ఒంటరి వాడిని చేసాను... కేంద్రానికి శత్రువయ్యాను : జగన్ ప్రభుత్వానికి వారం డెడ్ లైన్ - ప్రకటన చేయాలి..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగన్ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసారు. వారం లోగా విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కార్యాచరణ ప్రకటించాలని..లేకుంటే తమ కార్యాచరణ ప్రటకించాల్సి వస్తుందని హెచ్చరించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా సాగుతున్న నిరసనలకు పవన్ సంఘీభావం ప్రకటించారు. సభలో పాల్గొన్న పవన్ ఉక్కు కర్మాగారం లేకపోతే దేశం మందుకు పోదని పవన్ చెప్పుకొచ్చారు. విశాఖ కర్మాగారం కోసం 32 మంది పోలీసుల కాల్పుల్లో చనిపోయారని పవన్ గుర్తు చేసారు. పీలేరు నుంచి పలాస దాకా ఈ యువకులు ప్రాణాలు కోల్పోయారని చెప్పుకొచ్చారు.

త్యాగాల ఫలితం స్టీల్ ప్లాంట్..

త్యాగాల ఫలితం స్టీల్ ప్లాంట్..

విశాఖ స్టీల్ ప్లాంట్ ను పీవి ప్రధానిగా ఉన్న సమయంలో జాతికి అంకితం చేసారని గుర్తు చేసారు. దాదాపుగా 5-6 లక్షల మంది ప్రత్యక్షంగా - పరోక్షంగా ఆధారపడ్డారని వివరించారు. స్టీల్ ప్లాంట్ కోసం ఇచ్చిన భూములకు పరిహారం ఇవ్వలేదని చెప్పారు. 2021లో నష్టాలు చవి చూస్తుందని..ప్రయివేటీకరణ చేస్తున్నామని కేంద్రం చెప్పిందన్నారు. దీని పైన తాము ఢిల్లీలో కేంద్ర మంత్రి అమిత్ షా గారికి వినతి పత్రం ఇచ్చామన్నారు. పెట్టుబడుల ఉప సంహరణ విషయంలో స్టీల్ ప్లాంట్ ను చూడవద్దని కోరాము. భావోద్వేగాలతో ముడి పడి ఉందని వివరించామన్నారు.

మా ఎమ్మెల్యేను వైసీపీ తన్నుకుపోయింది..

మా ఎమ్మెల్యేను వైసీపీ తన్నుకుపోయింది..

మాకు ఎంపీల బలం లేదు..ఉన్న ఒక ఎమ్మెల్యే కూడా వైసీపీ వాళ్లు పట్టుకెళ్లిపోయారని వ్యాఖ్యానించారు. ప్రజాబలం ఉందని అప్పాయింట్ ఇస్తారు..గడ్డి పోచలా పక్కన పెడతారంటూ వ్యాఖ్యానించారు. నష్టాలున్నాయి..లేవని ఎవరూ చెప్పలేదని చెప్పారు. వైసీపీ రాజకీయ పరిశ్రమ మినహా అందరినీ నష్టాలున్నాయని విమర్శించారు. స్టీల్ ప్లాంట్ ఏరియాలో ఓడినా...అయినా నిలబడే ఉన్నానని చెప్పారు. ఉక్కు సంకల్పంతో స్టీల్ ప్లాంట్ ను కలుపుకుపోవాలి. ఆంధ్ర వాళ్లకు మన వర్గం..మనం అనే దరిద్రం ఉంటుంది. దీని వలన భావితరం నష్టపోతుంది. రాష్ట్ర విభజన సమయంలో ఏ ఎంపీ క్యాప్టివ్ మైన్స్ కావాలని అడగలేదు. ప్రభుత్వ సహకారం ఇస్తే ప్లాంటు నిలబడుతుందని చెప్పారు.

