ఇంద్రకీలాద్రి పై "పవన్" నినాదాలు - భక్తుల ఆందోళన..!!

ఇంద్రీకీలాద్రి పై భక్తుల రద్దీ పెరిగింది. మూలా నక్షత్రం వేళ అమ్మవారి దర్శనం కోసం రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు తరలి వచ్చారు. నవరాత్రుల్లో భాగంగా ఏడవరోజు బుధవారం అమ్మవారు సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ తన కుమార్తెతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. కొందరు అభిమానులు పవన్ అనుకూల నినాదాలు చేసారు. దర్శనాల్లో ఆలస్యం పైన భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆలయంలో పవన్
ఇంద్రీకీలాద్రి పై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరగుతున్నాయి. అమ్మవారి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం కావడంతో ఇంద్రకీలాద్రికి భక్తులు పోటేత్తారు. అర్ధరాత్రి నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. పవన్‌కు అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. కూతురు ఆధ్య తో ఆయన దర్శనానికి వచ్చారు. పవన్ కళ్యాణ్‌ను చూడగానే కొందరు జై జనసేన జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేశారు. ఆలయ ప్రాంగణంలో నినాదాలు చేయటం పైన భక్తులు పలువురు ఆగ్రహం వ్యక్తం చేసారు. దర్శానం కోసం వినాయకుని గుడి వద్ద క్యూలైన్లు దాటి భక్తులు బారులు తీరారు.

Pawan Visited indrakeeladri with his daughter Huge Rush at temple

భక్తుల ఆగ్రహం
మూలా నక్షత్రం రోజున భారీగా భక్తుల రాక ఉంటుందని అధికారులు ముందుగానే అంచనా వేసారు. కొండపైకి ఈరోజు ఎటువంటి వాహనాలను అనుమతించమని పోలీసులు వెల్లడించారు. ఈ రోజు మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. అయితే, వీఐపీలకు ప్రాధాన్యత ఇస్తూ సామాన్యుల దర్శనం విషయంలో అధికారుల తీరు పైన భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దర్శనం కోసం వచ్చిన భక్తురాలిపై పోలీసులు చేయి చేసుకున్నారని ఆరోపిస్తున్నారు. దర్శనం సరిగ్గా చేసుకోనివ్వడం లేదని ఆరోపణ చేస్తూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులపై ఉన్నతాధికారులకు బాధితురాలి ఫిర్యాదు చేసారు.

Pawan Visited indrakeeladri with his daughter Huge Rush at temple

అధికారుల ఏర్పాట్లు
అనధికార దర్శనాలు పెరిగిపోవడంతో పోలీసులు కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్నారు. వీఐపీలకు కేటాయించిన 9-11, 2-4 స్లాట్‌ల్లో కాకుండా ఇతర సమయాల్లో వస్తే వారిని వీఐపీ మార్గంలో దర్శనాలకు అనుమతించడంలేదు. వారిని రూ.500 క్యూలో పంపుతున్నారు. లక్షలాది మంది భక్తులు ఈ దర్శనానికి వచ్చే అవకాశం ఉండడంతో మరింత కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేసామని అధికారులు వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాక సందర్భంగా నగరంలో కొన్ని ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నామని సీపీ తెలిపారు. డైనమిక్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ సిస్టమ్‌ ద్వారా ఎప్పటికప్పుడు సమయానుకూలంగా ఈ ఆంక్షలు ఉండే అవకాశం ఉందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+