జగన్ ఓదార్పు, పువ్వులిచ్చిన చిన్నారి(పిక్చర్స్)

విశాఖపట్నం: విశ్వసనీయత కలిగిన నాయకుడినే వచ్చే ఎన్నికల్లో ఎన్నుకోవాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం విశాఖపట్నం జిల్లాలో పర్యటించిన ఆయన భీమిలి నియోజకవర్గం తగరపు వలసలో బహిరంగసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత సింగపూర్ లాంటి నగరాన్ని సీమాంధ్రలో నిర్మిస్తానని అన్నారు.

చదువుకున్న ప్రతీ విద్యార్థికి ఉద్యోగ భద్రత కల్పిస్తానని జగన్ అన్నారు. అయితే తాను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడులా సాధ్యం కానీ హామీలు ఇవ్వనని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తనను ఆశీర్వదించాలని, అధికారంలోకి వచ్చాక ప్రజల కష్టాలను తీరుస్తానని చెప్పారు.

ఓట్లు, సీట్ల కోసం చంద్రబాబు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను వంచించారని దుయ్యబట్టారు. ఇప్పుడు అధికారంలోకి రావడానికి తోచిన హామీలన్నీ ఇచ్చేస్తున్నారని, రైతులకు రుణమాఫీ చేస్తా అంటున్నాడని.. అయితే తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఆ పని ఎందుకు చేయలేదని జగన్ ప్రశ్నించారు.

ప్రజలను మోసం చేయడానికి ఇటువంటి దొంగ హామీలిచ్చే చంద్రబాబును జైల్లో పెట్టాలని ఆయన అన్నారు. తాను చంద్రబాబులా ప్రజలకు సాధ్యం కానీ హామీలివ్వనని, చేసేదే చెబుతానని.. చెప్పిందే చేస్తానని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఇది ఇలా ఉండగా మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ ఖమ్మం జిల్లాలోని మధిర, ఇల్లెందు, కొత్తగూడెం, సత్తుపల్లిలో రోడ్ షో నిర్వహించారు.

విజయమ్మ రోడ్ షో

విజయమ్మ రోడ్ షో

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ ఖమ్మం జిల్లాలోని మధిర, ఇల్లెందు, కొత్తగూడెం, సత్తుపల్లిలో రోడ్ షో నిర్వహించారు.

మహిళను ఓదారుస్తూ..

మహిళను ఓదారుస్తూ..

విశాఖపట్నం జిల్లాలో పర్యటించిన వైయస్ జగన్మోహన్ రెడ్డి భీమిలి నియోజకవర్గం తగరపు వలసలో బహిరంగసభ నిర్వహించారు.

వికలాంగుడితో మాట్లాడుతూ..

వికలాంగుడితో మాట్లాడుతూ..

విశాఖపట్నం జిల్లాలో పర్యటించిన వైయస్ జగన్మోహన్ రెడ్డి భీమిలి నియోజకవర్గం తగరపు వలసలో బహిరంగసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ వికలాంగుడితో మాట్లాడుతున్న జగన్.

వృద్ధురాలితో..

వృద్ధురాలితో..

విశాఖపట్నం జిల్లాలో పర్యటించిన వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలను కలుసుకుని వారి సమస్యలు విన్నారు. ఈ సందర్భంగా ఓ వృద్ధురాలితో జగన్.

జగన్‌కు పుష్పగుచ్ఛం

జగన్‌కు పుష్పగుచ్ఛం

విశాఖపట్నం జిల్లాలో పర్యటించిన వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలను కలుసుకుని వారి సమస్యలు విన్నారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డికి పుష్పగుచ్ఛం అందిస్తున్న ఓ చిన్నారి.

వృద్ధురాలికి ఓదార్పు

వృద్ధురాలికి ఓదార్పు

విశాఖపట్నం జిల్లాలో పర్యటించిన వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలను కలుసుకుని వారి సమస్యలు విన్నారు. ఈ సందర్భంగా వృద్ధురాలిని ఓదారుస్తున్న జగన్మోహన్ రెడ్డి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+