• search

పవన్ అడిగితేనే బాబు ఇవ్వలేదు, కేంద్ర-రాష్ట్రాలు అబద్దం చెప్పలేదు: ఉండవల్లి ట్విస్ట్

Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: ఏపీకి నిధుల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అబద్దాలు చెప్పడం లేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆదివారం చెప్పారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో భేటీ అనంతరం జనసేనానితో కలిసి ఉండవల్లి మీడియాతో మాట్లాడారు. ఇటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అబద్దాలు చెప్పడం లేదని, కానీ నిజం మాత్రం చెప్పడం లేదన్నారు. కాని ఎవరో ఒకరి వైపు తప్పు ఉందన్నారు.

   Pawan Kalyan Has Proposed Fact Finding Committee

   చదవండి: ఏపీకి మరో శుభవార్త, విశాఖ రైల్వే జోన్‌కు ఒకే!: అలా ఐతేనే.. మారిన బాబు వ్యూహం, ఆ తర్వాతే

   ఉదాహరణకు.. మేం లక్షకోట్లు ఇచ్చామని కేంద్రం చెబితే అది మంజూరు చేయడం కావొచ్చునని, ఆ మాటలు నిజమేనని, కానీ అది చేతికి వచ్చి ఉండదన్నారు. మరోవైపు మాకు లక్షకోట్లు ఎక్కడ ఇచ్చారని, రాష్ట్రం అంటుందని, అది కూడా నిజమేనని, ఆ నిధులు వీరి చేతికి వచ్చి ఉండవని ఉదాహరణ చెప్పారు. రాజకీయ నాయకులు అబద్దాలు ఆడుతారు, తప్పితే ప్రభుత్వాలు అబద్దం ఆడవన్నారు. కానీ నిజం మాత్రం చెప్పవన్నారు.

   చదవండి: చంద్రబాబు-కేసీఆర్‌లకు వెంకయ్య దిమ్మతిరిగే షాక్, మోడీ చెప్పినట్లుగా..

   పవన్‌తో కలిసి పని చేసేందుకు సిద్ధం

   పవన్‌తో కలిసి పని చేసేందుకు సిద్ధం

   పవన్ కళ్యాణ్‌తో కలిసి పని చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఉండవల్లి చెప్పారు. ఏ ఇద్దరు రాజకీయ నాయకులు కలిసినా రాజకీయాలు మాట్లాడుకుంటారని, కర్నాటక ఎన్నికలు, యూపీ లేదా ఇతర రాజకీయ అంశాలు మాట్లాడుతామన్నారు. పవన్ మాత్రం కనీసం ఏపీ రాజకీయాలు కూడా మాట్లాడలేదన్నారు. కేవలం విభజన హామీల పైనే చర్చించామన్నారు.

   పవన్ వస్తే బాగా జనాలు వస్తారని

   పవన్ వస్తే బాగా జనాలు వస్తారని

   పవన్ ఏర్పాటు చేస్తానన్న జేఏసీలో తనను కలుపుకోవడం ఆనందంగా ఉందని ఉండవల్లి చెప్పారు. తాను రిటైర్ అవ్వాలనుకున్నానని, కానీ ఓ సెలబ్రిటీ పిలిచేసరికి, అదీ పవన్ అయ్యేసరికి, ప్రజల కోసం కాబట్టి కలిసి పని చేస్తానని చెప్పారు. పవన్ తన వద్దకు వస్తానని చెప్పారని, కానీ ఆయన వస్తే జనాలు బాగా వస్తారని, నేనే వద్దన్నానని, తాను వస్తానని చెప్పి ఈ రోజు వచ్చా అన్నారు.

   రియల్ పాలిటిక్స్, వారి లొసుగును పవన్ బయటకు తీస్తారు

   రియల్ పాలిటిక్స్, వారి లొసుగును పవన్ బయటకు తీస్తారు

   పవన్ ఏర్పాటు చేయనున్న జేఏసీ గురించి ఉండవల్లి మాట్లాడుతూ.. పవన్ జేఏసీలో ఉండేవారి పేర్లు చెప్పాక అందులోని వారు నిజం చెప్పేవారే ఉన్నారని అర్థమైందన్నారు. పవన్ వంటి వారు రియల్ పాలిటిక్స్‌తో వస్తున్నారన్నారు. ఏపీకి నిధుల అంశం ప్రజలకు సంబంధించినది అని, వారి పొత్తు లొసుగును పవన్ బయటకు తీస్తారని, అందులో విజయవంతమవుతారన్నారు.

