జగన్ వైఫల్యాలు, వైసీపీలో కొనసాగటం పై తేల్చేసిన పేర్ని నాని..!!

వైసీపీ ఓటమి తరువాత కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ ముఖ్య నేతలు ఓటమి గురించి విశ్లేషణలు చేస్తున్నారు. జగన్ వైఫల్యాలను బయట పెడుతున్నారు. మాజీ మంత్రి పేర్ని నాని సైతం పార్టీ ఓటమి వెనుక కారణాలను వెల్లడించారు. పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు నష్టపోయారని చెప్పుకొచ్చారు. పార్టీ భవిష్యత్ గురించి కీలక వ్యాఖ్యలు చేసారు. తాను వైసీపీలో కొనసాగటం పైన పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

కేడర్ కు నష్టం జరిగింది
అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ ఓటమి పైన పేర్ని నాని విశ్లేషణ చేసారు. జగన్ నిర్ణయాల వలన ప్రజలకు నష్టం కలగలేదని...పార్టీని నమ్ముకున్న వారు నష్టపోయారని వ్యాఖ్యానించారు. పార్టీలో ఉండటం ద్వారా ఆర్దికంగా బలోపేతం కావటంతో పాటుగా ప్రజల్లో పరపతి పెరుగుతుందని చాలా మంది ఆశించారని చెప్పుకొచ్చారు. జగన్ కేవలం సంస్కరణల పైనే ఫోకస్ చేస్తూ తీసుకున్న నిర్ణయాల కారణంగా కేడర్ కు నష్టం జరిగిందని వివరించారు. చాలా మంది పార్టీ మద్దతు దారులక బిల్లులు రావాల్సి ఉందన్నారు.

Perni Nani sensational comments over YSRCP future and his political retirement

ప్రజలతో గ్యాప్ పెరిగింది
జగన్ తన ముఖ్యమంత్రి కార్యాలయం ఎమ్మెల్యేలకు అనుకూలంగా పని చేయలేదని పేర్ని నాని వ్యాఖ్యానించారు. జగన్ కు ఎమ్మెల్యేలు, పార్టీకి గ్యాప్ పెరిగిపోయిందన్నారు. దీనికి చాలా కారణాలు ఉన్నాయని వివరించారు. తాము ఈ అంశాలను జగన్ కు ఎన్నికలకు ముందే వివరించే ప్రయత్నం చేసామని చెప్పుకొచ్చారు. జగన్ సంస్కరణల దిశగా తీసుకున్న నిర్ణయాలతో ప్రజలు, పార్టీకి మధ్య ఉండాల్సిన బాండింగ్ దెబ్బ తిందని పేర్ని నాని విశ్లేషించారు. అతిగా అధికారుల మీద ఆధార పడితే ఫలితాలు ఇలాగే ఉంటాయన్నారు.

జగన్ సీఎం అయ్యాకే
వైసీపీలోకి రావాలని జగన్, విజయమ్మ, షర్మిల నాడు కోరారని..ఇప్పుడు ఆస్తి గొడవలు ఉంటే కోర్టుల్లో చూసుకోవాలని..ఇలా చేయటం సరి కాదని సూచించారు. నాయకుడు కష్టాల్లో ఉన్నప్పుడు ఆయనకు, పార్టీకి దూరం కావటం బాగోదని తాను రాజకీయాల్లో కొనసాగుతున్నానని చెప్పారు. మళ్లీ జగన్ ను సీఎం పీఠం పైన కూర్చోబెట్టిన తరువాత తాను రాజకీయాల నుంచి దూరం అవుతానని పేర్ని నాని ప్రకటించారు. తన కుమారుడుకు సీటు ఇస్తారా లేదా అనేది జగన్ ఇష్టం అంటూ పేర్ని నాని తేల్చి చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+