గెలుపెవరిది?: నవ్వితే చూశారు, స్వీటిచ్చారు (పిక్చర్స్)

హైదరాబాద్: అసెంబ్లీలో గురువారం నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. బిల్లును తిప్పి పంపాలంటూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చిన నోటీసుపై అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అనంతరం సభ నిరవధికంగా వాయిదా పడింది. అయితే, విభజన బిల్లుపై తాము గెలిచామంటే తాము గెలిచామని సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత నేతలు చెబుతున్నారు. బిల్లును రాష్ట్రపతికి పంపించగలిగామని, అసెంబ్లీ అభిప్రాయంతో సంబంధం ఉండదని టి నేతలు చెబుతుండగా, బిల్లును సమర్థవంతంగా తిరస్కరించి రాష్ట్రపతికి పంపించగలిగామని, ఇది పార్లమెంటులో పెట్టే అవకాశం ఉండదని సీమాంధ్ర నాయకులు స్వీట్స్ పంచుకుంటున్నారు.

గురువారం ఉదయం రెండుసార్లు వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన సభలో సిఎం తీర్మానాన్ని సభాపతి సభలో ప్రవేశ పెట్టారు. సభ్యుల నిరసనల మధ్యే మూజువాణి ఓటింగ్‌తో సిఎం ఇచ్చిన నోటీసును అసెంబ్లీ ఆమోదించింది.

బిల్లుపై చర్చ ముగిసిందని స్పీకర్ సభలో ప్రకటించారు. బిల్లుపై 86 మంది సభ్యులు తమ అభిప్రాయాలను తెలిపారని, బిల్లుపై క్లాజుల వారీగా 9,072 సవరణలు వచ్చాయని తెలిపారు. బిఏసిలో నిర్ణయించిన ప్రకారం సవరణలను సభ అభిప్రాయంగా పరిగణిస్తూ రాష్ట్రపతికి నివేదిస్తామనా స్పీకర్ తెలియజేశారు. అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

హలో.. ఏం జరిగింది?

హలో.. ఏం జరిగింది?

గురువారం తెలంగాణ ముసాయిదా బిల్లు పైన చర్చ చివరి రోజు కావడంతో నేతలు అందరూ బిజీగా మారిపోయారు. మంత్రులు కన్నా లక్ష్మీ నారాయణ, రఘువీరా రెడ్డిలు ఫోన్లో మాట్లాడుతూండగా, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ ఆసక్తిగా చూస్తున్న దృశ్యం.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ

గురువారం ఉదయం శాసన సభ ప్రారంభానికి ముందు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలు తెలుగు తల్లి విగ్రహం నుండి ర్యాలీగా అసెంబ్లీకి వచ్చారు.

భద్రత

భద్రత

తెలంగాణ ముసాయిదా బిల్లు పైన చర్చకు గురువారం చివరి రోజు కావడంతో అనుకోని సంఘటనలు జరగకుండా ముందస్తుగా అసెంబ్లీ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

సీమాంధ్ర టిడిపి

సీమాంధ్ర టిడిపి

అసెంబ్లీలోని మీడియా పాయింటు వద్ద సీమాంధ్ర తెలుగుదేశం పార్టీ సభ్యులు జై తెలంగాణ నినాదాలు చేస్తున్న దృశ్యం. పయ్యావుల కేశవ్ విలేకరులతో మాట్లాడారు.

మేం గెలిచాం

మేం గెలిచాం

తెలంగాణ ముసాయిదా బిల్లును శాసన సభ, శాసన మండలిలో ఓడించి తిప్పి పంపించడం ద్వారా తాము గెలిచామని సీమాంధ్ర టిడిపి నేతల విజయ సంకేతం.

విక్టరీ

విక్టరీ

తెలంగాణ ముసాయిదా బిల్లును శాసన సభ, శాసన మండలిలో ఓడించి తిప్పి పంపించడం ద్వారా తాము గెలిచామని సీమాంధ్ర టిడిపి నేతల విక్టరీ సంకేతం.

జయప్రకాశ్ నారాయణ

జయప్రకాశ్ నారాయణ

అసెంబ్లీ ప్రాంగణంలో లోక్‌సత్తా పార్టీ అధ్యక్షులు, కూకట్‌పల్లి శాసన సభ్యులు జయప్రకాశ్ నారాయణ. అసెంబ్లీలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

కెటిఆర్

కెటిఆర్

అసెంబ్లీ ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్ర సమితి సిరిసిల్ల శాసన సభ్యులు కల్వకుంట్ల తారక రామారావు. అసెంబ్లీలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

తెరాస

తెరాస

అసెంబ్లీలోని మీడియా పాయింటు వద్ద తెలంగాణ రాష్ట్ర సమితి శాసన సభ్యులు కల్వకుంట్ల తారక రామారావు, రాజయ్య తదితరులు మాట్లాడుతున్న దృశ్యం.

