• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మహానాడులో జరుగుతున్నవి చర్చలా? లేకా క్యాబరే డ్యాన్సులా? పేర్ని నాని ఫైర్

|
Google Oneindia TeluguNews

ప్రకాశం జిల్లా ఒంగోలులో టిడిపి మహానాడు కొనసాగుతోంది. టిడిపి మహానాడు వేదికగా చంద్రబాబు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు. జగన్ పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. వైసిపి మూడేళ్ల పాలనలో రాష్ట్రంలో అరాచకాలు పెరిగిపోయాయని, ప్రజలలో తీవ్ర అసహనం వ్యక్తం అవుతుందని పేర్కొన్న చంద్రబాబు క్విట్ జగన్ సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ నినాదాలు చేశారు. ఉన్మాది పాలనలో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

మహిళా నేతలతో జగన్ మోహన్ రెడ్డి ని బూతులు తిట్టిస్తున్నారు : పేర్ని నాని
ఇక ఈ క్రమంలో టిడిపి మహానాడులో చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలపై, తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమం పై కృష్ణా జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అసలు మహానాడులో జరుగుతున్నవి చర్చలా ? లేక క్యాబరే డాన్సా అంటూ ప్రశ్నించారు. మహానాడు లో మహిళా నేతలతో జగన్ మోహన్ రెడ్డి ని బూతులు తిట్టిస్తున్నారంటూ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు.

జగన్ గట్టిగాచూస్తే చచ్చే వెధవలు; వార్డుమెంబర్ గా గెలవలేనోళ్ళు మహానాడు వేదికపై: కొడాలి నాని

బస్సు యాత్రకు ప్రజల నుండి స్పందన బాగా వస్తుంది

బస్సు యాత్రకు ప్రజల నుండి స్పందన బాగా వస్తుంది


అర్హత లేని వాళ్ళు ప్రశ్నించిన అంతమాత్రాన వ్యతిరేకత కాదని పేర్ని నాని పేర్కొన్నారు. మంత్రుల బస్సుయాత్ర మహానాడుకు పోటీ కాదని పేర్కొన్న పేర్నినాని షెడ్యూల్ ప్రకారం 2024 లోని వైసిపి ఎన్నికలకు వెళ్తుందని స్పష్టం చేశారు. సీఎం జగన్ ఎన్నికల ముందు చేపట్టిన పాదయాత్రకు ప్రజల నుంచి స్పందన ఎలా ఉందో, బస్సు యాత్రకు కూడా అదే విధంగా ప్రజల స్పందన ఉందని పేర్ని నాని వెల్లడించారు. గత ప్రభుత్వాల హయాంలో సామాజిక న్యాయం మాటల్లోనే ఉండేదని, చేతల్లో కనబడేది కాదు అని పేర్ని నాని పేర్కొన్నారు.

ప్రశ్నిస్తుంది అర్హత లేని వాళ్ళే

ప్రశ్నిస్తుంది అర్హత లేని వాళ్ళే


వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే సామాజిక న్యాయం కార్యరూపం దాల్చిందని, గడిచిన ఎన్నికల్లో 50 శాతం ఓట్లతో జగన్మోహన్ రెడ్డి గెలిచారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు 60 శాతానికి పైగా ఓట్లు వచ్చాయని పేర్ని నాని చెప్పారు. ఇక మిగతా 40 శాతం మంది వ్యతిరేకించిన వాళ్ల ఇళ్లకు వెళ్లినప్పుడు అర్హత లేకపోయినా ప్రశ్నిస్తున్నారు అంటూ పేర్ని నాని గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎదురవుతున్న వ్యతిరేకతపై మాట్లాడారు. ఆర్థిక స్థితిగతుల వల్ల ఉద్యోగులు అడిగినంత పిఆర్సి ఇవ్వలేక పోయినట్లుగా పేర్ని నాని తెలిపారు. జగన్ ఈ విషయంలో నిజాయితీగా ప్రవర్తించారని, ఉన్న విషయం చెప్పారని పేర్ని నాని పేర్కొన్నారు.

 మహానాడు పెట్టింది ఇందుకేనా ?

మహానాడు పెట్టింది ఇందుకేనా ?


టిడిపి మహానాడు కేవలం జగన్మోహన్ రెడ్డిని, వైసీపీ నేతలను తిట్టడం కోసమే పెట్టినట్టు ఉందని పేర్ని నాని ఎద్దేవా చేశారు. అసలు మహానాడు నిర్వహించే అధికారం చంద్రబాబు కుటుంబానికి లేదని పేర్ని నాని పేర్కొన్నారు. ఇక గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఫెయిల్ అయిందని టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు పేర్నినాని. అందువల్లనే బస్సుయాత్ర చేస్తున్నామని చెప్పడం కరెక్ట్ కాదు అంటూ వ్యాఖ్యానించారు.

గడపగడపకు మన ప్రభుత్వం నిరంతరాయంగా జరిగే ప్రక్రియ

గడపగడపకు మన ప్రభుత్వం నిరంతరాయంగా జరిగే ప్రక్రియ


గడపగడపకు మన ప్రభుత్వం నిరంతరాయంగా కొనసాగుతుందని, ఇది ఇప్పట్లో ఆగే ప్రక్రియ కాదని పేర్ని నాని పేర్కొన్నారు. గతంలో మంత్రిగా ఉన్నప్పుడు ఉత్సాహంగా ప్రతిపక్ష పార్టీల మీద దాడి చేసిన పేర్ని నాని మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో మంత్రి పదవి పోవడంతో అప్పటినుండి సైలెంట్ అయ్యారు. పెద్దగా పేర్ని నాని మాట్లాడుతున్న దాఖలాలు కనిపించడం లేదు. ఇక తాజాగా తెలుగుదేశం పార్టీ మహానాడు పై పేర్ని నాని స్పందించారు. టీడీపీ మహానాడు నిర్వహించే హక్కు చంద్రబాబుకు లేదన్నారు.

English summary
Former Minister Perni Nani slams chandrababu and mahanadu. Perni Nani questioned whether Mahanadu was set up to target Jagan and YCP ministers. is tdp conducting mahanadu or cabaret dance? Questioned.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X