కెసిఆర్ నోరు బ్రూమ్, ఫినాయిల్‌తో శుభ్రం (ఫొటోలు)
హైదరాబాద్: తెలంగాణ సకల జనుల భేరీలో ఆదివారంనాడు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీల నాయకుల నుంచి విమర్శలు ఎదరవుతున్నాయి. లంకలో పుట్టినోళ్లంతా రాక్షసులే, ఆంధ్రులంతా ద్రోహులే అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై సీమాంధ్రలో నిరసనలు వ్యక్తమయ్యారు.
కెసిఆర్ వ్యాఖ్యలకు నిరసనగా తిరుపతిలో సోమవారం వినూత్న పద్ధతిలో నిరసన వ్యక్తం చేశారు. కెసిఆర్ బొమ్మలతో పోస్టర్లు రూపొందించి నిరసన వ్యక్తం చేశారు. కెసిఆర్ నోటిని బ్రూమ్, ఫినాయిల్‌తో సమైక్యాంధ్ర ఆందోళనకారులు కడిగారు.
కెసిఆర్ వ్యాఖ్యలపై తెలుగుదేశం నాయకులు రేవంత్ రెడ్డి, నన్నపనేని రాజకుమారి మండిపడ్డారు. సీమాంధ్ర ఉద్యమం అలారం మోతలా ఎవరో కీ ఇస్తే తప్ప మోగదని కెసిఆర్ వ్యాఖ్యానించారు. కొరడాలతో కొట్టుకోవడం, కోడి ఈకలు కట్టుకోవడం, గడ్డి తినడం, సమాధుల మీద పడుకోవడం ఏం దిక్కుమాలిన ఉద్యమమని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో వాటిని సంకేతాలుగా తీసుకుని సమైక్యాంధ్ర జెఎసి ఆధ్వర్యంలో సోమవారం తిరుపతిలో నిరననలు వ్యక్తమయ్యాయి.

ఇలా కడిగేశారు..
కెసిఆర్ చిత్రపటాన్ని ప్రదర్శించి ఆయన నోటిని బ్రూమ్, ఫినాయిళ్లతో కడుగుతూ తమ నిరసనను వ్యక్తం చేశారు. ప్రతీకాత్మకంగా వారు ఈ పని చేశారు.

కల్లు తాగిన కోతి..
సింహంతో వేట ఆంధ్ర రాష్ట్రంతో ఆట వద్దు అంటూ కెసిఆర్‌ను హెచ్చరిస్తూ పోస్టర్లు వేలాడదీశారు. కెసిఆర్ చిత్రంపటం నోటిని చీపురుతో కడుగుతూ నిరసన వ్యక్తం చేశారు. కోదండరామ్‌పై కూడా నిరసన వ్యక్తం చేశారు. కల్లు తాగిన కోతికి ఏం తెలుసంటూ నినాదాలు రాశారు.

ఫినాయిల్ పోస్తూ ఇలా...
ఫినాయిల్ పోస్తూ చీపురుతో కడుగుతూ సమైక్యాంధ్ర ఉద్యమకారులు కెసిఆర్‌పై ఇలా తమ నిరనస వ్యక్తం చేశారు.

కోదండరామ్‌పై ఇదేం నోరు..
తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్‌పై కూడా సమైక్యాంధ్ర ఆందోళనకారులు నిరసన వ్యక్తం చేశారు. ఛీ - ఛీ ఇదేం నోరంటూ వెక్కిరించారు.

ఒంటి కాలి నిరసనలు..
రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సమైక్యాంధ్ర ఆందోళనకారులు ఒంటి కాలి ప్రదర్శన చేశారు. సమైక్యాంధ్ర కోసం నినాదాలు చేశారు.

కోడితో నిరసన
కోడి ఈకలు పీకడంలా సమైక్యాంధ్ర ఉద్యమం ఉందంటూ కెసిఆర్ చేసిన వ్యాఖ్యలపై తిరుపతి సమైక్యాంధ్ర జెఎసి ఆందోళనకారులు ఇలా నిరసన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications