కర్నూలు జిల్లాలో భూమి నుంచి పొగలు, వింత శబ్ధాలు: ఇదీ కారణం
కర్నూలు జిల్లాలో భూమి నుంచి వింత శబ్దాలు, పొగలు రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ సంఘటన బుధవారం నాడు చోటు చేసుకుంది.
కర్నూలు: కర్నూలు జిల్లాలో భూమి నుంచి వింత శబ్దాలు, పొగలు రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ సంఘటన బుధవారం నాడు చోటు చేసుకుంది.

భారీ శబ్ధం, భూమి నుంచి పొగలు
కర్నూలు జిల్లాలోని హాలహర్వి మండలం మల్లికార్జునపల్లి (ఎంకె పల్లి)లో భూమి నుంచి హఠాత్తుగా పొగలు వచ్చాయి. భారీ శబ్ధం కూడా వచ్చింది. భారీ శబ్దం, పొగలు రావడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు.

స్థానికుల ఆందోళన
ఎప్పుడు ఏం జరుగుతుందోనని స్థానికులు భయపడ్డారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. బుధవారం ఉదయం ఏడు గంటల సమయంలో రైతులు పొలం పనులు చేసుకునేందుకు వెళ్లారు.

అధికారులకు సమాచారం
ఆ సమయంలోనే హఠాత్తుగా భారీ శబ్దం, పొగలు వచ్చాయి. పలువురు వెంటనే అధికారులకు సమాచారం అందించారు. విషయం తెలిసిన అధికారులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు.

వచ్చే సమయానికి పొగలు రాలేదు
అధికారులు వచ్చే సమయానికి పొగలు రాలేదు. అయితే, వాటిని గమనించిన అధికారులు.. తడి నేల పైన పిడుగు పడటంతో ఈ పొగలు వచ్చాయని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications