అనంత అతలాకుతలం, నిన్న విజయవాడ, నేడు, రేపు!!

ఇటీవల విజయవాడలో భారీ వర్షాలు కురవడం, వరదలు రావడంతో ఆ నగరం అతలాకుతలం అయ్యింది. భారీ వర్షాలతో పాటు కృష్ణానది ఉప్పొంగడంతో ఆ వరదల దెబ్బకి విజయవాడ నగరం అస్తవ్యస్తమైంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురంలో కురిసిన భారీ వర్షాల దెబ్బకి ఆ పరిసర ప్రాంతాల్లోని కాలనీలు జలమయం కావడంతో ఆ ప్రాంతంలోని ప్రజలు హడలిపోయారు.

అనంతపురంలో సోమవారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఈ దెబ్బకు అనంతపురం నగరం సమీపంలోని ప్రాంతాలు జలమయం అయ్యాయి. రాత్రి పూట భారీ వర్షాలు కురవడంతో గాఢనిద్రలో ఉన్న ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే భయంతో ప్రజలు వారి ఇళ్లపైకి ఎక్కి సాయం కోసం ఎదురుచూశారు. అనంతపురం నగరం సమీపంలోని పండమేరు వాగు ఉదృతంగా ప్రవహిస్తోంది.

People in Anantapur city were troubled by heavy rain on Monday night

సమాచారం తెలుసుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. స్థానిక ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అనంతపురంలో ఒక్కసారిగా భారీ వర్షాలు పడటంతో ఆ పరిసర ప్రాంతాల్లోని కాలనీలు జలమయం అయ్యాయి. అనంతపురం కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. పండమేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఆ పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

ఇదే సమయంలో అనంతపురం జిల్లాలోని కనగానపల్లి మండలం లోని ముక్తాపురం చెరువు నీరు పారడంతో ఆ వర్షపు నీరు బెంగళూరు- హైదరాబాద్ జాతీయ రహదారిపై చేరుకుంది. వర్షం నీరు, చెరువు నుంచి ప్రవహించిన నీరు జాతీయ రహదారిపై చేరుకోవడంతో హైదరాబాద్- బెంగళూరు జాతీయ రహదారిలో వాహన సంచారం అస్తవ్యస్తం అయ్యింది. కొన్ని గంటలపాటు ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి.

సమాచారం తెలుసుకున్న అధికారులు, సిబ్బంది ఆ వర్షం నీరును తొలగించడానికి అనేక ప్రయత్నాలు చేశారు. భారీ వర్షం రావడంతో పాటు చెరువులోని నీరు జాతీయ రహదారి మీదకు రావడంతో హైదరాబాద్- బెంగళూరు జాతీయ రహదారిలో సంచరిస్తున్న వాహన చోదకులు అనేక ఇబ్బందులకు గురైనారు. వాహనాలలో నుంచి బయటకు వెళ్ళలేక, ఆ వాహనాలు ముందుకు కదలలేక ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని గంటల తర్వాత ఆ వర్షం నీరును తొలగించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+