పిడిసిసిబి ఛైర్మెన్ పదవికి ఈదర మోహన్‌ రాజీనామా: తెర వెనుక దామరచర్ల?

Posted By:
Subscribe to Oneindia Telugu

ఒంగోలు: ప్రకాశం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఛైర్మెన్ పదవికి ఈదర మోహన్‌బాబు రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో చైర్మన్‌తో పాటు డైరెక్టర్‌ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. బుధవారం రాజీనామా లేఖను సహకారశాఖ రిజిస్ట్రార్‌కు పంపారు. తన రాజీనామాను ఆమోదించాలని కోరారు.మెజారిటీ డైరెక్టర్లు ఈదర మోహన్‌బాబును వ్యతిరేకిస్తున్నారు.దరిమిలా మోహన్‌బాబు రాజీనామా చేయాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి.

కరణం, జనార్థన్‌ల మధ్య ఆసక్తికరం: ఆత్మాభిమానాన్ని చంపుకోను, చెప్పుడు మాటలు వింటారు

ప్రకాశం జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఛైర్మెన్‌ ఈదర మోహన్‌బాబుపై గత నెల చివరి వారంలో మెజారిటీ డైరెక్టర్లు తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈదర మోహన్‌బాబు అవినీతికి పాల్పడినట్టు మీడియాకు ప్రకటనలు ఇచ్చారు.

పీడీసీసీబి ఛైర్మెన్ ఈదర మోహన్‌కు పదవీ గండం: మెజారిటీ డైరెక్టర్ల అసంతృప్తి?

ఈదర మోహన్‌బాబు టిడిపి సానుభూతిపరుడు. అయితే టిడిపికి చెందిన మెజారిటీ డైరెక్టర్లు మోహన్‌బాబు వ్యవహరశైలిని తప్పుబడుతున్నారు. ఈ విషయాన్ని తేల్చాలని టిడిపి చీఫ్ చంద్రబాబునాయుడు టిడిపి జిల్లా అధ్యక్షుడు దామరచర్ల జనార్థన్‌కు సూచించారు.

దసరా మరునాడు ప్రకాశం జిల్లా బ్యాంకు ఛైర్మెన్ ఈదరహరిబాబుతో పాటు డైరెక్టర్ల మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించేందుకు పార్టీ నాయకత్వం ప్రయత్నించింది. అయితే పరిస్థితి చేయి దాటిపోతోందన్న కారణంతోనే ఈదర మోహన్‌బాబు రాజీనామాను సమర్పించారు.

ప్రకాశం డిసిసిబి ఛైర్మెన్ ఈదర మోహన్ రాజీనామా

ప్రకాశం డిసిసిబి ఛైర్మెన్ ఈదర మోహన్ రాజీనామా

ప్రకాశం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఛైర్మెన్ పదవికి ఈదర మోహన్‌బాబు రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో చైర్మన్‌తో పాటు డైరెక్టర్‌ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. బుధవారం రాజీనామా లేఖను సహకారశాఖ రిజిస్ట్రార్‌కు పంపారు. పీడీసీసీబీ చైర్మన్‌ ఈదర మోహన్‌పై 15 మంది డైరెక్టర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు.ఈ మేరకు ఆ శాఖ రిజిస్ట్రార్‌కు లేఖ ఇచ్చారు. నిబంధనల మేరకు మెజార్టీ సభ్యులు ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై నెల రోజుల్లోపు అవిశ్వాస తీర్మానం సమావేశం నిర్వహించాల్సి ఉంది. ఇందులో భాగంగా ఈ నెల 27న సమావేశం నిర్వహించాలని సహకార శాఖ రిజిస్ట్రార్‌ డీసీఓను ఆదేశించారు.అవిశ్వాసంలో ఓటమి తప్పదని భావించిన ఈదర మోహన్ రాజీనామా చేశారని సమాచారం.

