బొత్స ఇంటిముందు టెక్కీ భార్య కన్నీరు, ఐనా(పిక్చర్స్)
హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగిన ఓల్వో బస్సు ప్రమాద మృతుల కుటుంబ సభ్యులు హైదరాబాదులోని మినిస్టర్స్ క్వార్టర్‌లో గల బొత్స సత్యనారాయణ ఇంటిని ముట్టడించడానికి శనివారం విఫలయత్నం చేసిన విషయం తెలిసిందే.
పాలెం బస్సు ప్రమాద మృతుల ప్రమాదం జరిగి నెల రోజులు గడుస్తున్నా మృతుల కుటుంబాలకు ఎలాంటి పరిహారం చెల్లించలేదని వారు నిప్పులు చెరిగారు. నిర్లక్ష్యంతో 45 మంది ప్రయాణీకుల మృతికి కారణమైన బస్సు యాజమాన్యంపై ఇంత వరకూ చర్యలు తీసుకోకపోవడం దారుణమని మండిపడ్డారు.
మృతుల కుటుంబ సభ్యులు భారీగా తరలి వచ్చి మంత్రి ఇంటిని ముట్టడికి విఫలయత్నం చేశారు. దీంతో మినిస్టర్స్ క్వార్టర్స్ వద్ద కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు, పోలీస్‌ల మధ్య తోపులాట జరిగింది.

బొత్స 1
బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ న్యాయం చేయమని మంత్రికి విన్నవించడానికి వస్తే మహిళలని కూడా చూడకుండా అరెస్ట్ చేయడం దారుణమన్నారు.

బొత్స 2
ప్రమాదానికి కారకులైన వారిని వదిలిపెట్టి న్యాయం చేయమని కోరుతున్న కుటుంబ సభ్యులను అరెస్ట్ చేయడం దారుణమని, బొత్స సత్యనారాయణ వెంటనే రాజీనామా చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని అరెస్ట్ చేసి గోల్కొండ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

బొత్స 3
బాధితులు ఆందోళన అక్కడా కొనసాగించారు. అనంతరం సాయంత్రం బాధిత కుటుంబ సభ్యులతో మంత్రి బొత్స సమావేశమై పరిహారం విషయమై వారికి హామీ ఇచ్చారు.

బొత్స 4
ప్రైవేట్ వాహనాల్లో జరిగే ప్రమాదాల బాధితులకు పరిహారం అందించాల్సిన బాధ్యత వాటి యాజమాన్యాలకే ఉంటుందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.

బొత్స 5
ప్రైవేట్ వాహనాల ప్రమాద బాధితులకు పరిహారం చెల్లించే అంశం ప్రభుత్వానిది కాదని ఆయన స్పష్టం చేశారు. పాలెం బస్సు ప్రమాద ఘటన ఆందోళనలపై రాజకీయం నడుస్తోందని ఆరోపించారు.

బొత్స 6
శనివారం సాయంత్రం ఆయన పాలెం బస్సు ప్రమాద ఘటన మృతుల కుటుంబాలతో పరిహారం అంశంపై చర్చలు జరిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ పరిహారం చెల్లింపు విషయమై కర్ణాటక ప్రభుత్వానికి లేఖ రాస్తామని చెప్పారు.

బొత్స 7
పాలెం బస్సు బాధితుల కుటుంబ సభ్యులతో రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అమానుషంగా వ్యవహరించారని టిడిపి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ విమర్శించారు.

బొత్స 8
కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తే అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించి కనీసం మంచి నీళ్లు కూడా ఇవ్వలేదని పయ్యావుల కేశవ్ విమర్శించారు.

బొత్స 9
బాధిత కుటుంబాల సభ్యులు శనివారం ఉదయం రవాణా మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటికి వచ్చారు. తాము మంత్రితో అపాయింట్‌మెంట్ తీసుకొనే వచ్చామని బాధితులు చెప్పినా లోపలికి అనుమతించేందుకు పోలీసులు ససేమిరా అన్నారు.

బొత్స 10
దీంతో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది. ప్రమాదం జరిగి ఇన్ని రోజులైనా బాధ్యులను ఇప్పటి వరకూ అరెస్టు చేయలేదని.. పరిహారం చెల్లింపులోనూ జాప్యం చేస్తున్నారని, ఇందుకు బాధ్యత వహించి బొత్స రాజీనామా చేయాలని బాధితులు డిమాండ్ చేశారు.

బొత్స 11
మంత్రుల క్వార్టర్స్‌లోని బొత్స ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. ఇంటి ముట్టడికి ప్రయత్నించారు. దీంతో, పోలీసులు మహిళలు, చిన్నపిల్లలని కూడా బలవంతంగా వ్యాను ఎక్కించారు.

బొత్స 12
తన రెండేళ్ల బాబును లాక్కోవడంతో నవీన (భర్త శివకుమార్, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను కోల్పోయారు) అనే మహిళ గట్టిగా రోదించింది. దీంతో, మిగతా బాధితులు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

బొత్స 13
బాధితులను అదుపులోకి తీసుకుని గోల్కొండ స్టేషన్‌కు తరలించారు. తాము ఏ తప్పు చేశామని ఇక్కడికి తీసుకొచ్చారో చెప్పేదాకా దిగేది లేదని బాధితులు బీష్మించడంతో పోలీసులు ఆ వ్యానును ఎండలో పార్కింగ్ చేశారు.

బొత్స 14
దీంతో, ఇద్దరు మహిళలు సొమ్మసిల్లి పడిపోయారు. పరిస్థితి అప్పటికే మంత్రికి చేరడంతో చర్చలకు పిలిపించారు. బొత్స ఇంటికి వెళ్లిన బాధితుల పైనే బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు.

బొత్స 15
బాధితుల వినతి పత్రాన్ని మంత్రి బొత్స తీసుకోవడంతో పోలీసులు వారిని అక్కడి నుంచి బయటకు పంపారు. అరెస్టుల విషయం తెలిసిన వెంటనే బిజెపి నేత నాగం జనార్దన రెడ్డి గోల్కొండ పోలీసు స్టేషన్‌కు తరలి వచ్చారు.

బొత్స 16
దివాకర్ ట్రావెల్స్ పేరుతో ఉన్న బస్సులను జబ్బార్ ట్రావెల్స్ నడుపుతున్నా ప్రభుత్వం చూసీ చూడనట్లు వ్యవహరిస్తోందని నాగం మండిపడ్డారు. బాధిత కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications