కేజ్రీవాల్ పార్టీ రచ్చ, నో చెప్పిన హీరో శివాజీ (పిక్చర్స్)
హైదరాబాద్: రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఎఎపి) అవిర్భావ సభలో జై తెలంగాణ, జై సమైక్యాంధ్ర నినాదాలు మిన్నంటాయి. కాశ్మీర్‌పై ఎఎపి నేత ప్రశాంత్ భూషణ్ వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళన చేసిన కొంతమంది యువకులను పోలీసులు అరెస్టు చేశారు. సినీ నటుడు శివాజీ, సీనియర్ పాత్రికేయుడు పొత్తూరి వెంకటేశ్వర రావు, ఎమ్మెల్సీ నాగేశ్వర్ తదితరులు మాట్లాడారు.
అయితే తమకు అవకాశం కల్పించలేదని, ఇదేం ఆమ్ ఆద్మీ అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం దోమల్‌గుడాలోని ఎవి కళాశాల ప్రాంగణంలో ఆమ్ ఆద్మీ రాష్ట్ర శాఖ ఆవిర్భావ సభ ఏర్పాటైంది. సభ ఆరంభం నుంచే గొడవ ప్రారంభమైంది.
ఢిల్లీ నుంచి పార్టీ తరఫున ప్రతినిధిగా ప్రశాంత్ భూషణ్ హాజరై తొలి పలుకుల్లోనే తెలంగాణకు అనుకూలమని చెప్పడంతో, సభికుల్లో కొంతమంది జై సమైక్యాంధ్ర నినాదాలు ప్రారంభించారు. దీంతో మరి కొందరు జై తెలంగాణ అంటూ నినాదాలకు దిగారు. పరిస్థితి చేయి దాటుతుందని గమనించిన నిర్వాహకులు వారికి నచ్చజెప్పారు.

ఎఎపి
కేంద్ర మాజీ మంత్రి నరేంద్ర తనయుడు ఆలె జితేంద్ర నాయకత్వంలో బిజెవైఎం కార్యకర్తలు కొందరు ప్రశాంత్ భూషణ్ ప్రసంగానికి అడ్డుపడుతూ వందేమాతరం నినాదాలు చేశారు.

ఎఎపి
కాశ్మీర్‌లో రెఫరెండం నిర్వహించాలంటూ ప్రశాంత్ భూషణ్ చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకుని, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు సుమారు 20మందిని అరెస్టు చేశారు.

ఎఎపి
ఇలా ఉండగా సభ ముగిసిన తర్వాత కూడా కొంతమంది ఆమ్ ఆద్మీ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు అవకాశం ఎందుకు కల్పించలేదని నిలదీశారు.

ఎఎపి
ఇలా ఉండగా ప్రశాంత్ భూషణ్ ప్రసంగిస్తూ ఢిల్లీ తరహాలో రాష్ట్రంలోనూ విప్లవం సృష్టించాలని కోరారు. ఆమ్ ఆద్మీని అన్ని జిల్లాలకూ విస్తరించనున్నట్టు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ అన్ని స్థానాలకూ పోటీ చేస్తుందని చెప్పారు.

ఎఎపి
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశం అభివృద్ధి చెందిందని, స్థూల జాతీయ ఆదాయం పెరిగిందని ప్రధాని మన్మోహన్ చేసిన వ్యాఖ్యలను ఎద్దేవా చేశారు.

ఎఎపి
తాము అధికారంలోకి వస్తే అవినీతిని నిర్మూలిస్తామని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ చెబుతున్నారని, సొంత మంత్రివర్గంలోనే అవినీతి మంత్రులు ఉన్నారని విమర్శించారు.

ఎఎపి
టాలీవుడ్ ప్రముఖ నటుడు శివాజీ మాట్లాడుతూ తాను రాజకీయాల్లోకి రానని స్పష్టం చేశారు. తాను కేవలం చూడటానికే వచ్చానని తెలిపారు.

ఎఎపి
ఎమ్మెల్సీ నాగేశ్వర్ మాట్లాడుతూ ప్రజలు ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. రిటైల్ రంగంలో విదేశీ పెట్టుబడులను నిరోధిస్తామని ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ చెప్పడాన్ని అభినందించారు.

ఎఎపి
రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఎఎపి) అవిర్భావ సభలో జై తెలంగాణ, జై సమైక్యాంధ్ర నినాదాలు మిన్నంటాయి. కాశ్మీర్‌పై ఎఎపి నేత ప్రశాంత్ భూషణ్ వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళన చేసిన కొంతమంది యువకులను పోలీసులు అరెస్టు చేశారు.

ఎఎపి
తమకు అవకాశం కల్పించలేదని, ఇదేం ఆమ్ ఆద్మీ అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం దోమల్‌గుడాలోని ఎవి కళాశాల ప్రాంగణంలో ఆమ్ ఆద్మీ రాష్ట్ర శాఖ ఆవిర్భావ సభ ఏర్పాటైంది. సభ ఆరంభం నుంచే గొడవ ప్రారంభమైంది.












Click it and Unblock the Notifications