మూడేళ్లలో తొలి దశ: రాజధానిపై టార్గెట్(పిక్చర్స్)
హైదరాబాద్: విజయవాడ పరిసరాల్లోనే రాజధాని అని ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి కాల ప్రణాళికను కూడా నిర్దేశించుకుంది. మూడేళ్లలోనే రాజధాని మొదటి దశ పనులు పూర్తి చేయాలని నిర్ణయించుకుంది.
అంతేకాదు ఈ లోపుగానే హైదరాబాద్‌లోని కొన్ని శాఖాధిపతుల కార్యాలయాలను తరలించడంపైనా దృష్టి సారించింది. దీనిపై ఉన్నతస్థాయి కమిటీని నియమించింది.
గాంధీనగర్, చండీగఢ్, నయా రాయపూర్‌లలో పర్యటించి వచ్చిన రాష్ట్ర రాజధాని సలహా కమిటీ శనివారం సచివాలయంలో సమావేశమైంది. అనంతరం రాజధాని సలహా కమిటీ సభ్యుడు, మంత్రి నారాయణ విలేకరులతో మాట్లాడారు.

నారాయణ
మూడేళ్లలో రాజధాని మొదటి దశ నిర్మాణం పూర్తి చేస్తామని, ఇందులో భాగంగా సచివాలయం, రాజ్‌భవన్, అసెంబ్లీ, ప్రధాన కార్యాలయాలు నిర్మిస్తామని మంత్రి నారాయణ తెలిపారు.

నారాయణ
ఇబ్రహీంపట్నం, గుంటూరు, తెనాలి, గన్నవరం కలుపుతూ 6 లక్షల ఎకరాల చుట్టూ రింగు రోడ్డు నిర్మించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు యోచిస్తున్నారన్నారని, రాజధాని నిర్మాణంలో అనేక అంశాలు ముడిపడి ఉన్నందున ఒక ప్రత్యేక అథారిటీ ఏర్పాటు అవసరముందని తెలిపారు.

నారాయణ
తమ కమిటీ కమిటీ దేశంలోని కొత్త రాజధానులు సందర్శించిందని, త్వరలో సింగపూర్, మలేసియా, చైనా దేశాల రాజధానులలోనూ పర్యటించి అధ్యయనం చేస్తామని తెలిపారు.

నారాయణ
ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి అన్ని విధాలుగా సహకరిస్తామని సింగపూర్ ప్రభుత్వం అధికారికంగా తెలిపిందని నారాయణ గుర్తు చేశారు.

నారాయణ
విజయవాడ పరిసరాల్లో ఎక్కడ రాజధానికి అనుకూలంగా ఉంటుందో పరిశీలించాలని కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లను ఆదేశించామని మంత్రి నారాయణ తెలిపారు.

నారాయణ
తాము సందర్శించిన మూడు కొత్త రాజధాని నగరాల్లో నిర్మాణాలు కనీసం 5 వేల హెక్టార్లలో నిర్మించారని నారాయణ తెలిపారు.

నారాయణ
ఇందులో ల్యాండ్ పూలింగ్ ద్వారా నిర్మించిన చండీగఢ్ అద్భుతంగా ఉందన్నారు. నయా రాయ్‌పూర్ గత మూడేళ్లలోనే అభివృద్ధి చెందిందన్నారు. ఆ రాష్ట్రంలో రాజధాని నిర్మాణానికి రైతులు బాగా సహకరించారని తెలిపారు.

నారాయణ
రాజధాని నిర్మించి భూములు అభివృద్ధి చేసిన తర్వాత చండీగఢ్ ప్రభుత్వం రైతులకు 27.5 శాతం భూములను తిరిగి ఇచ్చిందని, ప్రభుత్వ భూమి అందుబాటులో లేకపోవడంతో ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారానే గాంధీనగర్‌లోనూ, నయా రాయ్‌పూర్‌లోనూ రాజధానులు నిర్మించారని, గాంధీనగర్‌లో 35 శాతం, నయా రాయ్‌పూర్‌లో 40 శాతం అభివృద్ధి చేసిన భూమిని రైతులకు అప్పగించారని, రాజధాని నిర్మాణంలో రైతులను భాగస్వామ్యం చేసేందుకు మేము కూడా చర్యలు ప్రారంభించామని, రాజధానిలో మంచి సామాజిక జీవనం ఉండేలా చర్యలు తీసుకుంటామని, రాజధానిలో విద్య, వైద్య ఆరోగ్య వసతులు ఉండాలని, కాలుష్యం లేని పరిశ్రమలు ఏర్పాటు కావాలని నారాయణ తెలిపారు.

నారాయణ
నవ్యాంధ్ర ప్రదేశ్ రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇస్తుందని మంత్రి నారాయణ తెలిపారు. ఇప్పటిదాకా విభజన జరిగిన రాష్ట్రాలన్నీ... తాము కోరుకుని విడిపోయాయని, అందువల్లే, వాటికి కేంద్రం నిధులివ్వలేదని, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి వేరని, రాజధానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుందన్నారు.












Click it and Unblock the Notifications