పయ్యావుల సంచలన ఆరోపణలు-వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులపైనా నిఘా-సాక్షి ఉద్యోగులపైనా

ఏపీలో వైసీపీ ప్రభుత్వం టీడీపీపై చేస్తున్న పెగాసస్ వాడకం ఆరోపణలపై ఆ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఇవాళ తీవ్రంగా స్పందించారు. చంద్రబాబునాయుడు ప్రభుత్వం పెగాసెస్ ఇక్యూప్ మెంట్ కొన్నారని అనవసపు రాద్ధాంతం చేస్తున్నారని ఆయన విమర్శించారు. పెగాసెస్ ఇక్యూప్ మెంట్ చంద్రబాబు కొనలేదని గౌతమ్ సవాంగ్ ఆర్ టీఐ సమాధానం ఇచ్చారని, కేవలం అసత్య ప్రచారాలు, అభూత కల్పనలతో ప్రజల్ని నమ్మించి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇప్పుడు వైసీపీ సర్కార్ తమ ఎమ్మెల్యేలు, మంత్రులపైనే నిఘా పెట్టిందన్నారు.

పెగాసస్ విచారణపై పయ్యావుల ఫైర్

పెగాసస్ విచారణపై పయ్యావుల ఫైర్

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు గతంలో సీఎంగా ఉండగా డేటా చౌర్యం చేశారని అక్రమ కేసు పెట్టి దాన్ని నిరూపించడానికి అనవసరంగా ఉద్యోగస్థులను వేధించారని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ ఆరోపించారు. పెగాసెస్ పై పెద్ద సభా కమిటిని వేసి చర్చ నిర్వహించడం వృధాప్రాయాసే అయిందన్నారు. పెగాసెస్ మీద చర్చ జరగాలని శాసనసభలో వేస్ట్ గా షార్ట్ డిస్కసన్ కూడా పెట్టారని, ఇదంతా వైసీపీ ప్రభుత్వ అభద్రతకు నిదర్శనమన్నారు. మరోసారి టీడీపీ నేతలపై కేసులు పెట్టి వేధించేందుకే సభా సంఘం ప్రయత్నిస్తోందన్నారు.

టీడీపీ లేని సభాసంఘమా ?

టీడీపీ లేని సభాసంఘమా ?


వైసీపీ ప్రభుత్వం స్పీకర్ సాయంతో పెగాసస్ వాడకంపై విచారణకు ఏర్పాటు చేసిన అసెంబ్లీ హౌస్ కమిటీపై టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల విమర్శలు గుప్పించారు. అసెంబ్లీలో చర్చ లేకుండానే స్పీకర్ సాయంతో సభా సంఘం ఏర్పాటు చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు లేకుండానే సభా సంఘం ఏర్పాటు చేశారని విమర్శించారు. విపక్షం నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా లేకుండా మొత్తం వైసీపీ నేతలతో ఏర్పాటు చేసిన సభా సంఘానికి విలువ ఎక్కడుందన్నారు. ఇది ప్రభుత్వ కమిటీ కాదు అసెంబ్లీ కమిటీ అనేది గుర్తుంచుకోవాలన్నారు. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదన్నారు. అందుకే ఈ కమిటీ ఇచ్చే నివేదికలో టీడీపీని టార్గెట్ చేయబోతున్నట్లు ఆయన అంచనా వేశారు.

 కొండను తవ్వి ఎలుకనూ పట్టలేదు

కొండను తవ్వి ఎలుకనూ పట్టలేదు

ప్రస్తుతం పెగాసస్ పై హౌస్ కమిటీ విచారణలో కొండను తవ్వి ఎలుకను కూడా పట్టుకోలేకపోయారన్నారు. కనీసం పురుగునైనా పట్టారా అని ప్రశ్నించారు. పెగాసస్ కొన్నారా లేదా - ఒక్క సమాధానం చెప్పాలని పయ్యావుల డిమాండ్ చేశారు. పెగాసస్ కొనలేదని గతంలో డీజీపీ సవాంగ్ చెప్పారని పయ్యావుల గుర్తుచేశారు. పెగాసస్ కొన్నారో లేదో చెప్పకుండా ప్రజల సమాచారం సేకరించారన్నారు. ప్రతీ ప్రభుత్వం దగ్గర ఇళ్లలో ఎవరుంటున్నారనే సమాచారం సేకరిస్తారన్నారు. ఇది అన్ని ప్రభుత్వాలు చేస్తున్న పనే అన్నారు. డేటా చౌర్యంపై కేసులు పెట్టి ఏం తేల్చారని నిలదీశారు. ప్రభుత్వం గతంలో చేసిన ఆరోపణలతో ఇప్పుడు నవ్వుల పాలైందన్నారు. పెగాసస్ టీడీపీ దగ్గరుండే బాబాయ్ గొడ్డలిపోటు జరిగేదా అని ప్రశ్నించారు.

 వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, సాక్షిపైనే నిఘా

వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, సాక్షిపైనే నిఘా

ప్రస్తుత ప్రభుత్వంలో టీడీపీతో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, సాక్షిలో పనిచేస్తున్న ఉద్యోగులపైనే నిఘా పెట్టారని పయ్యావుల సంచలన ఆరోపణలు చేశారు. హాని కర వ్యక్తులపై ప్రయోగించే నిఘా అస్త్రాన్ని కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు వ్యతిరేకంగా వైసీపీ సర్కార్ దుర్వినియోగం చేసోందన్నారు. ఇందుకోసం బెంగళూరు నుంచి ప్రైవేటు వ్యక్తుల్ని సైతం నియమించుకుని మరీ వారికి నగదు రూపంలోచెల్లింపులు చేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలచే ఎవరెవరిపై నిఘా పెట్టారనేదానిపై ఆడిట్ కు సిద్ధమా అని పయ్యావుల ప్రశ్నించారు. మంత్రులు, ఎమ్మెల్యేలచే ఆరోపణలు చేయించడంకాదు రాతపూర్వకంగా సమాధానం ఇవ్వగలరా? అని నిలదీశారు. ప్రభుత్వం నిఘాపై పెడుతున్న ఖర్చుపై కాగ్ ఆడిట్ కు సిద్ధమేనా అని పయ్యావుల ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+