'జగన్‌కు జీవోలు చదవడం రాదా, హోదాపై కాంగ్రెస్ ప్లాన్'

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి జీవోలు చదవడం రాదా అని టిడిపి నైత పయ్యావుల కేశవ్ శుక్రవారం నాడు మండిపడ్డారు. రాజకీయ పార్టీలకు భూములు ఇవ్వడానికి తెచ్చిన జీవోను వైసిపి నేతలు తప్పుబట్టడం సరికాదన్నారు.

కేంద్ర ప్రభుత్వం అనుసరించిన విధానాన్నే తమ ప్రభుత్వం అవలంభించిందన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్‌కు భూముల కేటాయింపు కోసం జీవో తెచ్చారని చెప్పడం సరికాదన్నారు. జగన్‌కు జీవోలు చదవడం రాకుంటే ఎవరినైనా అడిగి తెలుసుకోవాలన్నారు.

Payyavula questions Congress, YSR Congress

జగన్ వైట్ కాలర్ క్రిమినల్స్‌ను పక్కన పెట్టుకొని తిరగడం మానుకోవాలని హితవు పలికారు. రాయలసీమలో పట్టిసీమ నీటిలో వైసిపి కొట్టుమిట్టాడుతోందన్నారు. అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు వైసిపి కొంగ జపం చేస్తోందన్నారు.

బెజవాడ పోదాం.. ఆఫీసు చూడండి: పార్టీ సీనియర్లతో అధినేత జగన్

ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి హోదా పైన చిత్తశుద్ధి లేదన్నారు. తాము ప్రయివేటి బిల్లుకు మద్దతివ్వాలని నిర్ణయించమని గుర్తు చేశారు. కానీ బిల్లు చర్చకు రాకుండా కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడ వేసిందని ఆరోపించారు. బిల్లుపై బీజేపీని తప్పుపట్టే ప్రయత్నం సరికాదన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telugudesam Party leader Payyavula questions Congress, YSR Congress.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి