వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డోలు కొట్టి గర్ల్ హంగామా, తల్లికి కవిత హెల్ప్ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ విశిష్ట సంస్కృతిని చాటుతూ శనివారం సాయంత్రం సద్దుల బతుకమ్మ సందడి చేసింది. తెలంగాణవ్యాప్తంగా లక్షలాది మంది మహిళలు అందమైన బతుకమ్మలతో ఊరి బయటకు, చెరువు గట్లకు తరలివచ్చి సద్దుల బతుకమ్మను మనసారా కొలిచారు.

తొమ్మిది రోజుల పాటు ఆనందంగా సాగిన బతుకమ్మ పర్వం, సద్దుల బతుకమ్మ సంబరంతో ఘనంగా ముగిసింది. ఉదయం నుండి బతుకమ్మను పేర్చడం నుండి మొదలైన కోలాహలం కొన్ని ప్రాంతాలలో రాత్రి పదకొండు గంటల వరకు ఆడుతూ సాగింది. ముత్తయిదువుల ముచ్చట్లు, పరికిణీల పలకరింతలు, చిన్నారుల కేరింతల నడుమ సద్దుల సంబరం కన్నులపండువ చేసింది.

జిల్లాల్లోని ప్రధాన పట్టణాల రహదారులన్నీ సప్తవర్ణ శోభిత దృశ్యాలతో జిగేల్‌మన్నాయి. లక్షలాది చేతుల చప్పట్లు, వేలాది గొంతుకల గానం, కోట్లాది హృదయ లయలు, సంధ్యాకాంతులు, కొత్త వాతావరణాన్ని ఆవిష్కరించాయి. మహిళల మనసుల్లో పెల్లుబికిన భావాలు బతుకమ్మ పాటలై ప్రవహించాయి.

బతుకమ్మ 1

బతుకమ్మ 1

తెలంగాణ విశిష్ట సంస్కృతిని చాటుతూ శనివారం సాయంత్రం సద్దుల బతుకమ్మ సందడి చేసింది. వేలాదిమంది మహిళలు అందమైన బతుకమ్మలతో చెరువు గట్లకు తరలివచ్చి సద్దుల బతుకమ్మను మనసారా కొలిచారు.

బతుకమ్మ 2

బతుకమ్మ 2

తెలంగాణవ్యాప్తంగా తొమ్మిది రోజుల పాటు ఆనందంగా సాగిన బతుకమ్మ పర్వం, సద్దుల బతుకమ్మ సంబరంతో ఘనంగా ముగిసింది.

బతుకమ్మ 3

బతుకమ్మ 3

మహిళలు అందంగా అలంకరించుకొని, లయబద్ధంగా అడుగులు వేస్తూ చప్పట్లు కొడుతూ భూ తల్లిని కీర్తించారు. ముత్తయిదువుల ముచ్చట్లు, పరికిణీల పలకరింతలు, చిన్నారుల కేరింతల నడుమ సద్దుల సంబరం కన్నులపండువ చేసింది.

బతుకమ్మ 4

బతుకమ్మ 4

వరంగల్‌లోని భద్రకాళి, పోతననగర్, రంగలీల మైదానంతోపాటు హన్మకొండలోని పద్మాక్షి ఆలయ పరిసరాలు వేలాది మంది మహిళలతో కిక్కిరిసిపోయాయి. వేడుకలో పాల్గొనేందుకు సాయంత్రం 5 గంటల నుంచే మహిళల రాక మొదలైంది.

బతుకమ్మ 5

బతుకమ్మ 5

నగరంలో రహదారులన్నీ సప్తవర్ణ శోభిత దృశ్యాలతో జిగేల్‌మన్నాయి. లక్షలాది చేతుల చప్పట్లు, వేలాది గొంతుకల గానం, కోట్లాది హృదయ లయలు, సంధ్యాకాంతులు, కొత్త వాతావరణాన్ని ఆవిష్కరించాయి.

బతుకమ్మ 6

బతుకమ్మ 6

సాయంత్రం నాలుగు గంటలకు ముందే బతుకమ్మలతో మహిళలు బయలుదేరారు. ఎంతో ఇష్టంతో పేర్చిన బతుకమ్మలను కార్లలో, ఆటోలలో, సైకిల్‌పై, ఖిలా వరంగల్ ప్రాంతం లో అయితే ఎడ్లబండ్లపై కూడా తీసుకొచ్చారు.

బతుకమ్మ 7

బతుకమ్మ 7

హన్మకొండలోని పద్మాక్షి ఆలయ ప్రాంగణంలో జిల్లా సాంస్కృతిక మండలి ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో వేలాది మంది మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

బతుకమ్మ 8

బతుకమ్మ 8

బంగారు బతుకమ్మ పేరుతో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో వారం రోజులుగా నిర్వహిస్తున్న బతుకమ్మ ఉత్సవాలు శనివారంతో ముగిశాయి.

బతుకమ్మ 9

బతుకమ్మ 9

వేలాది మంది మహిళలు హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్ద తమ ఆటపాటలతో సందడి చేశారు. తమ బతుకమ్మలతో తెలుగుతల్లి ఫ్లైఓవర్ వరకు ర్యాలీగా వచ్చారు.

బతుకమ్మ 10

బతుకమ్మ 10

బతుకమ్మ సంబరాలను వీక్షిస్తున్న మంత్రి దానం నాగేందర్, సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యులు అంజన్ కుమార్ యాదవ్ తదితరులు.

బతుకమ్మ 11

బతుకమ్మ 11

నెక్లెస్ రోడ్డులో జరిగిన బతుకమ్మ వేడుకలలో కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్, ఆయన సతీమణి, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

బతుకమ్మ 12

బతుకమ్మ 12

హైదరాబాదులోని నెక్లెస్ రోడ్డులో జరిగిన బతుకమ్మ వేడుకలకు ఇద్దరు అమ్మాయిలు డోలు వాయిస్తూ వస్తున్న దృశ్యం. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి.

బతుకమ్మ 13

బతుకమ్మ 13

నగరంలో రహదారులన్నీ సప్తవర్ణ శోభిత దృశ్యాలతో జిగేల్‌మన్నాయి. లక్షలాది చేతుల చప్పట్లు, వేలాది గొంతుకల గానం, కోట్లాది హృదయ లయలు, సంధ్యాకాంతులు, కొత్త వాతావరణాన్ని ఆవిష్కరించాయి.

బతుకమ్మ 14

బతుకమ్మ 14

"మా సంస్కృతిని గౌరవిస్తే.. మీ సంస్కృతిని ప్రేమిస్తాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా ఇక్కడ ఉండే ఆంధ్ర ప్రజలతో సోదరభావంతోనే ఉంటాం. కానీ సెక్రటేరియెట్‌లో చక్రం తిప్పాలనుకుంటే సహించం' అన్నారు కవిత.. సీమాంధ్ర నేతలను హెచ్చరించారు.

బతుకమ్మ 15

బతుకమ్మ 15

హన్మకొండలోని పద్మాక్షి ఆలయ ప్రాంగణంలో జిల్లా సాంస్కృతిక మండలి ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో వేలాది మంది మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

బతుకమ్మ 16

బతుకమ్మ 16

తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షురాలు విమలక్క హన్మకొండలోని పద్మాక్షి ఆలయ పరిసరాల్లో బతుకమ్మ వేడుకలకు రావడంతో మహిళలంతా ఉత్సాహంతో ఉరకలేశారు. విమలక్క మహిళలతో గళం కలుపుతూ బతుకమ్మ పాటలను పాడుతూ సందడి చేశారు.

బతుకమ్మ 17

బతుకమ్మ 17

తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్డులో నిర్వహించిన బంగారు బతుకమ్మల వేడుకలకు బతుకమ్మలతో వస్తున్న ముగ్గురు ముస్లిం మహిళలు.

బతుకమ్మ 18

బతుకమ్మ 18

మహబూబాబాద్‌లో ఎమ్మెల్యే కవిత, వరంగల్‌లో ఎంపీలు సుధారాణి, సిరిసిల్ల రాజయ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్, మాజీ కార్పొరేటర్ తోట వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

బతుకమ్మ 19

బతుకమ్మ 19

వరంగల్ నగరంలో శనివారం సద్దుల బతుకమ్మ పండుగ వైభవంగా జరిగింది. పూదోటల సమాహారాన్ని సద్దుల బతుకమ్మ తలపించింది.

బతుకమ్మ 20

బతుకమ్మ 20

తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్డులో నిర్వహించిన బంగారు బతుకమ్మల వేడుకలకు బతుకమ్మలతో వస్తున్న పలువురు లంబాడీ, ఇతర మహిళలు.

బతుకమ్మ 21

బతుకమ్మ 21

తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్డులో నిర్వహించిన బంగారు బతుకమ్మల వేడుకలకు బతుకమ్మతో వస్తున్న కల్వకుంట్ల కవిత.

బతుకమ్మ 22

బతుకమ్మ 22

మహిళలు ఒకచోట చేరి ఒకే గొంతుకతో సద్దుల బతుకమ్మను కీర్తిస్తూ వీడ్కోలు పలికారు. తంగేడు, గునుగు, చామంతి, సీతజడ, బంతి తదితర పూలతో బతుకమ్మను పేర్చి నగరంలోని చెరువులలో నిమజ్జనం చేశారు.

బతుకమ్మ 23

బతుకమ్మ 23

వరంగల్లోని భద్రకాళి ఆలయం, పద్మాక్షి దేవాలయం, వడ్డేపల్లి చెరువు తదితర ప్రాంతాలలో సద్దుల బతుకమ్మ ఆట ఆడి వీడ్కోలు పలికారు.

బతుకమ్మ 24

బతుకమ్మ 24

విద్యుత్ కాంతుల వెలుగులలో.. అందమైన బతుకమ్మలు ఒకచోట పేర్చి.. లయబద్ధంగా బతుకమ్మను కీర్తిస్తూ మహిళలు ఆడిన ఆటలు కనువిందు చేశాయి. సద్దుల బతుకమ్మ పర్వదినంతో ఓరుగల్లు నగరం కొత్తశోభను సంతరించుకుంది.

బతుకమ్మ 25

బతుకమ్మ 25

పోయిరావమ్మ మా తల్లి బతుకమ్మ.. అని వీడ్కోలు పలుకుతూ తమ మాంగల్యాలను కాపాడాలని మహిళలు భూతల్లిని వేడుకున్నారు.

బతుకమ్మ 26

బతుకమ్మ 26

పట్టుచీరల రెపరెపలతో మహిళలు తలపై బతుకమ్మలను పెట్టుకుని చెరువుల వద్దకు శోభాయాత్రలా కదిలారు. సద్దుల బతుకమ్మను అధికారికంగా నిర్వహించిన జిల్లా యంత్రాంగం బతుకమ్మ ఆట ఆడే వివిధ ప్రాంతాలలో విస్తృత ఏర్పాట్లు చేసింది.

బతుకమ్మ 27

బతుకమ్మ 27

ఎంతో ఇష్టంతో పేర్చిన బతుకమ్మలను కార్లలో, ఆటోలలో, సైకిల్‌పై, ఖిలా వరంగల్ ప్రాంతం లో అయితే ఎడ్లబండ్లపై కూడా తీసుకొచ్చారు.

బతుకమ్మ 28

బతుకమ్మ 28

అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సద్దుల బతుకమ్మ సందర్భంగా నగరంలో ట్రాఫిక్‌ను దారి మళ్లించారు.

బతుకమ్మ 29

బతుకమ్మ 29

మహానగరంలో శనివారం బతుకమ్మ వేడుకలు కనువిందు చేశాయి. హుస్సేన్‌సాగర్ పరిసర ప్రాంతాలకు సాయంత్రం నాలుగు గంటల నుంచే వేలాది సంఖ్యలో మహిళలు చేరుకుని బతుకమ్మపై రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చారు.

బతుకమ్మ 30

బతుకమ్మ 30

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు సతీమణి బతుకమ్మ పేర్చుతుండగా కూతురు కల్వకుంట్ల కవిత సహాయం చేస్తున్న దృశ్యం.

English summary
The Telangana region cultural festival of Bathukamma was celebrated with joy and gaiety by the people folk in the districts on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X