భయపడేది లేదు, దాడులు చేస్తే ఊరుకోం: చంద్రబాబుపై పెద్దిరెడ్డి

Subscribe to Oneindia Telugu

చిత్తూరు: తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అన్నారు. చిత్తూరు జిల్లా నగరిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి, ఆర్కే రోజా, భూమన కరుణాకర్ రెడ్డి, నారాయణస్వామి ఆదివారం విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చంద్రబాబుకు దమ్ముంటే ఫార్టీ ఫిరాయించిన నేతలతో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. రెండేళ్ల పాలనలో సీఎం చంద్రబాబు ఒక్క హామీని కూడా నెరవేర్చలేదనివిమర్శించారు.

వైయస్సార్ కాంగ్రెస్ నేతలపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని ఆ పార్టీ కీలక నేతలు పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి, ఆర్కే రోజా, భూమన కరుణాకర్ రెడ్డి, నారాయణస్వామి స్పష్టంచేశారు.

Peddireddy fired at Chandrababu

అభివృద్ధి నిరోధకులు వైయస్సార్ కాంగ్రెస్ నేతలు: చినరాజప్ప

విజయనగరం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అభివృద్ధి నిరోధకులుగా తయారయ్యారని ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర హోంమంత్రి నిమ్మకాల చినరాజప్ప ఆరోపించారు. ఎమ్మెల్యే మీసాల గీత స్వగృహంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమం పట్టని ఆ పార్టీ నేతలకు తమ ప్రభుత్వాన్ని విమర్శించే స్థాయి లేదన్నారు.

గడపగడపకూ వైసీపీ పేరుతో ఆ పార్టీ నేతలకు ప్రజల్లో అసలు విలువే లేదన్నారు. బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు ఖాళీగా ఉన్నారని, రోజూ ప్రెస్‌మీట్‌లు పెట్టి విమర్శలు చేయడం అలవాటుగా చేసుకున్నారని ఆయన ఎద్దేవా చేశారు.

రాష్టమ్రంత్రిగా పదేళ్లపాటు ఉన్న బొత్స సత్యనారాయణ విజయనగరం జిల్లాకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. 11 కేసులలో ముద్దాయిగా ఉన్న వైసీపీ అధ్యక్షుడు జగన్‌ను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
YSRCP Congress leader Peddireddy Ramachandra Reddy on Sunday fired at TDP president and Andhra Pradesh CM Chandrababu Naidu.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి