వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బైక్ నడిపిన బాబు.. జగన్‌ను సైకో అన్నారు (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

ఏలూరు/విజయవాడ: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబ నాయుడు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన శనివారం నిప్పులు చెరిగారు.

సోనియా గాంధీ కాదని, గాడ్సే అని, ఓట్లు, సీట్ల కోసం విభజన చేస్తున్నారని, పంజాబ్, కాశ్మీర్, శ్రీలంకలో ఏం జరిగింతో కాంగ్రెసుకు తెలియదా అని ప్రశ్నించారు.

వైయస్ జగన్ సమైక్య ముసుగు వేసుకున్న సైకో అని ధ్వజమెత్తారు. తెలుగువాళ్లతో పెట్టుకుండే ఖబడ్దార్ అంటూ కాంగ్రెసు పార్టీని హెచ్చరించారు. ప్రధాని రజనీకాంత్ రోబోలా రబ్బరుస్టాంపులా మారిపోయారన్నారు. కిరణ్ కొత్త బిచ్చగాడన్నారు.

చంద్రబాబు 1

చంద్రబాబు 1

రాష్ట్ర విభజనపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీపై తీవ్రంగా హెచ్చరించారు. సోనియా గాంధీ గుండెల్లో నిద్రపోతానని, రైళ్లు పరిగెత్తిస్తానని, మడమ తిప్పేది లేదని ఆయన అన్నారు.

చంద్రబాబు 2

చంద్రబాబు 2

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో శనివారం సాయంత్రం జరిగిన ప్రజాగర్జన సదస్సులో ఆయన ప్రసంగించారు. ఈ నాయకులకు తాను భయపడేది లేదని ఆయన అన్నారు.

చంద్రబాబు 3

చంద్రబాబు 3

తానంటే సోనియా గాంధీకి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని, అందుకే కుట్ర రాజకీయాలు చేస్తున్నారని ఆయన అన్నారు. తనపై వైయస్ రాజశేఖర రెడ్డి కేసులు పెట్టారని, విచారణ జరిపించాలని, అయినా ఏమీ తేల్చలేకపోయారని, తాను నిప్పులా బతికానని ఆయన అన్నారు.

చంద్రబాబు 4

చంద్రబాబు 4

మీ సంగతి చూస్తాను, ఖబడ్దార్ అంటూ ఆయన సోనియా గాంధీని హెచ్చరించారు. కుట్ర రాజకీయాలు చేస్తున్న వైయస్సార్ కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి భూస్థాపితమవుతాయని ఆయన అన్నారు.

చంద్రబాబు 5

చంద్రబాబు 5

గాంధీని చంపిన గాడ్సేలా తెలుగుజాతిని చంపిన గాడ్సే సోనియా గాంధీ అని ఆయన వ్యాఖ్యానించారు. పార్లమెంటులో గొడవకు సోనియానే కారణమని ఆయన అన్నారు.

చంద్రబాబు 6

చంద్రబాబు 6

విద్వేషాల వల్ల రాష్ట్రం నష్టపోయిందని అన్నారు. విభజన రాజకీయాలతో తెలుగుజాతి మధ్య విద్వేషాలు పెంచారని ఆయన విమర్సించారు.

చంద్రబాబు 7

చంద్రబాబు 7

విభజన అంశం చాలా సున్నితమైందని, ఇరు ప్రాంతాలవారితో చర్చించి సమస్యను పరిష్కరించాలని చెప్పానని, అయినా వినలేదని ఆయన అన్నారు.

చంద్రబాబు 8

చంద్రబాబు 8

పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టిన విధానం అభ్యంతకరమని ఆయన అన్నారు. ఇటలీ నుంచి వచ్చిన సోనియాకు మన కష్టాలేం తెలుసునని చంద్రబాబు అడిగారు. విభజనలో రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు.

చంద్రబాబు 9

చంద్రబాబు 9

కాంగ్రెసు తెలంగాణలో తెరాసతో, సీమాంధ్రలో సైకో జగన్‌తో కుమ్మక్కయి కుట్ర రాజకీయాలు చేస్తోందని ఆయన అన్నారు. తెలుగుదేశం కారణంగానే మూడు సార్లు కేంద్రంలో కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఏర్పడ్డాయని, ప్రజలు సహకరిస్తే తిరిగి కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం వస్తుందని ఆయన అన్నారు.

చంద్రబాబు 10

చంద్రబాబు 10

ప్రజాస్వామ్యాన్ని సోనియా భ్రష్టు పట్టించారని అన్నారు. అధికారం కోసం తెలుగుజాతితో ఆడుకునే అధికారం ఎవరిచ్చారని అడిగారు. రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో పెట్టిన ఘనత తమ పార్టీదేనని ఆయన అన్నారు.ఖబడ్దార్ మీ సంగతి చూస్తామని హెచ్చరించారు.

చంద్రబాబు 11

చంద్రబాబు 11

హైదరాబాద్‌ను కెసిఆర్ అభివృద్ధి చేశాడా, కాంగ్రెసు దొంగలు చేశారా, జగన్ చేశాడా, వైయస్ చేశాడా, కిరణ్ చేశాడా అని అడుగుతూ తమ పార్టీ ప్రభుత్వమే అభివృద్ధి చేసిందని చెప్పుకున్నారు.

English summary
Photos of Telugudesam Party chief Nara Chandrababu Naidu's in Seemandhra district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X