జగన్‌చేతిలో ఈనాడు, ఆఫీస్‌లో ఏబీఎన్: బాబు(పిక్చర్స్)

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో రుణమాఫీ పరిమితి పైన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి అగ్గిమీద గుగ్గిలమయ్యారు.

ఎన్నికల ప్రచారంలో రుణాలు మొత్తం మాఫీ చేస్తామని చెప్పి, ఇప్పుడు పరిమితి విధించడమేమిటని ప్రశ్నించారు. గురువారం నుండి చంద్రబాబు దిష్టిబొమ్మలను ప్రతి గ్రామంలో దగ్ధం చేస్తామని చెప్పారు.

మరోవైపు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యవసాయం, నీటి పారుదల పైన శ్వేతపత్రం విడుదల చేశారు. ఎర్రచందనం అమ్మకం సమర్థనీయమేనని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి సమాధానం చెప్పారు. ఎర్రచందనం స్మగ్లర్ల భరతం పడతామని చెప్పారు.

చంద్రబాబు

చంద్రబాబు

వ్యవసాయం, నీటి పారుదల పైన శ్వేతపత్రం విడుదల చేసిన సమయంలో పరకాల ప్రభాకర్‌తో మాట్లాడుతున్న ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.

చంద్రబాబు

చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం సాయంత్రం వ్యవసాయం, నీటి పారుదల పైన శ్వేతపత్రం విడుదల చేశారు.

చంద్రబాబు

చంద్రబాబు

వ్యవసాయం పైన పదేళ్లుగా ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించాయని చంద్రబాబు శ్వేతపత్రం విడుదల సమయంలో ఆరోపించారు. రుణమాఫీతోనే రైతుల సమస్యలు అన్నీ తీరవని, ఇది ఆరంభం మాత్రమే అన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

గత పదేళ్లలో వ్యవసాయం కుదేలైందని చంద్రబాబు శ్వేతపత్రం విడుదల సమయంలో అన్నారు. రాష్ట్రంలో 70 శాతం మంది వ్యవసాయం పైనే ఆధారపడి జీవిస్తున్నారని చెప్పారు.

ఏబీఎన్లో చూపిస్తూ..

ఏబీఎన్లో చూపిస్తూ..

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ఆయన లోటస్ పాండులో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చిన టీడీపీ యాడ్ చూపిస్తున్న దృశ్యం.

ఈనాడు

ఈనాడు

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ఆయన లోటస్ పాండులో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈనాడులో వచ్చిన యాడ్ చూపిస్తున్న జగన్ దృశ్యం.

ఈనాడు

ఈనాడు

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ఆయన లోటస్ పాండులో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈనాడులో వచ్చిన యాడ్ చూపిస్తున్న జగన్ దృశ్యం.

ఈనాడు

ఈనాడు

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ఆయన లోటస్ పాండులో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈనాడులో వచ్చిన యాడ్ చూపిస్తున్న జగన్ దృశ్యం.

జగన్

జగన్

జగన్ మాట్లాడుతూ... ఈ ఎన్నికలు విశ్వసనీయతకు, వంచనకు మధ్య జరిగాయని తాను మొదటి నుండి చెబుతున్నానని అన్నారు. రాష్ట్రం విడిపోతే ఏపీకి అన్యాయం జరుగుతుందని తెలిసినా చంద్రబాబు ఎందుకు ఓటు వేయించారని ప్రశ్నించారు.

జగన్

జగన్

ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ఇప్పుడు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చంద్రబాబు చేస్తున్నారని జగన్ ఆరోపించారు. రాష్ట్రం విడిపోతే పరిస్థితిలు ఎలా ఉంటాయో చంద్రబాబుకు ముందే తెలుసునని చెప్పారు.

జగన్

జగన్

విడిపోతే పరిస్థితి ఎలా ఉంటుందో బాబుకు, జగన్‌కు తెలియదని చెప్పేందుకు వీలులేదని జగన్ అన్నారు. చంద్రబాబు ఎన్నికల సమయంలో తెలంగాణ, ఏపీ మేనిఫెస్టోలతో ముందుకు వెళ్లారన్నారు.

జగన్

జగన్

వ్యవసాయ రుణాలు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని చెప్పిన బాబు ఇప్పుడు కల్లిబొల్లి కారణాలు చెబుతున్నారని జగన్ అన్నారు. బాబు రుణాల మాఫీ చేస్తానని ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారని, సంతకాలు చేశారన్నారు.

జగన్

జగన్

తాము అధికారంలోకి వస్తే అన్ని రుణాలు మాఫీ చేస్తామని, ఇంటికో ఉద్యోగం లేదా, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారని, ఇప్పుడు వేటిని చేయలేకపోతున్నారని జగన్ అన్నారు.

జగన్

జగన్

రుణమాఫీ పైన కోటయ్య కమిటీ వేసి... మీ అభిప్రాయలను ఎందుకు రుద్దుతున్నారని చంద్రబాబును జగన్ ప్రశ్నించారు. కోటయ్య కమిటీ వేసి రుణమాఫీ పైన పరిధిని ఎందుకు విధిస్తున్నారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+