   పవన్ ఈ రోజు పాలిటిక్స్ ప్రారంభించారు, టాస్క్ ప్రశంసనీయం

   పవన్ ఈ రోజు పాలిటిక్స్ ప్రారంభించారు, టాస్క్ ప్రశంసనీయం

   పవన్ కళ్యాణ్ లాంటి వాళ్లు చెబితే కోటిమందికికి తెలుస్తుందని, తనలాంటి వాళ్లు చెబితే వెయ్యి మందికే తెలిస్తుందని ఉండవల్లి అన్నారు. పవన్ సక్సెస్ అవుతారని భావిస్తున్నానని చెప్పారు. పవన్ ఈ రోజు నుంచి రియల్ పాలిటిక్స్ ప్రారంభించారన్నారు. పవన్ ప్రయత్నం అభినందనీయమన్నారు. పవన్ తీసుకున్న టాస్క్ ప్రశంసనీయమన్నారు. జేఏసీలో నన్ను చేర్చుకోవడం ఆనందమన్నారు. పవన్ ఇప్పుడే రాజకీయాలు ప్రారంభించారన్నారు.

   పవన్ వల్లే గెలిచాడు, అడిగితే ఇవ్వలేదు

   పవన్ వల్లే గెలిచాడు, అడిగితే ఇవ్వలేదు

   ఇప్పుడు ఏపీ గతంలో ఎప్పుడు లేనంత గడ్డుస్థితిలో ఉందని పవన్ అన్నారు. ప్రజలకు నిజాలు తెలియాలన్నారు. పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేయాలని పవన్ కళ్యాణ్ అడిగారని, ఈయన వల్లే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, అలాంటి జనసేనాని అడిగినా వైట్ పేపర్ విడుదల చేయలేదని ఉండవల్లి అన్నారు. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో పవన్ వల్లే టీడీపీ గెలిచిందన్నారు.

   అంతకుముందు పవన్ మాట్లాడుతూ

   అంతకుముందు పవన్ మాట్లాడుతూ

   అంతకుముందు పవన్ మాట్లాడుతూ నిధుల విషయంలో కేంద్రం లేదా రాష్ట్రం.. ఎవరో ఒకరు అబద్దాలాడుతున్నారన్నారు. తనను రాజకీయాల్లోకి రావాలని ఎవరూ అడగలేదని, తనంత తానే వచ్చానని చెప్పారు. పోలవరంపై శ్వేతపత్రం అడిగితే వెబ్ సైట్లో పెట్టామని చెప్పారని, కానీ ఎక్కడా కనిపించలేదన్నారు. గతంలో తాను వేటిని అయితే అడిగానో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వాటినే అడుగుతోందని, అందుకే కాలయాపన ఎందుకు చేశారా అని బాధ వేసిందన్నారు. రెండు పార్టీలు ఏపీకి న్యాయం చేయకుంటే తనవంతుగా ప్రశ్నించే బాధ్యత ఉందన్నారు. ఏపీకి అన్యాయం జరిగిన ఈ పరిస్థితుల్లో జేపీ, ఉండవల్లి వంటి వారు గుర్తుకు వచ్చారని, వీరితో కలిసి ఏదో ఒకటి చేయాలనుకున్నానని చెప్పారు. ఉండవల్లికి ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్‌తో అనుబంధం ఉన్నప్పటికీ విభజన నేపథ్యంలో ఆ పార్టీతో విబేధించి రాజకీయాల నుంచి వైదొలిగారన్నారు. ఇలాంటి వారు సమస్యను తటస్థంగా చూడగలుగుతారన్నారు.

   తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

   English summary
   Pawan Kalyan and Undavalli Arun Kumar are poles apart in their politics, perspective and approach. Naturally, when the two meet, there is bound to be great interest. On Sunday afternoon, Pawan and Vundavalli met to discuss the formation of Joint Fact-finding Committee to protect AP’s rights.

   Oneindia బ్రేకింగ్ న్యూస్
   రోజంతా తాజా వార్తలను పొందండి

   X
   We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more