పవన్ చంద్రబాబును మళ్లీ ప్రశ్నించారు
సుధీర్గ కాలం తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని మరో సారి ప్రశ్నించారు. తిరుపతి సమీపంలో జాతీయ రహదారి విస్తరణ పేరుతో శెట్టిపల్లి లో రైతుల భూములను ప్రభుత్వం లాక్కొనే ప్రయత్నం చేస్తే సహంచేది లేదని హెచ్చరించారు. గతంలో పైడిపల్లి నిర్వాసితుకు చెల్లించిన నష్టపరిహారాన్ని ఇప్పుడు శెట్టిపల్లి ప్రజలకు చెల్లించడంలో ఎందుకు వెనకాడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే ప్రజానికానికి కూడా అన్యాయం చేస్తారా అంటూ నిలదీసారు.
చిత్తూరు జిల్లా శెట్టిపల్లిలో పర్యటించిన పవన్ రైతులతో ముఖాముఖి మాట్లాడారు. శెట్టిపల్లిలో భూసమీకరణ చేస్తే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఎదురు తిరగబడాలని అన్నారు. ఏపిలో రైతు రుణమాఫీ గురించి పవన్ స్పందించారు. రైతురుణ మాఫీ చేస్తామని గొప్పగా చెప్పుకున్న ప్రభుత్వం క్షేత్రస్థాయిలో చేసింది ఏమీలేదని పేర్కొన్నారు. ప్రభుత్వ వ్యవహారం బిందెడు నీళ్లు ఇస్తామని చెప్పి మూడు స్పూన్ల నీళ్లు తాగించినట్టు ఉందని ఎద్దేవా చేసారు. అంతే కాకుండా గోదావరి లో బోటు ప్రమాదంపై పవన్ స్పందించారు.

బాదిత కుటుంబాలకు సత్వర సాయం చేయాలని ప్రభుత్వానికి లేఖ రాసారు. ప్రభుత్వ అదికారుల నిర్లక్ష్యం కొండప్రాంత పజలకు శాపం కాకూడదని లేఖలో పేర్కొన్నారు. బోట్ల పనితీరును, అనుమతులను ముందస్తుగా పర్యవేక్షిస్తే ఇలాంటి ప్రమాదాలను నివారించొచ్చని తెలిపారు.












Click it and Unblock the Notifications