కేసీఆర్ వెళ్లే దార్లో డ్రైనేజీ! లాంతర్లతో బీజేపీ (పిక్చర్స్)
హైదరాబాద్: బంగారు తెలంగాణ లక్ష్యంగా బడ్జెట్‌ను రూపకల్పన చేశామని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. 2014-15 తొలి బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ బుధవారం సభలో ప్రవేశపెట్టారు. రూ.లక్షా 637 కోట్లతో ఈటెల తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ తెలంగాణ తొలి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు.
తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఇది పది నెలల బడ్జెట్ అని ఈటెల చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో అమరవీరుల త్యాగం మరిచిపోలేనిదని, బంగారు తెలంగాణే అమరవీరులకు ఘనమైన నివాళన్నారు.
దుష్టశక్తుల ఆటకట్టించే శక్తి తమకుందని వెల్లడించారు.
సమగ్ర సర్వేతో పథకాల అవకతవకలకు అడ్డుకట్ట వేశామన్నారు. 459 అమరవీరుల కుటుంబాలకు రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. వృద్ధిరేటు దారుణంగా పడిపోయిందని ఈటెల తెలిపారు. అన్ని వర్గాల అభివృద్ధికి పాటుపడతామని, ఎన్నికల్లో ఇచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తామని మంత్రి ఈటెల స్పష్టం చేశారు. కాగా, తెలంగాణ బడ్జెట్ సమావేశాలు నవంబర్ 22వ తేదీ వరకు జరగనున్నాయి.

తెరాస
బుధవారం నాడు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ తొలి సమావేశాలు జరిగాయి. ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశాలకు వస్తున్న తెరాస సభ్యులు.

ఈటెల
బుధవారం నాడు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ తొలి సమావేశాలు జరిగాయి. ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ బడ్జెట్ ప్రవేశ పెట్టిన అనంతరం విలేకరులతో మాట్లాడారు.

కాంగ్రెస్
బుధవారం నాడు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ తొలి సమావేశాలు జరిగాయి. ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ బడ్జెట్ ప్రవేశ పెట్టిన అనంతరం మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలు.

ఆర్ కృష్ణయ్య
బుధవారం నాడు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ తొలి సమావేశాలు జరిగాయి. ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ బడ్జెట్ ప్రవేశ పెట్టిన అనంతరం మాట్లాడుతున్న ఆర్ కృష్ణయ్య

టీడీపీ
బుధవారం నాడు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ తొలి సమావేశాలు జరిగాయి. ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ బడ్జెట్ ప్రవేశ పెట్టిన అనంతరం మాట్లాడుతున్న తెలంగాణ టీడీపీ నేతలు.

కేసీఆర్ కాన్వాయ్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బుధవారం నాడు అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. ఆ సమయంలో అసెంబ్లీ ముందు పొంగుతున్న డ్రెయినేజీ

కేసీఆర్ కాన్వాయ్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బుధవారం నాడు అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. ఆ సమయంలో అసెంబ్లీ ముందు పొంగుతున్న డ్రెయినేజీ

కేసీఆర్ కాన్వాయ్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బుధవారం నాడు అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. ఆ సమయంలో అసెంబ్లీ ముందు పొంగుతున్న డ్రెయినేజీ

బీజేపీ
బుధవారం నాడు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ తొలి సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాలకు హాజరవుతున్న బీజేపీ సభ్యులు. వారు కరెంట్ కోతలపై నిరసన వ్యక్తం చేస్తూ ర్యాలీ తీశారు.

కాంగ్రెస్
బుధవారం నాడు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ తొలి సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాలకు హాజరయ్యేందుకు వచ్చిన కాంగ్రెస్ సభ్యులు గన్ పార్క్ వద్ద నివాళులు అర్పించారు.

టీడీపీ
బుధవారం నాడు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ తొలి సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాలకు హాజరయ్యేందుకు వచ్చిన టీడీపీ సభ్యుల ర్యాలీ.

బీజేపీ
బుధవారం ప్రారంభం కానున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు లాంతర్లు చేతబట్టి ర్యాలీగా రావాలని ఆ పార్టీ ఎమ్మెల్యేలు నిన్న నిర్ణయించారు. అలాగే వచ్చారు.

తెరాస
బుధవారం నాడు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ తొలి సమావేశాలు జరిగాయి. ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశాలకు వచ్చిన తెరాస ఎమ్మెల్యేలు గన్ పార్క్ వద్ద నివాళులు అర్పించారు.

తెరాస
బుధవారం నాడు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ తొలి సమావేశాలు జరిగాయి. ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశాలకు వచ్చిన తెరాస ఎమ్మెల్యేలు గన్ పార్క్ వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా విలేకరులతో ఈటెల.

హరీష్ రావు
బుధవారం నాడు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ తొలి సమావేశాలు జరిగాయి. ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశాలకు వచ్చిన తెరాస ఎమ్మెల్యేలు గన్ పార్క్ వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా విలేకరులతో హరీష్ రావు.












Click it and Unblock the Notifications