టీ బిల్లు వస్తే అవిశ్వాసం కుదరదు: పయ్యావుల వ్యాఖ్య

ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటామని సీమాంధ్ర కాంగ్రెస్ శాసనసభ్యులు గవర్నర్‌కు లేఖ ఇవ్వాలని, అప్పుడు బల నిరూపణకు ముఖ్యమంత్రిని గవర్నర్ ఆదేశిస్తారని తెలిపారు. అది జరిగినప్పుడు ప్రభుత్వం కుప్పకూలుతుందని, విభజన ప్రక్రియకు బ్రేక్ పడుతుందని పయ్యావుల కేశవ్ అన్నారు.
విభజనపై మాట మారుస్తున్న జగన్ పార్టీ
రాష్ట్ర విభజనపై వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మాట మారుస్తోందని తెలుగుదేశం పార్టీ సీమాంధ్ర నాయకుడు కోడెల శివప్రసాద రావు అన్నారు. సీమాంధ్ర సమస్యలను పరిష్కరించిన తర్వాతనే రాష్ట్ర విభజనకు పూనుకోవాలని ఆయన అన్నారు. ఆంటోనీ కమిటీ, జివోఎం రాష్ట్రానికి రాకుండా, సమస్యలను అధ్యయనం చేయకుండా రాష్ట్రాన్ని ఎలా విభజిస్తారని ఆయన ప్రశ్నించారు. అడ్డగోలు నిర్ణయాలతో కాంగ్రెసు పార్టీ రాష్ట్రంలోనే కాదు, దేశంలో కూడా కనుమరుగవుతుందని ఆయన అన్నారు.
కిరణ్‌ను మార్చే ఆలోచన లేదు
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు పోరాడుతున్నామని, తానిప్పటికీ సమైక్యవాదినే అని కేంద్ర మంత్రి పళ్లంరాజు స్పష్టం చేశారు. శుక్రవారం ఉదయం ఆయన తూర్పు గోదావరి జిల్లాలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం విడిపోతే ఇరుప్రాంతాల మధ్య జలవివాదాలు వస్తాయని, ఆర్థికంగా నష్టపోతామని జీవోఎంకు వివరించినట్లు ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని మార్చే ఆలోచన అధిష్టానానికి లేదని పళ్లంరాజు చెప్పారు.












Click it and Unblock the Notifications