ఫ్యాన్స్ ఎఫెక్ట్: భూమా అంత్యక్రియలకు పవన్ వెళ్లట్లేదు!..

తాను అంత్యక్రియలకు హాజరైతే భారీ సంఖ్యలో జనం అక్కడికి వస్తారు కాబట్టి.. అంతమంది జనాన్ని అదుపు చేయలేక పోలీసులు సైతం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుందనే ఉద్దేశ్యంతో.. అంత్యక్రియలకు దూరంగా ఉండాలని పవన

ఆళ్లగడ్డ: నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి హఠాన్మరణం పార్టీలోను, నియోజకవర్గ ప్రజల్లోను ఆవేదనను మిగిల్చింది. ఫ్యాక్షన్ నేపథ్యం నుంచి వచ్చిన నేత అయినప్పటికీ.. రాజకీయాల్లో మాత్రం ఆ ముద్రకు ఆయన దూరంగానే ఉన్నట్లు కనిపిస్తుంది.

భూమా మరణంతో రాయలసీమలో మంచి నేతను కోల్పోయామని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సైతం గతంలో ఆయనతో కలిసి పనిచేసిన రోజులను గుర్తుచేసుకున్నారు.

2004లో ఎమ్మెల్యేగా ఓటమి చవిచూశాక, సతీమణి శోభా నాగిరెడ్డితో కలిసి 2008లొ ఆయన చిరంజీవి ప్రజారాజ్యంలో చేరారు. ఆ తర్వాత 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పీఆర్పీ అభ్యర్థిగా నంద్యాల ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు.

పవన్ ఏమన్నారు:

పవన్ ఏమన్నారు:

ఆయనతో కలిసి పనిచేసిన వ్యక్తిగా భూమా నాగిరెడ్డి మృతి రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటు అని పవన్ అభిప్రాయపడ్డారు. ఈ విషాదాన్ని అధిగమించేందుకు ఆ కుటుంబానికి భగవంతుడు శక్తిని వ్వాలని ఆకాంక్షించారు.

అంత్యక్రియలకు వెళ్లట్లేదు:

అంత్యక్రియలకు వెళ్లట్లేదు:

భూమా నాగిరెడ్డి అంత్యక్రియలకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన అంత్యక్రియలకు హాజరవ్వాలని పవన్ తొలుత భావించినప్పటికీ.. సెక్యూరిటీ రీత్యా ఆయన వెనుకడుగు వేశారు.

పవన్ వస్తే.. ఆ ఇబ్బంది:

పవన్ వస్తే.. ఆ ఇబ్బంది:

తాను అంత్యక్రియలకు హాజరైతే భారీ సంఖ్యలో జనం అక్కడికి వస్తారు కాబట్టి.. అంతమంది జనాన్ని అదుపు చేయలేక పోలీసులు సైతం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుందనే ఉద్దేశ్యంతో.. అంత్యక్రియలకు దూరంగా ఉండాలని పవన్ నిర్ణయించుకున్నారు.

అంత్యక్రియలకు తెలంగాణ నేతలు సైతం:

అంత్యక్రియలకు తెలంగాణ నేతలు సైతం:

కాగా, భూమా అంత్యక్రియలకు పలువురు తెలంగాణ నేతలు కూడా హాజరవుతున్నారు. ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించేందుకు అధికారులు ఆళ్లగడ్డకు చేరుకుని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఏపీ నుంచి సీఎం చంద్రబాబు సహా పలువురు మంత్రులు అంత్యక్రియలకు హాజరు కానున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+