ఆ 34 నియోజకవర్గాలపై గురిపెట్టిన జనసేనాని పవన్ కళ్యాణ్!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రూట్ మార్చారా? వచ్చే ఎన్నికలను టార్గెట్ చేసుకొని పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారా? తాజాగా వారాహి విజయయాత్ర సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రసంగ శైలి, వైసీపీ ప్రభుత్వ పాలనపై ఘాటుగా విరుచుకు పడిన వైనం వచ్చే ఎన్నికలలో విజయం సాధించడం కోసమేనా? గత ఎన్నికలకు భిన్నంగా రానున్న ఎన్నికలకు ముఖ్యంగా కొన్ని జిల్లాలపై పవన్ కళ్యాణ్ ఫోకస్ చేశారా? అంటే అవుననే సమాధానమే వస్తోంది.

వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే రంగం లోకి దిగిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉభయ గోదావరి జిల్లాలపై ఫోకస్ చేశారు. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలోని 34 నియోజకవర్గాలకు 34 కైవసం చేసుకోవాలని టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే తొలివిడత వారాహి యాత్ర దిగ్విజయంగా పూర్తి చేసుకున్న పవన్ కళ్యాణ్, రెండో విడత వారాహి యాత్రను కూడా ఇక్కడి నుండే నిర్వహించనున్నట్లు సమాచారం.

janasenapawankalyan

జూన్ 14వ తేదీన అన్నవరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వారాహి తొలివిడత యాత్ర ప్రారంభించిన పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లాలోని కత్తిపూడి జంక్షన్ వద్ద నిర్వహించిన బహిరంగ సభ ద్వారా వైసిపికి హెచ్చరికలు జారీ చేశారు. వారాహి విజయయాత్ర ఆద్యంతం పవన్ కళ్యాణ్ తనదైన ప్రసంగాలతో, తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తాము అని చెప్పే హామీలతో ప్రజల మనసులను గెలుచుకునే ప్రయత్నం చేశారు .

ఇక మొదటి విడత వారాహి విజయ యాత్రలో భాగంగా ఉభయ గోదావరి జిల్లాల లోని 34 నియోజకవర్గాలలో 10 నియోజకవర్గాలలో పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఇప్పుడు రెండవ విడతలో మిగిలిన 24 నియోజకవర్గాలలో పవన్ కళ్యాణ్ యాత్రను పూర్తి చేయాలని భావిస్తున్నట్లుగా సమాచారం. ఈ రెండో విడత వారాహి యాత్ర ఏలూరు నుంచి ప్రారంభమవుతుందని తెలుస్తుంది.

వారాహి రెండో విడత యాత్ర కోసం జనసేన నేతలు పూర్తిస్థాయి రూట్ మ్యాప్ ను సిద్ధం చేసే పనిలో ఉన్నారు. ఏలూరులో ప్రారంభమై ఎక్కడ ముగిస్తుంది అనేది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదని తెలుస్తుంది. మొత్తంగా చూస్తే పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర ద్వారా ఉభయ గోదావరి జిల్లాలపై గురి పెట్టినట్టు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో చర్చ జరుగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+