దొంగ యాత్రలతో మోసం చేయాలనుకుంటే...: జగన్‌పై మంత్రి పత్తిపాటి
హైదరాబాద్: దొంగ యాత్రలతో మోసం చేయాలనుకుంటే ప్రజలే బుద్ధి చెబుతారని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. ప్రజలకు ఉపయోగపడే సూచనలు ఇస్తే తాము స్వీకరిస్తామని, కానీ అభివృద్ధికి అడ్డుపడితే చూస్తూ ఊరుకోబోమని ఆయన అన్నారు.
తమ తెలుగుదేశం పార్టీని విమర్శించే హక్కు కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలకు లేదని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమ తెలుగుదేశం పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి సహించకలేకనే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని ఆయన అన్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్‌ను విశ్వసించే స్థితిలో ప్రజలు లేరని మంత్రి పుల్లారావు అన్నారు. ప్రజలకు అవసరమయ్యే సూచనలు, సలహాలు ఎవరిచ్చినా స్వీకరిస్తామని ఆయన అన్నారు. టీడీపీ అభివృద్ధిని చూసి వైసీపీ,కాంగ్రెస్ నాయుకులు ఓర్వలేకపోతున్నారన్నారు.
గోదావరినదిపై నిర్మిస్తున్న పట్టిసీమ ప్రాజెక్టు వస్తే వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి పుట్టగతులు ఉండవనే భయం పట్టుకుందని, అందుకే ప్రాజెక్టు నిర్మాణ విషయంపై కూడా ఆ పార్టీ రాజకీయం చేస్తుందని ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు.












Click it and Unblock the Notifications