వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ ఆ విషయం తేల్చాలి - దత్తపుత్రుడు కాదంటాం : జగన్ కేసులపై బీజేపీ నేతలే : పేర్ని నాని ఫైర్..!!

|
Google Oneindia TeluguNews

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వం.. సీఎం జగన్ పైన చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. పవన్ పైన విరుచుకుపడ్డారు. పవన్ ముమ్మాటికీ దత్తపుత్రుడేనంటూ వ్యాఖ్యానించారు. కాదనుకుంటే వచ్చే ఎన్నికల్లో అదే విషయం స్పష్టం చేయాలని డిమాండ్ చేసారు. ఆ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తారా..లేదా అన్నది క్లారిటీ ఇవ్వాలని సూచించారు. రైతు కుటుంబాలకు సాయం పేరుతో పవన్‌ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. రైతులను ప్రభుత్వం ఆదుకోవడం లేదంటూ నిజాల పేరుతో పచ్చి అబద్ధాలు వల్లె వేస్తున్నారంటూ మండిపడ్డారు. గత ప్రభుత్వంలో ఏనాడూ రైతులను పట్టించుకోలేదని.. చంద్రబాబు రైతు రుణాలు మాఫీ చేయకపోయినా అడగలేదని పేర్ని నాని దుయ్యబట్టారు.

పవన్ ది అనైతిక రాజకీయం

పవన్ ది అనైతిక రాజకీయం

అప్పుడైనా, ఇప్పుడైనా ఎంతసేపూ జగన్‌ పైనే విమర్శలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. అదే పవన్‌కళ్యాణ్‌ గతి తప్పిన అనైతిక రాజకీయంగా అభివర్ణించారు. అప్పటి టీడీపీ ప్రభుత్వం కానీ, కేంద్రంలో ఉన్న బీజేపీ కానీ ఏవీ కూడా కౌలు రైతులను పట్టించుకోలేదు. ఇప్పటికీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, కౌలు రైతులకు ఏ విధంగానూ మేలు చేయడం లేదు. అయినా ఏనాడూ పవన్‌కళ్యాణ్, కేంద్రాన్ని నిలదీయడం లేదని ధ్వజమెత్తారు. కానీ, రైతులకు ఇన్ని రకాలుగా మేలు చేస్తున్న జగన్‌గారిపై మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారని ఫైర్ అయ్యారు.

పవన్ ఏం సాధించారు

పవన్ ఏం సాధించారు

ప్రధాని మోదీతో తనకు వ్యక్తిగతంగా విభేదాలు లేవని, రాష్ట్ర ప్రజల కోసమే ఆయనతో తగాదా పడ్డానని చెబుతున్న పవన్‌కళ్యాణ్, 2019 తర్వాత ఏం సాధించారని ప్రశ్నించారు. కనీసం ప్రత్యేక హోదా అయినా సాధించారా అంటూ నిలదీసారు. ఈ మూడేళ్లలో రాష్ట్రానికి ఏం సాధించారో చెప్పాలని డిమాండ్ చేసారు. సీబీఐ దత్తపుత్రుడు అంటున్నారని..జగన్‌ వ్యతిరేక ఓట్లు చీలకుండా అన్ని పార్టీలు కలవాలని అన్నారని గుర్తు చేసారు. ఆ విధంగా చంద్రబాబుకు మేలు చేయాలని పవన్‌కళ్యాణ్‌ ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు దత్తపుత్రుడు కాకపోతే, 2024లో ఎవరితో కలిసి ఎన్నికలకు వెళ్తాడో చూద్దామంటూ పేర్ని నాని వ్యాఖ్యానించారు. ఇప్పటం మీటింగ్‌లో చెప్పిన దానికి భిన్నంగా వెళ్తారేమో చూడాలని పేర్కొన్నారు.

పొత్తు లేకుండా పోటీ చేస్తే..

పొత్తు లేకుండా పోటీ చేస్తే..


ఇక, మరి జగన్‌ ను సీబీఐ దత్తపుత్రుడు అంటున్నారని... ఇదే జగన్‌ గురించి పార్లమెంటులో బీజేసీ సభ్యులు ఏమన్నారో చూడాలని సూచించారు. ఆయన కాంగ్రెస్‌లో ఉన్నంత కాలం మంచి.. బయటకు పోయాడు కాబట్టే, ఆయనపై కేసులు పెట్టారన్నారనే వ్యాఖ్యలను గుర్తు చేసారు. పవన్ కళ్యాణ్ 2024లో ఒంటరిగా ఎన్నికలకు పోతే, ఎవరితోనూ పొత్తు లేకుండా పోటీ చేస్తే, చంద్రబాబు దత్తపుత్రుడు కాదంటాము. నిజాయితీ, చిత్తశుద్ధి ఉంటే, కేంద్రంతో పోరాడి, వెంటనే కౌలు రైతుల కోసం చట్టం చేయించాలని పవన్ ను పేర్ని నాని డిమాండ్ చేసారు. దసరా పండగ తర్వాత చూపిస్తానంటున్నారని... గతంలో కూడా అలా చాలా పండగలు చెప్పారంటూనే... అవి వచ్చాయి... పోయాయి. కాబట్టి, మేము దేనికైనా సిద్ధంగా ఉన్నామని పేర్ని నాని స్పష్టం చేసారు.

English summary
Ex Minister Perni Nani fires on Janasena chief Pawan Kalyan comments in Prchuru, demaned for clairty on finght in up coming elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X