మరో ప్లాన్: ఈ-ఆఫీస్, బాబు తొలి డిజిటల్ సంతకం (పిక్చర్స్)
హైదరాబాద్: సచివాలయాన్ని వచ్చే ఏడాది మార్చి 31 నాటికి ఈ-సచివాలయంగా మార్పు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం చెప్పారు.
ఈ-ఆఫీసుపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఒక ఫైలుపై తొలి డిజిటల్ సంతకాన్ని చంద్రబాబు చేయడం ద్వారా ఈ ప్రక్రియను ప్రారంభించారు.
సచివాలయం నుంచి గ్రామ స్థాయి వరకు ఈ-ఫైల్ సిస్టమ్‌ను ఏర్పాటుచేయడం వల్ల పాలనలో వేగం తీసుకురావచ్చునని చెప్పారు. అలాగే పారదర్శకత కూడా పెంపొందించేందుకు ఆస్కారం ఉంటుందన్నారు.

ఈ-ఆఫీస్
ఫైళ్లు నిర్వహణ, ఫైళ్లు ఎక్కడ ఉన్నాయి, ఏ స్థాయిలో ఉన్నాయన్నది కూడా గుర్తించేందుకు ఈ-ఆఫీస్‌లో అవకాశాలు పెరుగుతాయన్నారు. దీనివల్ల అధికారులు, ఉద్యోగులకు పనిభారం కూడా తగ్గుతుందన్నారు. విలువైన సమయం కూడా ఆదా అవుతుందని చంద్రబాబు చెప్పారు.

ఈ-ఆఫీస్
అధికారి ఎక్కడ ఉన్నా ఫైళ్లను అక్కడి నుంచే పరిష్కరించేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. ఫైళ్లను దాచి ఉంచాల్సిన స్థలం సమస్య, పాత ఫైళ్లను బూజు దులిపే సమయంలో వచ్చే అలర్జీ కూడా తగ్గుతుందన్నారు.

ఈ-ఆఫీస్
సాంకేతికతను అందిపుచ్చుకోలేకపోవడం వల్ల కాలంతో పరుగులు తీయలేకపోతున్నామని, ఉద్యోగులు సహకరించి కొత్త విధానానికి శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు. దీనిపై ప్రభుత్వం నుంచి వత్తిళ్లు ఉండబోవని, అయితే సాంకేతిక దిశగా అభివృద్ధి చెందాల్సిన అవసరాన్ని మరచిపోరాదన్నారు.

ఈ-ఆఫీస్
ఈ-ఫైళ్ల నిర్వహణపై ఉద్యోగులకు, నిపుణులతో శిక్షణ ఇప్పించనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ విధానానికి అంతా సహకరించి ఆదర్శవంతమైన సచివాలయ వ్యవస్థను రూపొందించేందుకు చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ-ఆఫీస్
ఈ వ్యవస్థను ముందుగా పది శాఖల్లో ప్రవేశపెడతామని, తరువాత మిగిలిన శాఖలకు విస్తరిస్తామని చంద్రబాబు నాయుడు వెల్లడించారు.

చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎస్ ఐవైఆర్ కృష్ణారావుతో శనివారం నాడు ఆయా జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన దృశ్యం.












Click it and Unblock the Notifications