చంద్రబాబు విజయ రహస్యం అదే- ఎమ్మెల్సీ పోరులో గెలుపుపై పేర్నినాని కామెంట్స్..
గుంటూరు : ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రబాబు వ్యవహరించిన తీరుపై వైసీపీ మాజీ మంత్రి పేర్నినాని ఇవాళ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు నంగనాచి కబుర్లు చెబుతున్నారని పేర్ని నాని విమర్శించారు. కొనటం, అమ్మడమే చంద్రబాబు విజయ రహస్యమని ధ్వజమెత్తారు. 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబు అంటేనే నయవంచన, నమ్మకద్రోహం, వెన్నుపోటు అని దుయ్యబట్టారు.
చంద్రబాబు చరిత్ర అంతా కొనుగోలు రాజకీయమేనని పేర్ని నాని మండిపడ్డారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచింది చంద్రబాబేనని గుర్తు చేశారు. ఓటుకు కోట్లు కేసులో దొరికిన చరిద్ర చంద్రబాబుది కాదా? హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చింది చంద్రబాబు కాదా? అని ప్రశ్నించారు. సీఎం జగన్ జానాన్ని నమ్ముకున్నారని చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసిన సీఎం జగన్ కి ధీటుగా ఎదుర్కుంటారని పేర్ని తెలిపారు. జగన్ ఏ ఒక్క కులాన్ని నమ్ముకోలేదని, జనాన్ని మాత్రమే నమ్ముకున్నారని ఉద్ఘటించారు. విలువలతో కూడిన రాజకీయాలు చేయటమే జగన్ కు తెలుసని అన్నారు

వైసీపీ నుంచి సస్పెండైన ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి స్వార్థ రాజకీయాలకు పాల్పడ్డారని పేర్నినాని విమర్శించారు. ఆమెని అవమానించారంటూ అసత్యాలు మాట్లాడుతున్నారని చెప్పారు. శ్రీదేవికి తాడికొండ నియోజకవర్గంలో ఆదరణ తగ్గిందని, ఆ విషయాన్ని పార్టీ అధ్యక్షుడు నేరుగా శ్రీదేవికి చెప్పారని పేర్ని వెల్లడించారు. టికెట్ దక్కదని భావించి వైసీపీకి నమ్మకద్రోహం చేశారని పేర్కొన్నారు. ఆనం రామానారాయణరెడ్డి కూడా ఇచ్చిన ప్యాటర్న్ లో ఓటు వేయలేదు అని పేర్ని తెలిపారు.












Click it and Unblock the Notifications