ముందు రాష్ట్రాన్ని బాధ్యులను చేయాలి

ముందు రాష్ట్రాన్ని బాధ్యులను చేయాలి

కేంద్రాన్ని అడిగే ముందు రాష్ట్ర ప్రభుత్వాన్ని బాధ్యులను చేయాలి. వైసీపీ ఎంపీలు ఎందుకు నోరు తెరవరు. పార్లమెంట్ కు ఎందుకు వెళ్తున్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు మైన్స్ ఇవ్వమని ఎందుకు అడగరని ప్రశ్నించారు. విశాఖ ఉక్కు ఎవరి దయా దాక్ష్యిణ్యాల మీద రాలేదు. పోరాడి సాధించుకున్నామని చెప్పారు. స్టీల్ ప్లాంట్ కాపాడుకోవటం ఆంధ్రుల ఆత్మగౌరవం అని స్పష్టం చేసారు. పెట్టుబడుల ఉప సంహరణ ఈ రోజు వచ్చింది కాదు. 1992 నుంచి ప్రారంభమైంది. వైసీపీ వాళ్లు సర్క్యూట్ హౌస్ అమ్మేసినట్లుగా...ప్లాంట్ ను కూడా అమ్మేసేవారు. సమస్యలు వస్తే పారిపోను. నిలబడతానని చెప్పుకొచ్చారు. ముందుడగే కానీ, పారిపోవటం తెలియదన్నారు.

ఒంటరి వాడిని చేసారు.. కేంద్రానికి శత్రువునయ్యాను

ఒంటరి వాడిని చేసారు.. కేంద్రానికి శత్రువునయ్యాను


ప్రత్యేక హోదా కోసం పోరాటం చేసి..అన్ని జిల్లాల్లో పర్యటిస్తున్న సమయంలో ఎవరూ మద్దతుగా నిలవలేదు. ఒంటరి వాళ్లని చేసి వదిలేసారు. కేంద్రానికి శత్రువును అయిపోయాను. మీరు నిలబడండి..నేను వెనుక నిలబడి చూపిస్తాను.పార్టీలకు అతీతంగా కలిసి రావాలని పిలుపునిచ్చారు. డోపిడీ చేసే రాజకీయ వేత్తను కాదు. ఓట్లు వేయని వారి కోసం కాదు..వేసిన వాళ్ల కోసం వచ్చానని చెప్పారు. కేంద్రం మీ కాంట్రాక్టులు... బెయిల్ రావాలంటే కేంద్రం కావాలా. 22 మంది ఎంపీలున్న వైసీపీ మాట కేంద్ర వినదా. అసెంబ్లీలో తీర్మానం చేస్తే సరిపోదు. కాకమ్మ కబుర్లు చెబితే కాదు...క్యాబేజీ పూలుచెవిలో పెట్టవద్దు. మీ మద్దతు అవసరం లేదంటే...మీరు సీఏఏకు ఎందుకు మద్దతిచ్చారు. వ్యవసాయ బిల్లులకు మద్దతిచ్చి... ఇక్కడ రాజకీయం చేస్తున్నారు.

Recommended Video

    YSRCP, TDP పై RGV సెటైర్..మధ్యలో ఆయన పై కూడా | Ap Politics || Oneindia Telugu
    కేంద్రానికి వైసీపీ మద్దతు ఉంది..దీని పై ఎందుకు మాట్లాడరు

    కేంద్రానికి వైసీపీ మద్దతు ఉంది..దీని పై ఎందుకు మాట్లాడరు

    కేంద్రం అన్ని బిల్లులు ప్రత్యక్షంగా..పరోక్షంగా మద్దతిస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు మైన్స్ ఇవ్వమని ఎందుకు అడగరు. డబ్బులిచ్చ ఓట్టు కొనుక్కొన్న వాళ్లు మీరు. ఆంధ్రుల ఆత్మగౌరవం పోతో పోనీ అనుకుంటారు. వైసీపీ నేతలకు ధైర్యం ఉంది. వెంకయ్య పైన ఎలా వ్యాఖ్యలు చేసారు..సీజే పదవి ఒకాయనకు ఇవ్వద్దని ఎలా లేఖ రాసారని ప్రశ్నించారు. భీమిలి ఎమ్మెల్యే కేంద్రానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని చెప్పారు.. ఎందుకు చేయటం లేదు. వైసీపీ మాటలకు అర్దాలే వేరు. మద్యపాన నిషేధం అంటే...మద్యం అమ్ముతామని ఇస్తామని అర్దం. అందరికీ ఆరోగ్య శ్రీ అంటే...బ్లీచింగ్ పౌడర్ చల్లుకోమని చెప్పటం. నా సభలకు రండి.. వైసీపీకి ఓట్లు వేయండి. వైసీపీ మాటలు మేము నమ్మం. అఖిలపక్షం ఏర్పాటు చేయండి..యూనియన్ నేతలను..మేధావులను పిలవండని సూచించారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+