అమరావతి పై కేంద్రంలో కీలక పరిణామాలు, నెక్స్ట్ ఇక..!!
అమరావతి పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతికి ఇప్పటికే కేంద్రం ఆర్దిక సాయం తో పాటుగా అవసరమైన సాయం అందిస్తోంది. అమరావతి పనులను ప్రధాని మోదీ రీ లాంఛ్ చేసారు. తాజాగా రైతుల సమస్యల పైన ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకుంది. రెండో విడత లాండ్ పూలింగ్ కొనసాగుతోంది. ఇదే సమయంలో ఎంతో కాలంగా అమరావతి వాసులు కోరుతున్న విధంగా అధికారికంగా అమరావతికి రాజముద్ర పడనుంది. ఇందు కోసం కేంద్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
అమరావతికి చట్ట బద్దత పై కేంద్ర మంత్రి పెమ్మసాని కీలక ప్రకటన చేసారు. అమరావతిని శాశ్వత రాజధానిగా చేసేందుకు పార్లమెంట్‌లో ఈ సమావేశాల్లో లేదా వచ్చే సమావేశాల్లో బిల్లు ప్రవేశపెడతామని వెల్లడించారు. ఈ సమావేశాల్లోనే అమరావతిపై బిల్లు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. 2014 నుంచి అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా గుర్తించాలా.. లేక ఇప్పటి నుంచి గుర్తించాలా అనే సాంకేతిక కారణాలతో ఆలస్యం జరుగుతోందని వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి బిల్లును మానిటర్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ప్రణాళికా బద్ధంగా అమరావతిని అభివృద్ధి చేస్తున్నామని వ్యాఖ్యానించారు. పార్లమెంట్‌లో అమరావతి బిల్లు సాంకేతిక కారణాలతో ఆలస్యం అవుతోందని తెలిపారు. వేల మంది అమరావతి నిర్మాణం కోసం పనిచేస్తున్నారని పేర్కొన్నారు.

తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటికే 16 జాతీయ సంస్థల ఏర్పాటుకు శంకుస్థాపన చేశారని గుర్తు చేసారు. హడ్కో ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుందని వివ రించారు. కాగ్, పోస్టల్ బిల్డింగ్, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు అమరావతిలో ఏర్పాటు అవుతు న్నాయని తెలిపారు. అవుటర్ రింగ్ రోడ్డు, జాతీయ రహదారుల ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగు తున్నాయని చెప్పుకొచ్చారు. అమరావతి నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తు న్నాయని వెల్లడించారు. అమరావతి బిల్లుకు చిన్న చిన్న టెక్నికల్ సమస్యలు వచ్చాయని పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఇప్పటికే న్యాయశాఖ ఈ బిల్లుకు సంబంధించి క్లియరెన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సాంకేతిక సమస్యలను అధిగమించి ప్రస్తుత సమావేశాల్లో లేదా, ఫిబ్రవరి లో జరిగే బడ్జెట్ సమావేశాల్లో అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లుకు ఆమోద ముద్ర పడే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications