AP Pensions: ఏపీలో జోరుగా పెన్షన్ల పంపిణీ..! హైబ్రిడ్ మోడ్ లో..
ఏపీలో ఈ నెల పెన్షన్ల పంపిణీ ప్రారంభమైంది. ఓవైపు ఈసీ ఆదేశాలు, మరోవైపు జనం ఇబ్బందులు అన్నీ వెరసి.. సజావుగా పెన్షన్ల పంపిణీ సాగిపోతోంది. ఆధార్ తో బ్యాంక్ ఖాతా లింక్ అయిన వారికి వారి అకౌంట్లలో పెన్షన్లు జమ చేస్తున్నారు. లేని వారికి ఇళ్ల వద్దే సచివాలయ సిబ్బంది పంపిణీ చేసేస్తున్నారు. దీంతో ఈసారి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పెన్షన్ల పంపిణీ జరుగుతోంది. ఈ వివరాలను అధికారులు ఎప్పటికప్పుడు అందిస్తున్నారు.
నిన్న మేడే సందర్భంగా పెన్షన్ల పంపిణీలో ఇబ్బందులు తలెత్తాయి. బ్యాంకు ఖాతాలకు పెన్షన్లు జమ కాకపోవడం, ఇళ్ల వద్ద కూడా పంపిణీ కాకపోవడంతో పెన్షన్ దారుల్లో ఆందోళన నెలకొంది. కానీ ఇవాళ మాత్రం పెన్షన్ల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేశారు. దీంతో పెన్షన్ల పంపిణీ కోసం సిబ్బంది సిద్దమయ్యారు. ఉదయం నుంచీ ఇళ్ల వద్ద పెన్షన్ల పంపిణీ సాగుతోంది. ఇప్పటి వరకూ 12లక్షల 82 వేల 955 మందికి ఇంటింటికి పెన్షన్ పంపిణీ పూర్తి చేసినట్లు అధికారులు ప్రకటించారు.

రేపటిలోగా మొత్తం 16 లక్షల57 వేల 361 మందికి ఇంటి వద్దనే పెన్షన్లు పంపిణీ పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆధార్ తో బ్యాంక్ ఖాతా లింక్ అయిన వారికి కూడా బ్యాంకుల్లో నగదు జమ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటివరకు 44 లక్షల 76 వేల 312 మంది ఖాతాల్లో నగదు జమ చేశారు. మొత్తం 48 లక్షల 92 వేల 503 మంది లబ్ధిదారుల ఖాతాల్లోకి కాసేపట్లోగా నగదు జమ అవుతుందని అధికారులు చెప్తున్నారు.












Click it and Unblock the Notifications