ఆంధ్రప్రదేశ్ అనిశ్చితిపై హైకోర్టులో పిటిషన్ దాఖలు
హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ అనిశ్చితిపై మంగళవారం హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసి వారం రోజులు గడుస్తునా ఇప్పటివరకు రాష్ట్ర గవర్నర్ నరసింహన్ రాజకీయపరంగా ఎటువంటి చర్యలు తీసుకోలేదని పిటిషనర్ తన పిటిషన్‌లో వ్యాఖ్యానించారు.
ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రంలో రాష్ట్రపతి పాల విధించాలని, లేని పక్షంలో వెంటనే ప్రభుత్వ ఏర్పాటు చేయాలని పిటీషన్‌లో ఆయన విజ్ఞప్తి చేశారు. క్రేంద్రప్రభుత్వంతో పాటు రాష్ట్ర గవర్నర్, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ, ప్రధాన ప్రతినేత, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడులను పిటిషనర్ ప్రతివాదులుగా చేర్చారు.

రాష్ట్ర విభజన నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవికి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పటి వరకు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందా, రాష్ట్రపతి పాలన విధిస్తారా అనేది తేలడం లేదు.
రాష్ట్ర పరిస్థితిపై గవర్నర్ నరసింహన్ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్లు తెలుస్తోంది. కాంగ్రెసుకు చెందిన సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత నేతలు కూడా కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే అడుగుతున్నారు. ఇంకా కొన్ని రోజులకు గానీ ఏం చేస్తారనేది తేలే పరిస్థితి లేదు.












Click it and Unblock the Notifications