తుందుర్రు పర్యటనకు సిద్దమైన జనసేన: మెగా ఆక్వా ఫుడ్‌పై అధ్యయనం!
తుందుర్రు పర్యటనకు సిద్దం కావాల్సిందిగా జనసేన శ్రేణులకు పవన్ ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది.
పశ్చిమగోదావరి : మెగా ఆక్వా ఫుడ్ పార్క్ ను వ్యతిరేకిస్తూ.. తుందుర్రు గ్రామ ప్రజలంతా గత కొన్నాళ్లుగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. విషయం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దాకా వెళ్లడం.. దాన్ని వ్యతిరేకిస్తూ.. ఆయన ప్రెస్ మీట్ పెట్టడం వంటి పరిణామాలు ఈమధ్య కాలంలో చోటు చేసుకున్నాయి. తుందుర్రు పర్యటన ద్వారా వాస్తవ పరిస్థితులను పరిశీలిస్తామని ఆ సమయంలో పవన్ బాధితులకు హామి ఇచ్చారు.
దీంతో ప్రభుత్వంపై కాస్త ఒత్తిడి పెరిగినట్టే కనిపించినా.. మెగా ఆక్వా ఫుడ్ ఫ్యాక్టరీని ఉపసంహరించుకునే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేనట్టే కనిపిస్తోంది. ఇదే నేపథ్యంలో.. తుందుర్రు పర్యటనకు సిద్దం కావాల్సిందిగా జనసేన శ్రేణులకు పవన్ ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు త్వరలోనే జనసేన కార్యకర్తలంతా ఆక్వా ఫుడ్ ప్రభావిత గ్రామాల్లో పర్యటించడానికి ప్లాన్ చేసుకుంటున్నట్టుగా సమాచారం.

పర్యటనలో భాగంగా.. బాధిత గ్రామాల ప్రజల అభిప్రాయాలను తెలుసుకోనున్నారు జనసేన కార్యకర్తలు. పూర్తి స్థాయి వివరాలను సేకరించి ఓ సమగ్ర నివేదికను పవన్ కళ్యాణ్ కు అందించనున్నారు. అనంతరం నివేదికను అధ్యయనం చేసిన తర్వాత.. పవన్ కళ్యాణ్ తుందుర్రు పర్యటన ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతిపక్ష వైసీపీ అధినేత జగన్ సైతం ఇప్పటికే తుందుర్రులో పర్యటించిన సంగతి తెలిసిందే.
మెగా ఆక్వా ఫుడ్ ను వ్యతిరేకిస్తూ.. పవన్ గనుక తుందుర్రులో పర్యటిస్తే.. ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెరగడం మాత్రం ఖాయం. అదే సమయంలో.. ప్రతిపక్షం పోషించాల్సిన పాత్రను జనసేన తన ఖాతాలో వేసుకున్నట్టవుతుంది. చూడాలి మరి.. పవన్ తుందుర్రులో పర్యటనకు సిద్దమవుతారా..? లేక కార్యకర్తలతోనే సరిపుచ్చుతారా? అన్నది.
-
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
ఇంటింటికీ గంగమ్మ: డ్వాక్రా మహిళలకు కీలక బాధ్యతలు -
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! -
పవన్ "ఉస్తాద్" మూవీకి థియేటర్ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా వచ్చేలా లేవా ??? -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..!












Click it and Unblock the Notifications