్ హయాంలో బీసీలకు సాధికారిత ఇచ్చారని.. తరువాత అలంకార ప్రాయం అయిపోయిందన్నారు. యువతను మోసం చేసి ఓట్లు వేయించుకున్న వైసీపీ ప్రభుత్వం ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదని విమర్శించారు. ఎవరైనా ప్రశ్నిస్తే గుండాయిజం.. రౌడీయిజం చేస్తారని ఆరోపించారు. సుప్రీం న్యాయమూర్తి దాకా బెదిరిస్తారంటూ వ్యాఖ్యానించారు.
Recommended Video

ఓట్లు చీలకూడదనే నాడు పోటీ చేయలేదు
తాను ప్రత్యేక హోదా కోసం కష్టపడితే ఏ పార్టీ.. ప్రజలు కలిసి రాలేదని పవన్ ఆవేదన వ్యక్తం చేసారు. 2024 ఎన్నికల దాకా వైసీపీని భరించాల్సిందేనని చెప్పుకొచ్చారు. 2014లో తాను ఓట్లు చీలకూడదనే ఉద్దేశంతోనే ఎన్నికల్లో పోటీ చేయలేదన్నారు. అయితే, తనను ఒక ఐడియలిస్టిక్ ఫూల్ గా చూసారని.. తన కష్టాన్ని మాత్రం గుర్తించలేదని పవన్ వివరించారు. వైసీపీ అధికారంలో ఉంటే పరిస్థితులు మారవన్నారు. రాయలసీమకు ఎప్పుడూ లేనంతగా వరదలు వచ్చాయన్నారు. వైసీపీ ప్రభుత్వానికి డబ్బులు విరాళంగా ఇస్తే ఏం చేస్తారో అనే భయం. అందుకే ఎవరూ ఇవ్వటం లేదని పవన్ వ్యాఖ్యానించారు.
-
వాళ్లను వదలొద్దు- రఘురామ, పవన్ కళ్యాణ్ డిమాండ్..! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..!












Click it and Unblock the Notifications