నన్నపనేనితో గౌడ్.. క్లిక్ క్లిక్, కిరణ్ పులి 'పిల్ల' (పిక్చర్స్)

హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లు ప్రవేశ పెట్టినప్పటి నుండి హాట్ హాట్‌గా కనిపించిన అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. గురువారం ఉదయం ఒకసారి వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన సభలో ఇరు ప్రాంతాల ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు.

తెలంగాణ, సమైక్య నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. దీంతో సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్ నాదెండ్ల మనోహర్ సభను నిరవధికంగా వాయిదా వేశారు. అసెంబ్లీ నిరసవధిక వాయిదాపై తెరాస, బిజెపి, టిటిడిపి నేతలు ఆందోళనకు దిగారు. అసెంబ్లీని ఏకపక్షంగా వాయిదా వేశారని సభలోనే ఉండి నిరసన వ్యక్తం చేయగా, తెలంగాణ టిడిపి నేతలు పోడియం వద్ద బైఠాయించి ఆందోళనకు దిగారు.

కాగా, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యవాదంపై పైకి పులిలా ఉంటూ సోనియా గాంధీ ముందు పిల్లిలా మారిపోతున్నారంటూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కార్టూన్ ప్రదర్శించారు. మరోవైపు రెండు రోజుల క్రితం తోపులాటలో కిందపడిన నన్నపనేని రాజకుమారి, అందుకు కారకులైన స్వామిగౌడ్‌లు ఈ రోజు చక్కగా మాట్లాడుకున్నారు.

కిరణ్

కిరణ్

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తిరుపతి శాసన సభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి గురువారం అసెంబ్లీ మీడియా పాయింటు వద్ద కార్డున్లు ప్రదర్శించారు. ముఖ్యమంత్రిని పులిగా చూపిస్తూ కార్టూన్.

నల్లదుస్తులతో వైయస్సార్ కాంగ్రెసు

నల్లదుస్తులతో వైయస్సార్ కాంగ్రెసు

తెలంగాణ ముసాయిదా బిల్లును అసెంబ్లీలో పెట్టడాన్ని నిరసిస్తూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసన సభ్యులు నలుపు దుస్తులతో వచ్చి నిరసన తెలిపారు.

నల్ల దుస్తులతో...

నల్ల దుస్తులతో...

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తిరుపతి శాసన సభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి గురువారం అసెంబ్లీ మీడియా పాయింటు వద్ద కార్డున్లు ప్రదర్శించారు. కార్టూన్ ప్రదర్శిస్తున్న శాసన సభ్యులు.

స్వామి గౌడ్

స్వామి గౌడ్

శాసన మండలి మీడియా పాయింటు వద్ద మాట్లాడుతున్న తెలంగాణ రాష్ట్ర సమితి కౌన్సిల్ సభ్యులు స్వామి గౌడ్, సుధాకర్ రెడ్డి తదితరులు.

యాదవ రెడ్డి

యాదవ రెడ్డి

శాసన మండలి మీడియా పాయింటు వద్ద మాట్లాడుతున్న తెలంగాణ ప్రాంత కాంగ్రెసు శాసన సభ్యుడు యాదవ రెడ్డి, బీహార్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు చూపిస్తున్న దృశ్యం.

దానం నాగేందర్

దానం నాగేందర్

శాసన మండలి వద్ద కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్, శాసన మండలి సభ్యులు షబ్బీర్ అలీల దృశ్యం. ఎమ్మెల్సీతో చేయి కలుపుతున్న దానం.

శ్రీధర్ బాబు

శ్రీధర్ బాబు

శాసన మండలి వద్ద పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పార్టీకి చెందిన నేతతో చేతులు కలుపుతున్న దృశ్యం. పక్కన తెరాస ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి తదితరులు.

నన్నపనేని

నన్నపనేని

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి, తెరాస ఎమ్మెల్సీ స్వామి గౌడ్‌లు మాట్లాడుకుంటున్న దృశ్యాన్ని క్లిక్ మనిపిస్తున్న ఓ ఫోటోగ్రాఫర్. రెండు రోజుల క్రితం తెరాస, టిడిపి నేతల తోపులాటలో నన్నపనేని పడిపోగా, స్వామి గౌడ్ క్షమాపణ చెప్పిన విషయం తెలిసిందే.

కిరణ్

కిరణ్

శాసనమండలిలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గురువారం తెలంగాణ ముసాయిదా బిల్లు పైన మాట్లాడారు. అనంతరం బయటకు వస్తున్న దృశ్యం.

నన్నపనేని, షబ్బీర్

నన్నపనేని, షబ్బీర్

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి, తెలంగాణ ప్రాంత కాంగ్రెసు శాసన మండలి సభ్యులు షబ్బీర్ అలీలు ముచ్చటిస్తున్న దృశ్యం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+