ఎల్ఈడీ బల్బుల కోసం ప్రజల క్యూ, నివేదిక వచ్చాక నిధులు: వెంకయ్య
కాకినాడ: తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడలో ఎల్ఈడీ బల్బుల కోసం ప్రజలు శనివారం నాడు వరుస కట్టారు. ఎల్ఈడీ బల్బులను ఒకరోజు మాత్రమే పంపిణీ చేస్తామని ప్రకటించారు. దీంతో, పెద్ద ఎత్తున ప్రజలు వరుస కట్టారు. ఎల్ఈడీ బల్బుల పంపిణీకి ఆరు కేంద్రాలను ఏర్పాటు చేశారు.
నివేదిక వచ్చాక నిధులు: వెంకయ్య
అకాల వర్షాలతో దెబ్బతిన్న ఏపీని ఆదుకోమని కేంద్రం నుంచి నిధులు విడుదల చేయాలని కోరుతామని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు శనివారం అన్నారు. ఆయన వర్షం పడిన ప్రాంతాలలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
వర్షాల పైన పూర్తిస్థాయి నివేదిక వచ్చాక కేంద్రం సాయం చేస్తుందని చెప్పారు. ఎన్డీఆర్ఎఫ్ కింద రూ.350 కోట్లు విడుదల చేయమని కోరుతామన్నారు. వీటి కంటే అదనంగా మరిన్ని నిధులు వచ్చేలా చేస్తామన్నారు. వెంకయ్య మనుబోలు వద్ద గండి పడిన హైవేను పరిశీలించారు. హైవేను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ప్రధాని ఆదేశించారని వెంకయ్య చెప్పారు.

సచివాలయంలో ఏపీ మంత్రివర్గ ఉపసంఘ భేటీ
ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ఛాంబర్‌లో శనివారం ఆ రాష్ట్ర మంత్రి వర్గ ఉప సంఘం భేటీ అయింది. మంత్రులు గంటా శ్రీనివాస రావు, కామినేని శ్రీనివాస్‌లు ఈ భేటీలో పాల్గొన్నారు. ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేశ్ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
మత్స్యకారుల సమస్యలను పరిష్కరిస్తాం: అచ్చెన్నాయుడు
శ్రీకాకుళం జిల్లాలో మత్సకారుల సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం మండలం గనగళ్ల గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. టిడిపి ప్రభుత్వ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు మత్స్యకారుల అభ్యున్నతికి పలు సంక్షేమ పథకాలను అందించిందన్నారు.












Click it and Unblock the Notifications