Perni Nani: టీడీపీ కంప్లైంట్ ఇస్తే చాలు...! పై నుంచి ఆదేశాలు..పేర్ని నాని ఆరోపణ..

ఏపీలో ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వీటిలో అధికార వైసీపీ నేతలపై దాడులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనిపై ఇవాళ ఈసీని కలిసి వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఉద్దేశపూర్వకంగా తమ నేతలపై దాడులు చేస్తున్న టీడీపీ.. ఆ తర్వాత ఈసీకి ఇస్తున్న ఫిర్యాదుల ఆధారంగా చర్యలు ఉంటున్నాయని మాజీ మంత్రి పేర్నినాని ఆరోపించారు.

టీడీపీ ఫిర్యాదు చేస్తే చాలు వైసీపీ నేతలపై చర్యలు తీసుకొంటున్నారని మాజీ మంత్రి పేర్నినాని ఆరోపించారు. పోలీసులను అడిగితే పై నుంచి తమకు ఒత్తిడి ఉంటుందని వారు చెప్తున్నారన్నారు. బందరు చూసినా, పెనమలూరు చూసినా టీడీపీ వాళ్లపై కేసులు పెట్టకపోయినా ఫర్వాలేదు వైసీపీ వారిపై ముందు కేసులు పెట్టమని చెప్తున్నారన్నారు. మా డీఎస్పీ ఊరుకోవడం లేదు, మా ఎస్పీ ఊరుకోవడం లేదంటున్నవారిని పేర్నినాని వెల్లడించారు.

perni nani slams ec for decisions according to tdp compliants

ఇప్పటికే రాష్ట్రంలో పలు చోట్ల వైసీపీ నేతలపై, ఎమ్మెల్యేలపై దాడులు పెరిగాయి. అలాగే టీడీపీ నేతలపై కేసులు పెట్టేందుకు పోలీసులు జంకుతున్నట్లు వైసీపీలో కింది స్థాయి నేతల నుంచి అగ్రనేతల వరకూ ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈసీ తీసుకుంటున్న నిర్ణయాలపై రాష్ట్రంలో చర్చ జరుగుతోంది. మరోవైపు రాష్ట్రంలో హింసను అరికట్టడంలో విఫలమయ్యారంటూ ఈసీ ఏకంగా సీఎస్, డీజీపీలకే ఇవాళ సమన్లు జారీ చేసింది. ఢిల్లీ వచ్చి వ్యక్తిగతంగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+