మనలో మనమాట, మోదీకి.. చంద్రబాబుకు చెడింది.. మేనిఫెస్టోపై పెద్దిరెడ్డి సెటైర్లు ..!

ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటుకోవాలని వైకాపా, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. మరోసారి అధికారం సొంతం చేసుకోవాలని వైసీపీ ప్రయత్నిస్తున్నది. జగన్ ను ఇంటికి సాగనంపుతామని మాజీ సీఎం, టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రతి బహిరంగ సభలో చెబుతున్నారు.

ఎన్నికల సందర్బంగా మొదట మేనిఫెస్టో విడుదల చేసిన వైఎస్ జగన్ మాది పేదల మేనిఫెస్టో అని, చెప్పిందే చేస్తామని, గత ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ఇచ్చిన 99 శాతం హామీలను అమలు చేశామని పదేపదే చెబుతున్నారు. అయితే 99 శాతం హామీలను అమలు చేస్తే మిగిలిన 1 శాతం హామీ ఏమైయ్యిందని, మీరు పేదలకు చేసింది ఏమీ లేదని, ఆంధ్రప్రదేశ్ ను సర్వనాశనం చేశారని ప్రతిపక్షాలు సీఎం జగన్ తో పాటు వైసీపీ నాయకుల మీద మండిపడుతున్నాయి.

Peddireddy Ramachandra Reddy criticized the manifesto of TDP Janasena and BJP alliance

గత మంగళవారం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మిడి మేనిఫెస్టోను మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ విడుదల చేశారు. ఇదే సమయంలో చంద్రబాబు నాయుడు పలు హామీలను ప్రకటించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే తాము ఇచ్చిన హామీలను అమలు చేస్తామని చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ ప్రకటించారు. అయితే ఆ సమావేశంలోని వేదిక మీద ఆంధ్రప్రదేశ్ కు చెందిన బీజేపీ నాయకులు ఎవ్వరూ కనపడలేదు.

ఇదే విషయాన్ని అస్త్రంగా చేసుకున్న వైకాపా నాయకులు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి మేనిఫెస్టోపై వైసీపీ సీనియర్ నాయకుడు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి పుంగనూరు నియోజక వర్గంలో జరిగిన బహిరంగ సభలో విరుచుకుపడ్డారు. కూటమి మేనిఫెస్టోలో బీజేపీకి చెందిన నాయకుల ఫోటో ఒక్కటైనా ఉందా ? అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి టీడీపీ, జనసేన నాయకులను ప్రశ్నించారు.

Peddireddy Ramachandra Reddy criticized the manifesto of TDP Janasena and BJP alliance

చంద్రబాబు నాయుడు ఇంతకాలం అపద్దాలతోనే బతికేశాడని, ఇప్పుడు కూడా అపద్దాలు చెప్పి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఆరోపించారు. ఎన్డీయే కూటమి మేనిఫెస్టోని ప్రజలు నమ్మడం లేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి వ్యంగంగా అన్నారు. గతంలో వైసీపీ విడుదల చేసిన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను సీఎం వైఎస్ జగన్ నేరేవర్చారని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు.

ఇప్పుడు విడుదల చేసిన వైసీపీ మేనిఫెస్టోలని హామీలు అన్ని నేరవేర్చుతామని పెద్దిరెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తుందని, అందులో ఎలాంటి సందేహం లేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పుంగనూరు నియోజక వర్గంతో పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పలు నియోజక వర్గాల్లో సంచరిస్తున్న పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి మాజీ సీఎం చంద్రబాబును లక్షంగా చేసుకుని పలు ఆరోపణలు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+