వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డీజీపీ హెచ్చరికలు డోంట్ కేర్: పవన్ కంటే మరో అడుగు జగన్ ముందు!

జల్లికట్టు ఉద్యమం స్ఫూర్తిగా విశాఖ ఆర్కే బీచ్‌లో ప్రత్యేక హోదా ఉద్యమానికి రంగం సిద్ధమవుతోంది.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: జల్లికట్టు ఉద్యమం స్ఫూర్తిగా విశాఖ ఆర్కే బీచ్‌లో ప్రత్యేక హోదా ఉద్యమానికి రంగం సిద్ధమవుతోంది. సోషల్ మీడియాలో వచ్చిన ప్రచారానికి ఓవర్ షిప్ ఉండదని, కాబట్టి దానికి అనుమతి లేదని డీజీపీ సాంబశివ రావు మంగళవారం ప్రకటించారు.

డీజీపీ మాటలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిలు లెక్క చేయలేదు! సభకు అనుమతివ్వకుంటే యువతను రెచ్చకొట్టినట్లేనని పవన్ అభిప్రాయపడగా, జగన్ మరో ముందడుగు వేసి తాను ఆర్కే బీచ్ వస్తానని ప్రటించారు. ఓ విధంగా వీరు డీజీపీని సవాల్ చేశారని చెప్పవచ్చు.

<strong>డీజీపీకి వెంటనే పవన్ కళ్యాణ్ కౌంటర్: కానీ 'చెన్నై', 'బాధ్యత' వదిలేశారు!</strong>డీజీపీకి వెంటనే పవన్ కళ్యాణ్ కౌంటర్: కానీ 'చెన్నై', 'బాధ్యత' వదిలేశారు!

ఆర్కే బీచ్‌కు తరలి రావాలని సోషల్ మీడియా ద్వారా ఎవరు ప్రచారం చేస్తున్నారో తెలియదని, అయినా అలాంటి వాటికి అనుమతి ఇవ్వమని, ఎవరైనా బాధ్యత వహిస్తే ముందుకు రావాలని డీజీపీ సాంబశివ రావు సూచించారు.

Pawan Kalyan and YS Jagan are not caring DGP warning

అయితే, తాము బాధ్యత తీసుకుంటామని ఇటు పవన్ కానీ, అటు జగన్ కానీ చెప్పలేదు. కానీ హోదా కోసం జరిగే ఉద్యమంలో మాత్రం పాల్గొంటాం/సమర్థిస్తామని మాత్రం చెప్పారు.

పవన్, జగన్‌ల హెచ్చరిక

ఆర్కే బీచ్‌లో జరగనున్న నిరసనకు అనుమతివ్వాలని పవన్ వరుసగా ట్వీట్లు చేస్తున్నారు. కేంద్రం తాను ఇచ్చిన హామీని నెరవేర్చనప్పుడు దాని గురించి.. ప్రజలు తమ అసంతృప్తిని నిరసన రూపంలో చెప్పే హక్కు ఉందని పవన్ చెప్పారు.

<strong>బాధ్యత వహిస్తారా చెప్పండి, 26న అనుమతిలేదు: పవన్-జగన్‌లకు డీజీపీ ప్రశ్న</strong>బాధ్యత వహిస్తారా చెప్పండి, 26న అనుమతిలేదు: పవన్-జగన్‌లకు డీజీపీ ప్రశ్న

హోదాను కట్టడి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబే ముందడుగు వేయడం బాధ కలిగించిందని జగన్‌ చెబుతున్నారు. హోదా కోసం పోరాడేందుకు అందరూ ఒకటి కావాలన్నారు. ఈ జూన్ వరకు చూస్తామని, అప్పటికి హోదా ఇవ్వకుంటే ఎంపీలందరూ రాజీనామా చేయాలని జగన్ తీవ్రంగా స్పందించారు.

ఇటు పవన్ కళ్యాణ్ వరుస ట్వీట్లు, అటు జగన్ మాటలు చూస్తుంటే ఆర్కే బీచ్‌లో హోదా కోసం నిరసనలు వెల్లువెత్తే అవకాశం కనిపిస్తోంది. పోలీసులు ఏ మేరకు అడ్డుకుంటారో చూడాలని అంటున్నారు.

English summary
Jana Sena chief Pawan Kalyan and YSRCP cheif YS Jagan are not caring DGP warning on RK beach protest.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X