ఏందిరా భయ్.. మాకీ లొల్లి.. వైసీపీ విముక్త అంటావు?.. ఒక్క ఛాన్స్ అంటావు?
ఏందిరా భాయ్.. మాకీ లొల్లి.. కాసేపు వైసీపీ విముక్త ఏపీ అంటావు.. మరోవైపు ఒక్కసారి ఛాన్స్ అంటావు.. ఇంకోవైపు ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వను అంటావు.. పొత్తులు పెట్టుకుంటాం.. అంటావ్.. అసలేంది.. నీ స్ట్రాటజీ.. ఏం చేయాలనుకుంటున్నావు? ఏం చేస్తున్నావు? లక్ష్యం దిశగా పయనం సాగుతుందా? సాగదా? కొంచెం సేపు హరిహర వీరమల్లు అంటావు.. మరికొంచెం సేపు బస్సు యాత్ర అంటావు.. గిదేదన్నా గానీ.. ఏదో ఒకటి మాకు తేల్చి సెప్పన్నా అంటున్నారు పవన్ కల్యాణ్ అభిమానులు.

విఫలమవుతున్న జనసేనాని
జనసేన నాయకులు, కార్యకర్తలు, పవన్ కల్యాణ్ అభిమానులే కాదు.. పవన్ కల్యాణ్ రాజకీయాన్ని మొదటి నుంచి గమనిస్తున్నవారంతా డోలాయమానంలో పడ్డారు. డోలాయమానం అనేకన్నా అయోమయం అనొచ్చు. అసలు ఆ పార్టీ ఏం చేయాలనుకుంటోంది? ఏం చేస్తోంది? ఒకరోజు ఉన్న పోరాటం రెండోరోజు ఉండటంలేదు.. రెండురోజులున్న పోరాటం తర్వాత కనపడదు.. ప్రధానమంత్రి ఏదో చెప్పారని వాయిదా వేసుకోవడం.. వైసీపీ విముక్త ఏపీ తమ లక్ష్యమంటున్నారేకానీ కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవడంలో జనసేన, జనసేనాని ఘోరంగా విఫలమవుతున్నారు. యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసి పార్టీ శ్రేణులన పరుగులెత్తించాలి.. ఏదో ఒక స్టాండ్ తీసేసుకో.. అది మంచి అవనీ, చెడు అవనీ, ఏదైనా అవనీ.. కానీ ఊగిసలాట రాజీకయం మనకొద్దు అంటున్నారు జనసేన నాయకులు, కార్యకర్తలు

ఎవరు చెప్పినా విని వదిలేయాలి
పోరాటం చేయాలంటే చేద్దాం.. అలా కాకుండా రెండురోజులు పోరాటం చేసిన తర్వాత ప్రధానమంత్రి, హోం మంత్రి, గవర్నర్.. ఇలా వారు చెప్పారంటూ, వారిని గౌరవిస్తున్నామంటూ పోరాటాన్ని వాయిదా వేసుకుంటే పార్టీ వెనకాల నడిచేదెవరు? దాన్ని నిలబెట్టేదెవరు? ఏమీ అర్థం కాకుండా ఉంది. ఏదో ఒకటి చేయమంటే.. ఏదీ చేయడంలేదని శ్రేణులు వాపోతున్నారు.

ఎన్ని ఆటుపోట్లయినా తట్టుకోవాలి
పోరాటం చేయడానికి ఒకసారి రంగంలోకి దిగితే లక్ష్యం సాధించేవరకు విశ్రమించకూడదు. అంతేకాదు.. ఎన్ని ఆటుపోట్లయినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. మధ్యలో ఎవరో ఏదో చెప్పారని జావ కారిపోకూడదు. ఆరు శాతం ఉన్న ఓటుబ్యాంకు ఇప్పుడు 12 శాతానికి చేరింది. ఇంకా ఇంకా కష్టపడితే నియోజకవర్గాల్లో గెలుపోటములను శాసించే స్థితికి చేరుకోవచ్చు. టీడీపీతో కొంచెంసేపు, బీజేపీతో కొంచెం సేపు మనకెందుకు.. సింగిల్ గా వెళ్దాంరా.. మేమున్నాం.. అంటున్నారు శ్రేణులు. ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచిచూద్దాం.!!












Click it and Unblock the Notifications