హరీష్ రావు

హరీష్ రావు

అసెంబ్లీ ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్ర సమితి సిద్దిపేట శాసన సభ్యులు హరీష్ రావు ఎవరి కోసమో ఎదురు చూస్తున్న దృశ్యం. అసెంబ్లీలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

నేతలు

నేతలు

అసెంబ్లీ ప్రాంగణంలో సీమాంధ్ర మంత్రి టిజి వెంకటేష్, తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణ రెడ్డి తెలుగుదేశం పార్టీ నేతలతో మాట్లాడుతూ...

టిజి వెంకటేష్

టిజి వెంకటేష్

అసెంబ్లీ ప్రాంగణంలో పార్టీలకతీతంగా, ప్రాంతాలకతీతంగా సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత నేతలు మాట్లాడుకుంటున్న దృశ్యం. మంత్రి టిజి వెంకటేష్, ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణ రెడ్డి ఇతరుల ముచ్చట్లు...

చలోక్తులు

చలోక్తులు

అసెంబ్లీ ప్రాంగణంలో పార్టీలకతీతంగా, ప్రాంతాలకతీతంగా సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత నేతలు మాట్లాడుకుంటున్న దృశ్యం. దేవినేని ఇతర నేతలతో కలిసి నవ్వుతుండగా.. వెనుక పయచ్యావుల, దూళిపాళ్లలు చూస్తున్న దృశ్యం.

ఆనం

ఆనం

తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతల ఎదుట చేతులు కట్టుకొని నిలబడిన సీమాంద్ర ప్రాంత శాసన సభ్యులు ఆనం వివేకానంద రెడ్డి దృశ్యం.

ఆనం

ఆనం

తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతల ఎదుట చేతులు కట్టుకొని నిలబడిన అనంతరం వారికి నమస్కరిస్తున్న సీమాంద్ర ప్రాంత శాసన సభ్యులు ఆనం వివేకానంద రెడ్డి దృశ్యం.

స్వీటు

స్వీటు

తెలంగాణ ముసాయిదా బిల్లును రాష్ట్రపతికి పంపడంలో సఫలీకృతులమయ్యామని తెలంగాణ కాంగ్రెసు పార్టీ నేత, మంత్రి పొన్నాల లక్ష్మయ్య మహిళా మంత్రులకు స్వీటు తినిపిస్తూ...

శ్రీధర్, ఆనం

శ్రీధర్, ఆనం

గురువారం అసెంబ్లీ ప్రాంగణంలో తెలంగాణ ప్రాంత మంత్రి శ్రీధర్ బాబు, సీమాంధ్ర ప్రాంత కాంగ్రెసు ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డిల దృశ్యం.

టి కాంగ్రెసు

టి కాంగ్రెసు

తెలంగాణ ముసాయిదా బిల్లును రాష్ట్రపతికి పంపడంలో సఫలీకృతులమయ్యామని తెలంగాణ కాంగ్రెసు పార్టీ నేతలు మిఠాయిలు పంచుకున్నారు.

మేం గెలిచాం

మేం గెలిచాం

తెలంగాణ ముసాయిదా బిల్లును రాష్ట్రపతికి పంపడంలో సఫలీకృతులమయ్యామని తెలంగాణ కాంగ్రెసు పార్టీ నేతలు సంబరాలు చేసుకున్నారు.

టిటిడిపి

టిటిడిపి

తెలంగాణ ముసాయిదా బిల్లును రాష్ట్రపతికి పంపడంలో సఫలీకృతులమయ్యామని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు మిఠాయులు పంచుకుంటున్న దృశ్యం.

టిటిడిపి

టిటిడిపి

తెలంగాణ ముసాయిదా బిల్లును రాష్ట్రపతికి పంపడంలో సఫలీకృతులమయ్యామని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు మిఠాయులు పంచుకుంటున్న దృశ్యం. ఉమా మాధవ రెడ్డికి మిఠాయి తినిపిస్తున్న సీతక్క.

సీమాంధ్ర టిడిపి

సీమాంధ్ర టిడిపి

తెలంగాణ ముసాయిదా బిల్లును శాసన సభలో, శాసన మండలిలో ఓడించామని సంబరాలు చేసుకుంటున్న సీమాంధ్ర తెలుగుదేశం పార్టీ నేతలు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+