చంద్రబాబు మోసగాడు, ఆ మాజీ సీఎం చచ్చిన పాము, మాకు పోటీనా ?, పెద్దిరెడ్డి పంచ్ లు !

ఎన్నికల సమయంలో టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీ నాయకుల మాటల తూటాలు పేలుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీని టార్గెట్ చేస్తున్న టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు ఆ పార్టీ నాయకులపై విమర్శలు చేస్తున్నారు. ఇదే సమయంలో వైసీ నాయకులు కూడా కూటమి నాయకులను ఏమాత్రం మూలాజు లేకుండా ఏకిపారేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏ ముఖం పెట్టుకుని ప్రజల ముందుకు వచ్చి ఓట్లు అడుతున్నారో అని మాతో పాటు టీడీపీ నాయకులకు కూడా అర్థం కావడం లేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి వ్యంగంగా అన్నారు. చంద్రబాబు నాయుడు మాయమాటలు చెప్పి ప్రజలను ఓట్లు అడుగుతున్నారని, ఆయన మాటలను ప్రజలు నమ్మడంలేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అన్నారు.

Peddireddy Ramachandra Reddy who targeted Chandrababu Naidu and Kiran Kumar Reddy

పుంగనూరు పట్టణంలో ఎన్నికల ప్రచారం చేస్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఇద్దరూ మాజీ సీఎంలను ఏకిపారేశారు. 2014లో జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు 600 హామీలతో ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారని, ఆ ఎన్నికలు పూర్తి అయిన తరువాత మేనిఫెస్టోను చెత్తబుట్టలో విసిరేశారని పెద్దిరెడ్డి ఆరోపించారు. 2019లో వైఎస్ జగన్ విడుదల చేసిన మేనిఫెస్టులోని అన్ని హామీలను తూ.చా. తప్పకుండా నేరవేర్చారని, టీడీపీ, వైసీపీకి ఉన్న తేడా అదే అన్ని పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అన్నారు.

Peddireddy Ramachandra Reddy who targeted Chandrababu Naidu and Kiran Kumar Reddy

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి చచ్చిన పాముతో సమానం అని, ఆయన మా కొడుకు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి పోటీనే కాదని పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి వ్యంగంగా అన్నారు. రాజంపేట పార్లమెంట్ నియోజక వర్గంలో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి డిపాజిట్లు కూడా దక్కవని, ప్రజలు మిథున్ రెడ్డి వెంటే ఉన్నారని పెద్దిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. చచ్చిన పాముతో మాకు పోటీ ఏమిటని పెద్దిరెడ్డి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిపై పంచ్ లు విసిరారు.

వాలింటర్ల అందిస్తున్న సేవలు మరవలేమని, కరోనా కష్టకాలంలో కూడా వారు ప్రాణాలకు తెగించి పని చేశారని పెద్దిరెడ్డి అన్నారు. అలాంటి వాలంటీర్ల విషయంలో కూటమి నాయకులు రాజకీయాలు చేశారని పెద్దిరెడ్డి ఆరోపించారు. జగనన్న చెప్పిందే చేస్తారని, చేసేటివి మాత్రమే చెబుతారని, జగన్ కు మోసం చేసే అలవాటు లేదని, ఆమన మరోసారి సీఎం అవుతారని పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అయితే పాపాల పెద్దిరెడ్డికి నూకలు చెల్లాయని, లేనివి ఉన్నట్లు చెప్పకుంటున్నారని కూటమి నాయకులు మండిపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+