ఆ నలుగురు నిద్రలోనే: గగన్‌పహాడ్ ప్రమాదం (పిక్చర్స్)
హైదరాబాద్: రాజధాని శివారు ప్రాంత గగన్‌పహాడ్ పారిశ్రామికవాడలోని ఓ రబ్బర్ కంపెనీలో జరిగిన ఘోర ప్రమాదంలో నలుగురు వ్యక్తులు సజీవ దహనమైన విషయం తెలిసిందే. రాత్రంతా పని చేసి అక్కడే సేదదీరిన ఆ నలుగురు వలస కార్మికులు అగ్నికి ఆహుతయ్యారు.
గురువారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో బాయిలర్ పైపు పేలి ఎగసిపడిన మంటల్లో వారు మృతి చెందారు. మృతులంతా బీహార్ రాష్ట్రానికి చెందిన వలస కూలీలే. వీరంతా కొంతకాలంగా శంషాబాద్ సమీపంలోని గగన్‌పహాడ్ పారిశ్రామిక వాడలో ఓ రబ్బర్ కంపెనీలో కూలీలుగా పని చేస్తున్నారు.
బుధవారం రాత్రంతా పనిచేసి అలసిన కార్మికులు కంపెనీలోనే ఉన్న గదిలో నిద్రపోయారు. ఆ గది పైనుంచి ఉన్న బాయిలర్ పైపు తెల్లవారుజామున ఐదు గంటల ప్రాంతంలో ఒక్కసారిగా పేలింది. అత్యంత శక్తివంతంగా ఎగిసిపడిన మంటల్లో నలుగురూ నిద్రలోనే సజీవ దహనమయ్యారు. సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, స్థానికులు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలికి చేరుకున్నారు.

ప్రమాదం 1
రాజధాని శివారు ప్రాంత గగన్‌పహాడ్ పారిశ్రామికవాడలోని ఓ రబ్బర్ కంపెనీలో జరిగిన ఘోర ప్రమాదంలో నలుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు.

ప్రమాదం 2
గగన్‌పహాడ్ పారిశ్రామికవాడలోని ఓ రబ్బర్ కంపెనీలో జరిగిన ఘోర ప్రమాదం జరగడంతో మంటలను ఆర్పేందుకు ఫైరింజన్లను రప్పించారు.

ప్రమాదం 3
కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల జరిగిన ప్రమాదంలో అమాయక కార్మికులు చనిపోయారని ఆరోపిస్తూ మృతుల బంధువులు, పలు కార్మిక సంఘాల నాయకులు కంపెనీ ఎదుట ఆందోళనకు దిగారు.

ప్రమాదం 4
మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 25 లక్షల పరిహారం అందించి ఆదుకోవాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. వీరి ఆందోళనలతో కంపెనీ వద్ద కొద్దిసేపు ఉద్రిక్తత ఏర్పడింది.

ప్రమాదం 5
యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. ఇలాంటి ఘటనలు మళ్లీ జరక్కుండా ప్రభుత్వ యంత్రాంగం కనీస వసతులు కల్పించని కంపెనీలను సీజ్ చేయాలని డిమాండ్ చేశాయి.

ప్రమాదం 6
ఇలా ఉండగా మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా అందిస్తామని కంపెనీ యజమాని కైలాష్ ప్రకటించారు.

ప్రమాదం 7
మృతుల కుటుంబ సభ్యులు, తోటి కార్మికుల రోదనలతో కంపెనీ ప్రాంగణం శోకసంద్రంగా మారింది. మంటల్లో మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా పూర్తిగా కాలిపోయాయి.

ప్రమాదం 8
మృతదేహాలను నగరంలోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఉస్మానియా వైద్యులు డిఎన్‌ఎ పరీక్షలు నిర్వహించి మృతులను గుర్తించారు.

ప్రమాదం 9
మృతదేహాలను నగరంలోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఉస్మానియా వైద్యులు డిఎన్‌ఎ పరీక్షలు నిర్వహించి మృతులను గుర్తించారు.

ప్రమాదం 10
మృతదేహాలను నగరంలోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఉస్మానియా వైద్యులు డిఎన్‌ఎ పరీక్షలు నిర్వహించి మృతులను గుర్తించారు.

ప్రమాదం 11
రాజధాని శివారు ప్రాంత గగన్‌పహాడ్ పారిశ్రామికవాడలోని ఓ రబ్బర్ కంపెనీలో జరిగిన ఘోర ప్రమాదంలో నలుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. రాత్రంతా పని చేసి అక్కడే సేదదీరిన ఆ నలుగురు వలస కార్మికులు అగ్నికి ఆహుతయ్యారు.

ప్రమాదం 12
మృతుల కుటుంబ సభ్యులు, తోటి కార్మికుల రోదనలతో కంపెనీ ప్రాంగణం శోకసంద్రంగా మారింది. మంటల్లో మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా పూర్తిగా కాలిపోయాయి.












Click it and Unblock the Notifications