ఓటమి తప్పదని తెలిసి రాజీనామా

ఓటమి తప్పదని తెలిసి రాజీనామా

బ్యాంకు చైర్మన్‌ ఈదర, డైరెక్టర్ల మధ్య గత నెల రోజులుగా వివాదం చెలరేగింది. చైర్మన్‌ తమను వంచించి అక్రమాలకు పాల్పడ్డారని డైరెక్టర్లు ఆరోపణలకు దిగారు. ముఖ్యమంత్రి, మంత్రి, సహకార శాఖ రిజిస్ట్రార్, ఎస్పీలకు సైతం ఫిర్యాదు చేశారు. మరోవైపు చైర్మన్‌ ఈదర సైతం కొందరు డైరెక్టర్లు, అధికారులు అక్రమాలకు పాల్పడ్డారని విమర్శలు చేయడమే కాక ముఖ్యమంత్రికి సైతం ఫిర్యాదు చేశారు. అంతేకాదు అవిశ్వాస తీర్మానాన్ని పెట్టారు.అవిశ్వాస తీర్మానంలో ఓటమి తప్పదని ఈదర మోహన్‌బాబు భావించారు. దీంతో ఆయన రాజీనామా చేశారు.మెజార్టీ సభ్యులు తనకు వ్యతిరేకంగా ఉండటంతో విశ్వాసపరీక్షలో ఓటమిపాలు కావడం కంటే రాజీనామా చేయడమే ఉత్తమమని ఈదర భావించారు.

దామరచర్ల జనార్థన్‌పై ఈదర ఆరోపణలు

దామరచర్ల జనార్థన్‌పై ఈదర ఆరోపణలు

ప్రకాశం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఛైర్మెన్ ఈదర మోహన్‌బాబుకు టిడిపి జిల్లా అధ్యక్షుడు దామరచర్ల జనార్థన్‌కు మధ్య విభేధాలున్నాయి. గతంలో దామరచర్ల జనార్థన్‌పై ఈదర ఆరోపణలు చేశారు. రాజీనామా చేసిన సమయంలో కూడ ఈదర మోహన్‌బాబు దామరచర్లపై ఆరోపణలు చేశారు.

ఈ మేరకు సభ్యులకు నోటీసులు సైతం జారీ చేశారు. ఈ మేరకు బుధవారం తన రాజీనామా లేఖను రిజిస్ట్రార్‌కు పంపారు. ఇదే విషయాన్ని ఈదర విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. ఈదర రాజీనామాను ఆమోదిస్తే అవిశ్వాస సమావేశం అవసరం లేదు.దామచర్ల మద్ధతుదారులంతా మోహన్‌ను తీవ్రంగా వ్యతిరేకించారు. తన రాజీనామాకు కారణం జనార్దనే అంటూ తాజాగా ఈదర మోహన్‌బాబు ఆరోపణలు గుప్పించారు.

 నా మనోభావాలు కూడ ముఖ్యమే

నా మనోభావాలు కూడ ముఖ్యమే

‘పార్టీ ముఖ్యమే కాదనను...కానీ నా మనోభావాలు నాకు ముఖ్యమే' అని ప్రకాశం జిల్లా సహకార కేంద్రబ్యాంకు (పీడీసీసీబీ) చైర్మన్‌ ఈదర మోహన్‌బాబు పేర్కొన్నారు. అందుకే అవిశ్వాసం నోటీసులు జారీ అవుతున్నాయని తెలిసినందున బ్యాంకు చైర్మన్‌ పదవికి, డైరెక్టర్‌ పదవికి రాజీనామా చేశానని చెప్పారు. నెలరోజుల క్రితం తాను సహకార వ్యవస్థపై జరుగుతున్న దాడిని నిరసిస్తూ రాజీనామా చేస్తే మంత్రి శిద్దా రాఘవరావు చేసిన విజ్ఞప్తి మేరకు రైతాంగ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని తిరిగి పదవిలో కొనసాగడం జరిగిందన్నారు. కేవలం నెలరోజుల్లోనే డైరెక్టర్లు పెద్ద ఎత్తున తనపై ఆరోపణలు చేస్తూ ఎదురుదాడికి దిగుతున్నారంటే దానికిగల కారణాలు టిడిపి జిల్లా అధ్యక్షులు దామచర్ల జనార్థన్‌రావుకే తెలుసన్నారు.తనకు జరిగిన అన్యాయాన్ని స్వయంగా సీఎంకు వివరించి న్యాయ విచారణ కోరాలని నిర్ణయించుకున్నట్టు వెల్లడించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
PDCCB chairman Edara Mohan Babu resigned on Wednesday.Majority directores issued no confidence motion on Edara Mohan recently.So , Edara Mohan resigned chairman post.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి