బాబు తల నరుకుతామని ఈశ్వరి వ్యాఖ్య: భగ్గుమన్న పీతల సుజాత

ఏలూరు: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు గిడ్డి ఈశ్వరిపై ఆంధ్రప్రదేశ్ మంత్రి పీతల సుజాత భగ్గుమన్నారు. ఈశ్వరిపై చర్యలు తీసుకుంటామని ఆమె శుక్రవారంనాడు మీడియాతో చెప్పారు.

రాష్ట్రంలో త్వరలో అందరికీ ఆమోదయోగ్యమైన నూతన ఇసుక విధానాన్ని అమలు చేస్తామని ఆమె చెప్పారు. ఇసుక విధానంపై ప్రజల అభిప్రాయాలు తెలుకుంటామని కూడా చెప్పారు. బాక్సైట్ గనులు లీజుకు ఇవ్వడం వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలోనే ప్రారంభమైందని ఆమె చెప్పారు.

Peethala sujatha retaliates Eshwari comments on Chandrababu

బాక్సైట్ గనుల జోలికొస్తే చంద్రబాబు నాయుడు తల నరుకుతామని గిడ్డి ఈశ్వరి గురువారంనాడు విశాఖ సభలో అన్నారు. ప్రతిపక్ష నేత, వైయస్ జగన్ సమక్షంలో గిడ్డి ఈశ్వరి ఆవేశపూరితంగా ప్రసంగించడంతో పాటు చంద్రబాబుపై వ్యక్తిగత దూషణలకు సైతం దిగారు.

చంద్రబాబును నరరూప రాక్షసుడిగానే కాక వెన్నుపోటుదారుడు, దగాకోరుగా ఆమె అభిర్ణించారు. బాక్సైట్ తవ్వకాలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవోను నిరసిస్తూ నిషేధిత మావోయిస్టులు ముగ్గురు టీడీపీ గిరిజన నేతలను అపహరించిన ఘటనను ప్రస్తావించిన ఈశ్వరి, పార్టీ జెండా మోసిన గిరిజనులకు కష్టం వస్తే చంద్రబాబు కనీసం స్పందించలేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+